Bigg Boss 7 Telugu: ‘నేనైతే కారుతో గుద్దిపడేసేవాడిని’.. అమర్ కారు దాడిపై సోహైల్ రియాక్షన్..

| Edited By: Ram Naramaneni

Dec 20, 2023 | 12:21 PM

తాజాగా ఈ వివాదంపై బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ రియాక్ట్ అయ్యాడు. ఓ వ్యక్తిపై అభిమానం ఉండాలి కానీ ఉన్మాదం పనికిరాదు. అమర్ కారుపై దాడి చేసింది కూడా అందరు యువకులే. ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నాము. ఇలాంటి పనులు చేసి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురాకండి అన్నారు సోహైల్. దాడి చేసిన సమయంలో అమర్ తోపాటు కారులో అతడి అమ్మగారు, భార్య తేజు ఉన్నారు. కారును చుట్టుముట్టి అద్దాలు పగులకొట్టి ఆపై వారందరినీ నోటికి వచ్చిన బూతులు తిట్టారు. మరోకరు ఆ బూతులు వినలేడు.

Bigg Boss 7 Telugu: నేనైతే కారుతో గుద్దిపడేసేవాడిని.. అమర్ కారు దాడిపై సోహైల్ రియాక్షన్..
Sohel, Amardeep
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 7 టైటిల్ విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే గ్రాండ్ ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ బయట అమర్, ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఆ గొడవ కాస్త అమర్ దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. హౌస్‏లో ఉన్న సమయంలో ప్రశాంత్, అమర్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. కొన్ని సందర్భాల్లో వీరిద్దరు హద్దుమీరి కొట్టుకునేంతవరకు వెళ్లింది. కానీ ఆ తర్వాత వీరిద్దరి స్నేహితులుగా ఉండేవారు. అయితే చివరి రెండు మూడు వారాల్లో ప్రశాంత్ ను అమర్ కొరకడం.. ఆ తర్వాత ప్రశాంత్‏తో అమర్ ప్రవర్తనపై పూర్తిగా నెగిటివిటీ వచ్చింది. దీంతో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం అమర్ కారుపై దాడికి పాల్పడ్డారు ప్రశాంత్ ఫ్యాన్స్. ఆ సమయంలో తన కుటుంబసభ్యులతో కలిసి అమర్ ఉన్నాడు. అమర్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేసి కారు అద్దాలను పగలగొట్టారు. అయితే ఈ విషయంపై చాలా మంది రియాక్ట్ అవుతున్నారు.

తాజాగా ఈ వివాదంపై బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ రియాక్ట్ అయ్యాడు. ఓ వ్యక్తిపై అభిమానం ఉండాలి కానీ ఉన్మాదం పనికిరాదు. అమర్ కారుపై దాడి చేసింది కూడా అందరు యువకులే. ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నాము. ఇలాంటి పనులు చేసి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురాకండి అన్నారు సోహైల్. దాడి చేసిన సమయంలో అమర్ తోపాటు కారులో అతడి అమ్మగారు, భార్య తేజు ఉన్నారు. కారును చుట్టుముట్టి అద్దాలు పగులకొట్టి ఆపై వారందరినీ నోటికి వచ్చిన బూతులు తిట్టారు. మరోకరు ఆ బూతులు వినలేడు.

ఒక కొడుకుగా చెబుతున్నా.. ఇలాంటి మాటలు నాకే ఎదురైతే గనుగా ఆ సమయంలో కారుతోనే గుద్దిపడేసేవాడిని.. తల్లిదండ్రులను ఎవరిలోనైనా ఇదే అభిప్రాయం వస్తుంది. అమ్మ, భార్యను తన ముందే ఇలా తిడితే ఎవడూ సహించడు. కారుతోనే గుద్దిపారేస్తాడు. కానీ అమర్ సైలెంట్ గా వెళ్లిపోయాడు. అమర్ చాలా మంచోడు. ఇండస్ట్రీలో ఎవరినీ అడిగినా అదే చెబుతారు” అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.