
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహానికి చెందిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్ల చేస్తున్న ఈ పనిపై మహారాష్ట్ర సైబర్ పోలీసులు నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చారు. చట్టపరమైన మార్గదర్శకాలు ఉల్లంఘించినట్లు తేలితే కఠినమైన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర సైబర్ సెల్ నెటిజన్లను హెచ్చరించారు. సైబర్ శాఖ తమ ట్విట్టర్ అకౌంట్‌లో ఈ విషయాన్ని పోస్టు చేసింది. అలాంటి ఫోటోలను పోస్టు చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే వీలు ఉన్నట్లు సైబర్ సెల్ తన వార్నింగ్‌లో పేర్కొన్నది.
ఇదే విషయాన్ని బాలీవుడ్ ప్రముఖులు కూడా తీవ్రంగా ఖండించారు. డెడ్‌బాడీ ఫోటోలను సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేయటాన్ని అలియా భట్, ఆమె సోదరి షాహిన్ తప్పుపట్టారు. ఇది సరైన పద్ధతికాదని అన్నారు.