గలాటా గీతూ.. బిగ్ బాస్ సీజన్ 6లో సాలిడ్ కంటెస్టెంట్. ఆమె ఆటతీరు చూసి పక్కా టాప్-5 లో ఉంటుందని ఫిక్స్ అయ్యారు. గీతూ అయితే తాను ఏకంగా విన్నర్ అవుతానని ఫిక్స్ అయిపోయింది. కానీ 9వ వారమే ఆమె ఇంటికి పంపించేశాడు బిగ్ బాస్. గీతూ ఆట మాత్రమే ఆడింది. ఆటను మాత్రమే పట్టించుకుంది. తన ఆట కోసం నమ్మినవారిని సైతం మోసం చేసింది. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. బిగ్ బాస్ హౌస్‌లోని అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఇదేం ఆట బిగ్ బాస్.. నేడు ఆడిస్తా అసలు ఆట అంటూ బిగ్ బాస్‌నే డామినేట్ చేసింది. ఇక్కడే అసలు మిస్టేక్ జరిగింది. కంటెస్టెంట్స్‌ని విసిగించినంత వరకూ ఓకే.. కానీ బిగ్ బాస్ టీమ్‌ను ఆమె తేలిగ్గా తీసిపారేయడం పెద్ద మైనస్‌గా చెప్పాలి. అందుకే నిర్ధాక్షణ్యంగా బయటకు పంపేశారు.
ఆ ఓటింగ్ ఎంతవరకు నిజం అనేది ఎవరికీ తెలీదు. నిజంగా చెప్పండి.. మెరీనా, రోహిత్, కీర్తి, వాసంతి లాంటి వాళ్లతో పోలిస్తే గీతూ ఏం తక్కువ చెప్పండి. గీతూ ఆటపై నెగిటివిటీ ఉన్నప్పటికీ.. ఆమెను బయటకు పంపాలన్నంత తక్కువ ఓట్లు అయితే వచ్చి ఉండవు. సో.. తమకే గేమ్ నేర్పించాలనుకున్న గీతూకి గుడ్ బై చెప్పేశాడు బిగ్ బాస్. రేటింగ్ తగ్గుతుందని తెలిసినప్పటికీ.. సైడ్ చేసేశాడు. ఆట ఎలా ఉండాలన్నది డిసైడ్ చేసేది ఆడియెన్స్ అని అనుకుంటే మూర్ఖత్వమే. ఎలా ఉంటే ఆట రసవత్తరంగా సాగుతుందో, రేటింగ్ వస్తుందో.. అలానే తీసుకెళ్తారు నిర్వాహకులు. అంతేకాని.. మీరు ఓట్లు తెగ గుద్దేసినంత మాత్రన ఫలితం ఉండదనేది కొందరి అభిప్రాయం.
ఊహించని ఎలిమినేషన్ కారణంగా గుండెల నిండా దు:ఖంతో బయటకు వచ్చిన గీతూ ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతుంది. తాజాగా ఆమె ఇన్ స్టాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ‘ఈ రోజుల్లో నటించేవాళ్లు అందరూ మంచివాళ్లు.. అందరికీ మంచి అయిపోతున్నారు. ముఖం మీద మాట్లాడేవాళ్లు చెడ్డగా కనిపిస్తున్నారు. అందుకే అన్నారేమో యదార్థవాది లోక విరోధి’ అని అంటూ ఆమె అందులో చెప్పుకొచ్చింది. అయితే ఈ పోస్ట్ కింద సైతం ఆమెను తప్పు పడుతూనే ఎక్కువమంది కామెంట్స్ చేయడం గమనార్హం.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..