Smriti Irani: రీ ఎంట్రీలోనూ అదే క్రేజ్.. కేంద్ర మాజీ మంత్రి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా?

బాలీవుడ్ బుల్లితెరపై బాగా ఫేమస్ అయిన సీరియల్స్ లో క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ' కూడా ఒకటి. ఇప్పుడు ఈ సీరియల్ రెండవ సీజన్ వస్తోంది. మొదటి భాగంలో కీలక పాత్ర పోషించిన స్మృతి ఇరానీ రెండో సీజన్ లోనూ లీడ్ రోల్ పోషిస్తున్నారు..

Smriti Irani: రీ ఎంట్రీలోనూ అదే క్రేజ్.. కేంద్ర మాజీ మంత్రి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా?
Smriti Irani

Updated on: Jun 03, 2025 | 4:16 PM

‘క్యోంకి సాస్ భీ కభీ బహు ధీ’ బాలీవుడ్ బుల్లితెర ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్న సీరియల్స్ లో ఇది కూడా ఒకటి. చాలా సంవత్సరాల తర్వాత, ఈ సీరియల్ మళ్ళీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఈ సీరియల్ రెండవ సీజన్ త్వరలో విడుదల కానుంది. దీని కోసం బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సీరియల్‌లో స్మృతి ఇరానీ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈసారి కూడా ఆమె అమర్ ఉపాధ్యాయ్‌తో జతకట్టనున్నారు. ఈ సీరియల్‌ను ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సీరియల్ కోసం స్మృతి ఇరానీ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా?

క్యోంకి సాస్ భీ కభీ బహు థి 2′ సీరియల్ కోసం స్మృతి ఇరానీ భారీ పారితోషికం తీసుకుంటున్నారు. ఇండియా ఫోరం నివేదిక ప్రకారం, తులసి పాత్ర కోసం స్మృతి ఇరానీ ఎపిసోడ్‌కు రూ. 14 లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, దీని గురించి ఇంకా అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. దీనితో పాటు, స్మృతి ఇరానీ Z+ భద్రతతో షూటింగ్ చేస్తున్నట్లు కూడా తెలిసింది. సెట్స్‌లో కఠినమైన ప్రోటోకాల్‌లను పాటిస్తున్నారు. మొబైల్ ఫోన్లను అనుమతించడం లేదు. సాధారణ జనాలను షూటింగ్ సెట్ లోకి అనుమతించడం లేదు.

ఇవి కూడా చదవండి

ఈ సిరీస్ పోస్టర్ షూటింగ్ పూర్తయిందని, ప్రోమో షూటింగ్ కు సన్నాహాలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. స్మృతి ఇరానీ రీ ఎంట్రీ కోసం బాలీవుడ్ బుల్లితెర జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీరియల్ విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన రావొచ్చని తెలుస్తోంది. క్యోంకి సాస్ భీ కభీ బహు థి చాలా ప్రజాదరణ పొందిన సీరియల్. ఈ సీరియల్‌లో తులసి కథను చూపించారు. తులసి కోడలుగా ఉన్నప్పుడు ఆమెతో ఎలా వ్యవహరించారో , తరువాత ఆమె అత్తగా మారినప్పుడు ఆమె ఎలా వ్యవహరించారో ఈ సీరియల్ చూపించారు. మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్ జూలై 3, 2000న విడుదలైంది. కాబట్టి ఇప్పుడు రెండవ సీజన్ ఎప్పుడు విడుదల అవుతుందో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

పండిట్ రవిశంకర్ తో స్మృతి ఇరానీ..

ఇవి కూడా చదవండి..

Tollywood: ‘ఆర్మీ ట్రైనింగ్‌ను, క్రికెట్‌ను మధ్యలో వదిలేశాను’.. పశ్చాత్తాపపడుతోన్న టాలీవుడ్ యాంకర్.. ఎవరంటే?

Tollywood: ఒకప్పుడు బార్ ముందు మంచింగ్ ఐటమ్స్ అమ్మాడు.. కట్ చేస్తే 800 కోట్ల సినిమాతో సంచలనం.. ఎవరో తెలుసా?

Tollywood: మహేష్‌తో సహా 12 మంది స్టార్స్ రిజెక్ట్ చేశారు.. చివరకు ఆ హీరో బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఏ మూవీనో తెలుసా?

OTT Movie: 8 కోట్లతో తీస్తే 83 కోట్లు.. IMDbలో 8.6 రేటింగ్‌.. ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్