Balika Vadhu-2 : కొత్త చిన్నారి పెళ్లి కూతురుగా శ్రేయా పటేల్‌..! వయసు 10 ఏళ్ల కన్నా తక్కువే..

Balika Vadhu-2 : బాలికా వధూ( చిన్నారి పెళ్లి కూతురు)’ సీరియల్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సీరియల్ ద్వారానే ఆనందిగా ప్రేక్షకులకు

Balika Vadhu-2 : కొత్త చిన్నారి పెళ్లి కూతురుగా శ్రేయా పటేల్‌..! వయసు 10 ఏళ్ల కన్నా తక్కువే..
Balika Badhu

Edited By:

Updated on: Jul 06, 2021 | 9:29 AM

Balika Vadhu-2 : బాలికా వధూ( చిన్నారి పెళ్లి కూతురు)’ సీరియల్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సీరియల్ ద్వారానే ఆనందిగా ప్రేక్షకులకు పరిచయమైన చైల్డ్ ఆర్టిస్ట్ అవికా గోర్.. ఇప్పుడు హీరోయిన్‌గా రాణిస్తోంది. కాగా ఈ సక్సెస్‌ఫుల్ సీరియల్‌కు సీక్వెల్ తీసుకురావాలని ప్రేక్షకులు డిమాండ్ చేయడంతో త్వరలోనే కలర్స్ టీవీ ‘బాలికా వధూ’ సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

అయితే ఆనంది పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది ఇప్పటి వరకు సీరియల్ యూనిట్ ప్రకటించలేదు. తాజాగా ఆ పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ శ్రేయా పటేల్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సీజన్లో శ్రేయ కొత్త ఆనంది అవుతుంది. కొన్ని వారాల క్రితం కలర్స్ టీవీ షేర్ చేసిన మొదటి ప్రోమోలో ఆనంది పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు కానీ ఇప్పుడు ఛానెల్ షేర్ చేసిన ప్రోమోలో శ్రేయను వధువుగా చూడవచ్చు.

ఈ ప్రోమో థీమ్ సాంగ్ కూడా వినవచ్చు. దీనితో ఆనందీని వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. సమాజంలో బాల్యవివాహానికి వ్యతిరేకంగా మరోసారి పోరాడతానని ఆమె చెప్పింది. ప్రోమోను పంచుకునేటప్పుడు ఛానెల్ క్యాప్షన్‌లో ఇలా రాశారు. ‘బాల్యవివాహం అంటే సమాజంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న చెడు అలవాటు. దాన్ని రూపుమాపడానికి కొత్త ఆనందీ, కొత్త బాలికా వధుగా వస్తున్నారు. అయితే ఈ సీరియల్ త్వరలో COLORS లో మాత్రమే రాబోతోంది.

ఈ టీజర్ చూసిన ప్రేక్షకులు ఫస్ట్ సీజన్‌ను గుర్తుచేసుకుంటూ కామెంట్స్ పెట్టారు. ‘బాలికా వధూ’లో ఎదిగిన ఆనంది పాత్రలో కనిపించిన లేట్ యాక్ట్రెస్ ప్రత్యూష బెనర్జీని స్మరించుకున్న ఆడియన్స్.. సీజన్ 2 కోసం ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లు తెలిపారు. కాగా ‘బాలికా వధూ ’ షూటింగ్ లాస్ట్ వీక్ రాజస్థాన్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత ముంబై‌లో నెక్స్ట్ షెడ్యూల్ ఉండనుండగా.. శ్రీయా పటేల్, వంశ్ సయానీ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు.

Karan Johar: ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ చేయనున్న స్టార్ ప్రొడ్యూసర్.. వైరల్ అవుతున్న ట్వీట్

Bollywood News: బాలీవుడ్‏లో కొత్త రచ్చ… సంచలనం రేపుతున్న హీరోయిన్స్ వ్యాఖ్యలు..

Vijay Devarakonda : కొత్త లుక్‌తో అదరగొడుతున్న విజయ్ దేవరకొండ..! భారీ కండలు, పొడవాటి జుట్టుతో వైరల్ అవుతున్న ఫొటో..