AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివగామి పాత్ర చేసినందుకు ఫీల్ అవుతోన్న రమ్య

శివగామి పాత్ర చేసినందుకు ప్రముఖ నటి రమ్యకృష్ణ ఫీల్ అవుతున్నారట. ఆమె ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారని ఆశ్చర్యపోతున్నారా? కొన్ని కొన్ని సినిమాలు వారి జీవితాల్లో అలా గుర్తిండిపోతూంటాయి. హీరోయిన్‌గా చేసి ఫేడౌట్ అయిపోయి తరువాత..

శివగామి పాత్ర చేసినందుకు ఫీల్ అవుతోన్న రమ్య
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 17, 2020 | 4:45 PM

Share

టాలీవుడ్‌లో ‘బాహుబలి’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమాకి మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా ‘బాహుబలి’లో శివగామి పాత్ర అదనపు ఆకర్షణ అనే చెప్పాలి. ఆమె గంభీరత్వం.. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. అయితే ఇప్పుడు ఈ పాత్ర చేసినందుకు ప్రముఖ నటి రమ్యకృష్ణ ఫీల్ అవుతున్నారట. ఆమె ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారని ఆశ్చర్యపోతున్నారా? కొన్ని కొన్ని సినిమాలు వారి జీవితాల్లో అలా గుర్తుండి పోతూంటాయి.

హీరోయిన్‌గా చేసి ఫేడౌట్ అయిపోయిన తరువాత.. శివగామి రూపంలో మంచి పాత్ర లభించింది. దీంతో ఆమె స్టార్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. దాన్ని కంటిన్యూ చేయడం కూడా అంత సులభం కాదు. ప్రతీసారి అలాంటి పాత్రలు రావు. చిన్న పాత్రల్లో కూడా కనిపించలేరు. ఇప్పుడు ఈ సీనియర్ నటీమణి పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉందట. అప్పట్లో కేఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో.. రజినీకాంత్ హీరోగా నటించిన ‘నరసింహా’ సినిమాలో వాంప్(విలన్) పాత్రలో ఎంతలా ఒదిగిపోయారో తెలిసిందే. ఆ తర్వాత అలాంటి పవర్ ఫుల్ రోల్ మళ్లీ రాలేదు.

మళ్లీ ఎన్నో ఏళ్లకు బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో కనిపించి ఆమె నటా విశ్వ రూపాన్ని చూపించారు. నిజానికి ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ల కంటే ఆమెకే మంచి పేరు వచ్చింది. శివగామి తర్వాత రమ్య ఏ పాత్ర చేసినా.. అభిమానులను మెప్పించడం లేదు. తాజాగా ఆమె ఇప్పుడు తన భర్త కృష్ణ వంశీ డైరెక్షన్‌లో ‘రంగ మార్తాండ’ సినిమాలో నటిస్తున్నారు. మరి ఇందులో రమ్య ఎలాంటి పాత్రలో కనిపిస్తారా అన్నది చూడాలి.

Read More this also:దారుణంగా పడిపోయిన టమాటా ధరలు.. పదికి 3 కిలోలు

 సీఎం జగన్‌పై నాగబాబు సెటైర్స్!

సిల్వర్ స్క్రీన్‌పై ‘కరోనా’ మూవీ

ఫ్లూ, జలుబు, కరోనాల మధ్య తేడాలు ఇవే!

రోజా టైమింగ్‌కి దిమ్మ తిరగాల్సిందే!

అవకాశం కోసం వెళ్తే.. ఓ నిర్మాత పడకగదికి రమ్మన్నాడు: హీరోయిన్ సంచలన కామెంట్స్..

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా