బన్నీ మూవీ ఆలస్యానికి కారణమిదేనా..!

త్రివిక్రమ్‌తో బన్నీ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చి రెండు నెలలపైనే అయింది కానీ ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. అదుగో అప్పుడు, ఇదుగో ఇప్పుడు అంటూ వార్తలు వచ్చినా షూటింగ్‌ తేదీపై మాత్రం మూవీ యూనిట్ క్లారిటీని ఇవ్వడం లేదు. ఈ క్రమంలో చెర్రీ పుట్టినరోజు నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళుతుందని ఇటీవల పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లేందుకు మరింత సమయం పట్టనుందని తెలుస్తోంది. మొత్తం స్క్రిప్ట్‌ను […]

బన్నీ మూవీ ఆలస్యానికి కారణమిదేనా..!
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2019 | 12:30 PM

త్రివిక్రమ్‌తో బన్నీ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చి రెండు నెలలపైనే అయింది కానీ ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. అదుగో అప్పుడు, ఇదుగో ఇప్పుడు అంటూ వార్తలు వచ్చినా షూటింగ్‌ తేదీపై మాత్రం మూవీ యూనిట్ క్లారిటీని ఇవ్వడం లేదు. ఈ క్రమంలో చెర్రీ పుట్టినరోజు నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళుతుందని ఇటీవల పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లేందుకు మరింత సమయం పట్టనుందని తెలుస్తోంది.

మొత్తం స్క్రిప్ట్‌ను విన్న బన్నీ రెండో భాగంలో కొన్ని మార్పులు చేయమని చెప్పాడట. దీంతో త్రివిక్రమ్‌ టీమ్ ఆ పనిలో ఉందట. త్వరలోనే మార్పులతో కూడిన స్క్రిప్ట్‌ను బన్నీకి వినిపించనున్నాడట త్రివిక్రమ్. దానికి అల్లు అర్జున్‌ ఓకే చెబితే ఏప్రిల్‌ నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఖరారు కాగా నగ్మా మరో కీలక పాత్రలో కనిపించనుంది. హారీక హాసిని క్రియేషన్స్‌పై రాధాకృష్ణ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నాడు.