మద్యం తాగి బరువు పెరిగా అని పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారు.. ఐదేళ్లు నరకం చూశా.. హీరోయిన్ ఎమోషనల్
హీరోయిన్స్ చాలా మంది ఫిట్ నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. సినిమాల్లో పాత్రకు తగ్గట్టుగా హీరోయిన్స్ బరువు పెరగడం తగ్గడంలాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది స్టార్ హీరోయిన్స్ రెగ్యులర్ గా జిమ్‌లో కష్టపడుతూ ఉంటారు. సినిమాలకు తగ్గట్టుగా శరీర ఆకృతిని మార్చుకుంటూ ఉంటారు.

హీరోయిన్స్ ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్లిమ్ గా సన్నజాజి నడుముతో కనిపించడానికి హీరోయిన్స్ జిమ్ లో చమట్లు చిందిస్తూ ఉంటారు. కొంతమంది సినిమాల్లో పాత్రలకు తగ్గట్టుగా బరువు పెరగడం, తగ్గడం వంటివి చేస్తుంటారు. కొంతమంది మాత్రం అనారోగ్య సమస్యలతోనో లేక మరేదో కారణం వల్లో ఊహించని విధంగా బరువు పెరుగుతుంటారు. ఇదిలా ఉంటే హీరోయిన్స్ బరువు పై నిత్యం సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ట్రోల్ చేస్తుంటారు. హీరోయిన్స్ ను తప్పుబడుతూ కొందరు పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేస్తుంటారు. అయితే ఓ హీరోయిన్ కూడా ఇలాంటి ట్రోల్స్ బారిన పడింది. మద్యం తాగడం వల్లే ఆమె లావు అయ్యింది అంటూ పిచ్చి పిచ్చి కూతలు కూశారు. దాంతో ఆమె చాలా మానసిక వేదన అనుభవించింది. ఆమె మరెవరో కాదు..
ఇది కూడా చదవండి : ఆ జబర్దస్త్ నటుడు నన్ను దారుణంగా మోసం చేశాడు.. పిచ్చిపిచ్చిగా తిట్టి, కొట్టి చాలా హింసించారు
తెలుగులో సొంతం సినిమాతో అడుగుపెట్టింది ముద్దుగుమ్మ నమిత. ఆమె అసలు పేరు భైరవి సినిమాల్లోకి వచ్చిన తర్వాత నమితగా మార్చుకుంది. ఈ అమ్మడు ఎంత క్రేజ్ సొంతం చేసుకుందంటే.. తమిళ్ ఇండస్ట్రీలో ఆమెకు ఏకంగా ఓ గుడి కూడా కట్టేశారు. కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని.. దేవతగా పూజలందుకుంది ఈ బ్యూటీ. తెలుగులో జెమిని సినిమాలో వెంకటేష్ కు జోడీగా నటించింది. అలాగే మరికొన్ని సినిమాలు చేసి మెప్పించింది. కాగా కెరీర్‌లో బిగినింగ్ లో సన్నగా ఉన్న నమిత ఆతర్వాత బరువు పెరిగింది. చాలా కాలం గ్యాప్ తీసుకొని బిల్లా, సింహా సినిమాల్లో నటించింది. ఆ సినిమాల్లో బొద్దుగా కనిపించి అందర్నీ షాక్‌కు గురి చేసింది.
ఇది కూడా చదవండి : అందరూ అడుగుతున్నారు.. నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు.. సమంత ఎమోషనల్ కామెంట్స్
అయితే గతంలో ఇదే విషయంపై నమిత తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నమిత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్నిఆసక్తికర విషయాలను తెలిపింది. కొన్నేళ్ల క్రితం తాను బొద్దుగా మారిపోయాయి, బరువు పెరిగిన మొదట్లో ఎంతో మానసిక కుంగుబాటుకు లోనయ్యానని చెప్పింది. ఎంతో మనోవేదనకు గురయ్యా. అయితే ఒత్తిడితో ఇబ్బందిపడుతున్నాననే విషయం కూడా తనకు తెలిసేది కాదని.. రాత్రిపూట నిద్రపోయేదాన్ని కాదని. ఆహారం ఎక్కువగా తీసుకోవడం అలవాటుగా మారిందని, అందుకే తన బరువు 97 కిలోలకు చేరిపోయా అని తెలిపింది. కానీ కొంతమంది మద్యం తాగడం వల్లే బరువు పెరిగానని పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారని. కానీ ఎందుకు బరువు పెరిగాను అనే అసలు విషయం తనకు మాత్రమే తెలుసని చెప్పుకొచ్చింది. థైరాయిడ్, పీసీఓడీ సమస్యల వల్లే తాను లావుగా మారానని తెలిపింది. నెగిటివ్ కామెంట్స్ వల్ల ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయి. దాదాపు ఐదేళ్లపాటు తీవ్రమైన కుంగుబాటు ఎదుర్కొన్న తర్వాత యోగాతో మనశ్శాంతి లభించిందని తెలిపింది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన నమిత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అబిమానులను ఆకట్టుకుంటుంది.
ఇది కూడా చదవండి : బాబోయ్..! ఇక్కడెక్కడి సినిమా రా అయ్యా..!! రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి.. ఎక్కడ చూడొచ్చంటే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




