AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్..! ఇక్కడెక్కడి సినిమా రా అయ్యా..!! రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి.. ఎక్కడ చూడొచ్చంటే

ఎప్పటిలాగే ఈ వీకెండ్ లో కూడా పలు కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. అలాగే ఆసక్తికర వెబ్ సిరీస్ లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ లో సందడి చేస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం, మలయాళం తదితర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

బాబోయ్..! ఇక్కడెక్కడి సినిమా రా అయ్యా..!! రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి.. ఎక్కడ చూడొచ్చంటే
Gu Movie
Rajeev Rayala
|

Updated on: Jun 19, 2026 | 10:53 AM

Share

ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకునేలా ఎన్నో రకాల సినిమాలు విడుదలై ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ప్రతి శుక్రవారం రకరకాల జోనర్స్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఇక ఓటీటీలో ఆకట్టుకునే సినిమాల్లో ఎక్కువగా హారర్ సినిమాలు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల  హారర్ సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో హారర్ సినిమా ఓటీటీలో దుమురేపుతుంది. ప్రస్తుతం మలయాళ సినిమాలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడ చూసిన మలయాళ సినిమాల హడావిడే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా ఓ మలయాళ సినిమానే.. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీని షేక్ చేస్తుంది. అంతే కాదు ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ఈ మూవీ.. ఈ సినిమాలోని హారర్ సీన్స్ ప్రేక్షకులను నిద్రపట్టకుండా చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో చేయిపెడితే రూ. 100కోట్లు వచ్చి పడతాయి.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

ఆ సినిమా మరేదో కాదు.. మలయాళంలో వచ్చిన ‘గూ’. ఇది ఆసక్తికరమైన హర్రర్-ఫాంటసీ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా కథ ప్రధానంగా కేరళలోని మారుమూల గ్రామాల్లో నమ్మే ఒక స్థానిక పురాణ గాథ అలాగే మూఢనమ్మకాల చుట్టూ తిరుగుతుంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. కథ అంతా సాయి కృష్ణ (సాయిజు కురుప్), అతని భార్య, వారి కూతురు మియా చుట్టూ తిరుగుతుంది. నగరంలో నివసించే ఈ కుటుంబం సెలవుల కోసం కేరళలోని తమ పల్లెటూరి పూర్వీకుల ఇంటికి వెళ్తారు. ఆ ఊరిలో ఒక వింతైన ఆచారం, భయం దాగి ఉంటాయి. అక్కడ ‘గు’ అనే ఒక మాయా శక్తి తిరుగుతుందని, అది పిల్లలను ఆకర్షించి ఇబ్బంది పెడుతుందని గ్రామస్థులు నమ్ముతుంటారు. చుట్టుపక్కల దట్టమైన అడవి, పురాతనమైన ఇల్లు ఈ భయాన్ని మరింత పెంచుతాయి.

ఇది కూడా చదవండి : మల్లీ ఎంత మారిపోయింది.!! ఆర్ఆర్ఆర్‌లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు

నగర వాతావరణం నుండి వచ్చిన చిన్నారి మియాకు ఆ పల్లెటూరి వాతావరణం, అక్కడి ఆచారాలు వింతగా అనిపిస్తాయి. క్రమంగా ఆమెకు కొన్ని వింత అనుభవాలు ఎదురవుతాయి. ఎవరో తనని పిలుస్తున్నట్లు, ఒక అదృశ్య శక్తి తన చుట్టూ తిరుగుతున్నట్లు ఆమె ఫీల్ అవుతుంది. ఆతర్వాత ఏం జరిగింది. ఆ చిన్నారి ఎలా బయటపడింది. అసలు ఆ శక్తి ఆ చిన్నారిని ఎలా ఇబ్బందిపెట్టింది అన్నది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై రెండేళ్లు అవుతుంది. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది ఈ సినిమా.. ఇవాళ (జూన్ 19) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘మనోరమ మ్యాక్స్’ లో ఈ మిస్టరీ డ్రామా అధికారికంగా ప్రసారమవుతోంది.ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :అంత అందమైన బ్యూటీని ఇలా మార్చేశారేంట్రా బాబు..!! ఈ అందాల తారను గుర్తుపట్టారా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us