ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మరికొన్ని గంటల్లో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనుంది. ముంబైకి చెందిన నికోలయ్ సచ్ దేవ్ తో కలిసి ఆమె పెళ్లిపీటలెక్కనుంది. థాయ్ లాండ్ వేదికగా మంగళవారం (జులై 2) వీరి వివాహ వేడుక జరగనుంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. తాజాగా వరలక్ష్మి మెహందీ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా ఆమె తల్లి దండ్రులు రాధిక, శరత్‌కుమార్ స్టెప్పులేస్తూ సందడి చేశారు. మెహందీ వేదిక వద్దే అతిథులతో కలిసి డ్యాన్స్ చేస్తూ అలరించారు. విజయ్ దళపతి సూపర్ హిట్ సాంగ్ అపడి పోడి పాటకు రాధికా, శరత్ కుమార్ లు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటజన్లు ముందుగానే కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా వరలక్ష్మి, నికోలస్ సచ్ దేవ్ లది ప్రేమ వివాహం. ముంబైకు చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్ దేవ్ తో చాలా రోజులుగా ప్రేమలో ఉంది వరలక్ష్మి. ఇటీవలే వీరి ప్రేమకు పెద్దలు కూడా పచ్చ జెండా ఊపడంతో ఈ ఏడాది మార్చిలో ఉంగరాలు మార్చుకున్నారు. ఇప్పుడు థాయ్ లాండ్ పెళ్లిపీటలెక్కనున్నారీ లవ్ బర్డ్స్. కాగా తమ పెళ్లికి రావాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించింది వరలక్ష్మి. టాలీవుడ్ హీరోలను స్వయంగా కలసి తన పెళ్లి పత్రికలు కూడా అందజేసింది. వీటికి సంబంధించిన ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో వరలక్ష్మి వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది.
குத்து ஆட்டம் போட்ட சரத்குமார் குடும்பம்🔥⚡ | Varalakshmi Mehandi Function@realsarathkumar @realradikaa @varusarath5 #varalakshmi #Sarathkumar #Radhikasarathkumar #NicholaiSachdeva #VaralaxmiSarathkumar #varalakshmisarathkumar #VaralakshmiWedsNicholaisachdev #Nayanthara #GOAT pic.twitter.com/rsOk7AOkZM
— Gem cinemas (@GemCinemas) July 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.