PSPK 27 : క్రేజీ కాంబో రిపీటవుతోంది..!

|

Feb 16, 2020 | 9:10 PM

PSPK 27 : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం `ఖుషి`. ఇప్పడు చూసినా ఈ సినిమాలో సీన్స్ చాలా ప్రెష్‌గా ఉంటాయ్. ఈ మూవీలోని పవన్ మ్యానరిజమ్స్ ఇప్పటికి బయట యూత్ అనుసరిస్తూ ఉంటారు. టామ్ అండ్ జర్రీ మాదిరిగా భూమిక, పవన్ మధ్య సాగే లవ్ సీన్స్ ‌ కూడా మెస్మరైజ్ చేస్తాయి. ఇక నడుము సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..?. అప్పట్లో ఈ జోడి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా […]

PSPK 27 : క్రేజీ కాంబో రిపీటవుతోంది..!
Follow us on

PSPK 27 : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం `ఖుషి`. ఇప్పడు చూసినా ఈ సినిమాలో సీన్స్ చాలా ప్రెష్‌గా ఉంటాయ్. ఈ మూవీలోని పవన్ మ్యానరిజమ్స్ ఇప్పటికి బయట యూత్ అనుసరిస్తూ ఉంటారు. టామ్ అండ్ జర్రీ మాదిరిగా భూమిక, పవన్ మధ్య సాగే లవ్ సీన్స్ ‌ కూడా మెస్మరైజ్ చేస్తాయి. ఇక నడుము సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..?. అప్పట్లో ఈ జోడి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. పవన్, భూమికలో కెరీర్‌లో ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. 2001లో వచ్చిన అంతటి విజయం తర్వాత కూడా వీరిద్దరూ కలిసి మరో మూవీలో నటించలేదు.  అయితే, త్వ‌ర‌లోనే ఈ క్రేజీ జోడి మరోసారి కలిసి  కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం పవన్ హీరోగా డైరెక్టర్ క్రిష్ ఓ పిరియాడిక‌ల్ ఫిల్మ్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో సినిమాను మలుపు తిప్పే ఓ కీలక పాత్ర కోసం భూమికను సంప్రాదించాడట క్రిష్. ఆమె కూడా ఒప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే..ఖుషి` చిత్రాన్ని నిర్మించిన ఎ.ఎం. ర‌త్నంనే ఈ సినిమాని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి సెంటిమెంట్‌ వర్కవుట్ అయి ఈ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.

ఇది కూడా చదవండి : సైడై సేఫైయిపోయిన నాని