Chinni Serial: టీవీలో కొత్త డైలీ సీరియల్.. ‘చిన్ని’ టెలికాస్ట్ ఎప్పుడు, ఎక్కడంటే?

|

Jun 30, 2024 | 7:46 PM

చిన్ని.. ఈ పేరులోనే గుండె తలుపు తట్టే ఆప్యాయత, మనసుకి బాగా దగ్గరైన మమకారం వినిపిస్తాయి. ఈసారి స్టార్ మా ప్రారంభించబోతున్న సరికొత్త సీరియల్ పేరు "చిన్ని". తల్లి సెంటిమెంట్ నడిపించే ఒక కొత్త తరహా కథతో సిద్ధమైన ఓ అమ్మాయి కథ ఇది.

Chinni Serial: టీవీలో కొత్త డైలీ సీరియల్.. చిన్ని టెలికాస్ట్ ఎప్పుడు, ఎక్కడంటే?
Chinni Serial
Follow us on

చిన్ని.. ఈ పేరులోనే గుండె తలుపు తట్టే ఆప్యాయత, మనసుకి బాగా దగ్గరైన మమకారం వినిపిస్తాయి. ఈసారి స్టార్ మా ప్రారంభించబోతున్న సరికొత్త సీరియల్ పేరు “చిన్ని”. తల్లి సెంటిమెంట్ నడిపించే ఒక కొత్త తరహా కథతో సిద్ధమైన ఓ అమ్మాయి కథ ఇది. జైలు లో పుట్టి, జైలు లోనే తల్లితోపాటు వుండి, అదే ప్రపంచం అనుకుని, అక్కడున్నవాళ్ళే తన బంధువులు అనుకుని పదేళ్లవరకు పెరిగిన చిన్ని తల్లిని వదిలి బయటి ప్రపంచానికి వస్తుంది. అమ్మని వదిలి.. అమ్మ ఇచ్చిన నమ్మకంతో బయటకి కదిలిన చిన్ని తరవాతి జీవితం ఎలా వుండబోతోంది? అసలు తల్లి జైలు లో ఎందుకు ఉండాల్సివచ్చింది? చిన్ని కి నీడనిచ్చేది ఎవరు? అసలు పరిచయం లేని ప్రపంచంలో చిన్ని ఎలా వుండబోతోంది? అమ్మ లేని చోట తనకి అంత ప్రేమ దక్కుతుందా? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ “చిన్ని” సీరియల్. తల్లీ కూతుళ్ళ మధ్య ప్రేమానుబంధాలు, భావోద్వేగాలకు “చిన్ని” సీరియల్ వేదిక కాబోతోంది. చిన్ని చూడని ఓ కొత్త ప్రపంచం ఆమెని ఎలా అక్కున చేర్చుకోబోతోందో, చిన్ని అక్కడ ఎన్ని సమస్యలు ఎదుర్కోబోతోందో.. తల్లి ఇచ్చిన ధైర్యంతో ఎవరికి ఎలా సమాధానం చెప్పి నెగ్గుకొస్తుందో.. మనకి చెబుతుంది “చిన్ని” కథ.

స్టార్ మా లో “చిన్ని” సీరియల్ జులై 1 న ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది. స్టార్ మా ప్రేక్షకులకు ఇది ఓ కొత్త అనుభూతి. ఒక చిన్న పాప కథగా మొదలై, ఆమె పెరిగి పెద్దదయ్యే క్రమంలో చూసే కథంతా ఎన్నో మలుపులు.. మెరుపులు !! తప్పక చూడండి.

ఇవి కూడా చదవండి

రేపటి నుంచే ప్రారంభం..

స్టార్ మాలో ప్రసారం..