Karthika Deepam: భలే లాజిక్ పట్టారే.. ఇప్పటికీ తగ్గని వంటలక్క అందం.. నవ్వులు పూయిస్తున్న నెటిజన్ల కామెంట్స్..

|

Aug 17, 2022 | 8:42 AM

ప్రమాదం నుంచి బయటపడిన దీప... కోమాలోకి వెళ్లడం.. దాదాపు 20 సంవత్సరాల తర్వాత కోలుకుందంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఇక కోమా నుంచి కోలుకున్న వంటలక్క మరోసారి తన నటవిశ్వరూపం చూపించింది.

Karthika Deepam: భలే లాజిక్ పట్టారే.. ఇప్పటికీ తగ్గని వంటలక్క అందం.. నవ్వులు పూయిస్తున్న నెటిజన్ల కామెంట్స్..
Deepa
Follow us on

బుల్లితెర నెంబర్ వన్ సీరియల్ కార్తీక దీపం గత కొద్ది రోజులుగా టాప్ 10లో స్థానంలో నిలదొక్కుకోవడానికి తెగ ప్రయత్నిస్తుంది. వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలు ముగియడంతో కార్తీకదీపం టీఆర్పీ రేటింగ్ పడింది. దీంతో రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కొత్త తరం అంటూ సరికొత్తగా కథను తీసుకువచ్చిన.. ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. దీంతో ఆడియన్స్ ఫేవరేట్ వంటలక్కను మళ్లీ తీసుకొచ్చారు మేకర్స్. ఇప్పటికే వంటలక్కకు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ప్రమాదం నుంచి బయటపడిన దీప… కోమాలోకి వెళ్లడం.. దాదాపు 20 సంవత్సరాల తర్వాత కోలుకుందంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఇక కోమా నుంచి కోలుకున్న వంటలక్క మరోసారి తన నటవిశ్వరూపం చూపించింది. దీంతో కార్తీక దీపం టీఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటివరకు బాగానే ఉంది.. కానీ అసలైన లాజిక్ పాయింట్ పట్టేశారు నెటిజన్స్. ఇటీవల విడుదలైన ప్రోమోపై తమ స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు..

దాదాపు 20 ఏళ్ల తర్వాత కోమా నుంచి కోలుకున్న దీప.. డాక్టర్ బాబు కోసం ఆరా తీయడం మొదలు పెట్టింది. అయితే మార్చురీలో డాక్టర్ బాబు డెడ్ బాడీ ఉన్నట్లు చూపిస్తూ.. క్లూ కోసం అక్కడ కార్తీక్ షూస్ చూపించారు. దీంతో వంటలక్క గుండె పగిలేలా వెక్కి వెక్కి ఏడ్చింది. వంటలక్క రీఎంట్రీ ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఈ ప్రోమోలో అసలైన లాజిక్ పట్టేశారు నెటిజన్స్. దాదాపు 20 సంవత్సరాలు కోమాలో ఉన్న దీప.. కోలుకున్న తర్వాత అంతే యవ్వనంగా అందంగా కనిపిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన కుమార్తెలు కూడా పెద్దవారైన తర్వాత వంటలక్క చెక్కు చెదరలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే 15 సంవత్సరాలు మార్చురీలో ఒక డెడ్ బాడీలో ఎలా ఉంది. ముఖ్యంగా అతడి షూస్ కూడా భద్రంగా ఉన్నాయి.

Karthika Deepam

కోమా నుంచి 15 ఏళ్ల తర్వాత కోలుకున్న దీప.. అప్పటి నుంచి మార్చురీలో ఉన్న డాక్టర్ బాబు డెడ్ బాడీ చూసి గుర్తుపట్టిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మోనితా రీఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నామంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వంటలక్క అటు బుల్లితెరపైనే కాదు.. సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతుంది. ఇటు టెలివిజన్ టీఆర్పీ రేటింగ్‏లోనూ కార్తీక దీపం దూసుకుపోతుంది. వంటలక్క రీఎంట్రీతో టాప్ 1లో నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.