Most Eligible Bachelor: అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌ల‌ర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..

|

Jan 13, 2021 | 9:13 PM

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న చిత్రం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌ల‌ర్'. టాలెంటెడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో..

Most Eligible Bachelor: అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌ల‌ర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..
Follow us on

Most Eligible Bachelor: అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌ల‌ర్’. టాలెంటెడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రెడీ అవుతున్న ఈ సినిమాను టాలీవుడ్ లో వ‌రుస‌గా భ‌లేభ‌లేమ‌గాడివోయ్‌, పిల్లానువ్వులేని జీవితం, గీతగోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ తో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌‌‌‌లర్” సినిమా అనౌన్స్‌ దగ్గర నుంచి అక్కినేని అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్‌ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్ కు, అలానే గొపిసుంద‌ర్ సంగీత‌సార‌ధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ‘మనసా మ‌న‌సా’ పాటకు, ఆ త‌రువాత విడుదల చేసిన టీజ‌ర్ కు అటు సోషల్ మీడియా లో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్ లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది. ఇదే ఉత్సాహంతో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ యూనిట్ తాజగా ఈ సినిమాకు సంబంధించిన సంక్రాంతి పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్ట‌ర్ లో అఖిల్ – పూజా మ‌ధ్య కెమిస్ట్రీ క‌నువిందుగా ఉంది. అలానే అఖిల్ అక్కినేని మ్యాన్లీ లుక్ అల్ట్రా స్టైలిష్ గా ఉంది. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్ తో ల‌వ్ లీగా వుండే కేర‌క్ట‌ర్స్ గా డిజైన్ చేస్తారు.ఈ సినిమాను వేసవిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ravi Teja Khiladi : జోరు పెంచిన మాస్ మహారాజ్.. ‘ఖిలాడి’మూవీ టీజర్ కు డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్ .?

Rakul Preet Singh : షూటింగ్ కు సైకిల్ పైన వెళ్లిన హీరోయిన్..12 కిలోమీట‌ర్లు సైక్లింగ్ చేసిన రకుల్