Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ 9 గ్రాండ్ ఫినాలే.. చీఫ్ గెస్ట్‌గా రానున్న ఆ స్టార్ హీరో!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మరి కొన్ని రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఇప్పటికే హౌస్ లో గ్రాండ్ ఫినాలే టికెట్ రేస్ హోరా హోరీగా సాగుతోంది. ఎవరు టాప్-5లోకి వెళతారు? విన్నర్ ఎవరు? రన్నరప్ ఎవరు? అన్న విషయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ 9 గ్రాండ్ ఫినాలే.. చీఫ్ గెస్ట్‌గా రానున్న ఆ స్టార్ హీరో!
Bigg Boss Telugu 9 Grand Finale

Updated on: Dec 04, 2025 | 6:45 AM

బిగ్ బాస్ తెగులుగు సీజన్ 9 ఆఖరి దశకు వచ్చింది. సెప్టెంబర్ మొదటి వారంలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాల్టీషో సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఇప్పటికే ఈ షోలో 12 వారాలు గడిచిపోయాయి. 13వ వారం కూడా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. మరో కొన్ని రోజుల్లో ఈ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో ఈసారి బిగ్ బాస్ హౌస్ విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? టాప్ -5లో ఎవరుంటారు? అన్న విషయాలపై ఎవరికి తోచిన విధంగా వారు అంచనాలు వేసుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేపై తీవ్ర చర్చ జరుగుతోంది. అలాగే ఈసారి ఫినాలేకు ఎవరు ముఖ్య అతిథిగా రానున్నారు? విజేతకు కప్పు అందించేది ఎవరన్న దానిపై కూడా క్యూరియాసిటీ నెలకొంది. బిగ్ బాస్ సీజన్-8 గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చిన సంగతి తెలిసిందే. గత సీజన్ లో నిఖిల్ విన్నర్ అవ్వగా.. రామ్ చరణ్ చేతుల మీదుగా బిగ్ బాస్ కప్పు అందుకున్నాడు.

ఇక బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో బిగ్ బాస్ సీజన్ 3 , సీజన్ 4 లకు ముఖ్య అతిథిగా వచ్చి విజేతలకు కప్పును అందించారు చిరంజీవి. ఇప్పుడు మరోసారి ఆయనే గెస్ట్ గా రాబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ విషయం అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. కాగా ఈసారి బిగ్ బాస్ షోకు మెగాస్టార్ రాకకు మరో ముఖ్యమైన కారణం కూడా ఉందని తెలుస్తోంది. చిరు నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా.. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పనిలో పనిగా సినిమా ప్రమోషన్స్ కూడా బిగ్ బాస్ షో నుంచే ప్రారంభించవచ్చని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా ఈసారి బిగ్ బాస్ టైటిల్ రేసు లో తనూజ,  కల్యాణ్ ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి బిగ్ బాస్ కప్పు అందుకునే అవకాశం రానుంది. అలాగే ఇమ్మాన్యుయేల్ కూడా వీరికి గట్టి పోటీ నిస్తున్నాడు.

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.