AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreekaram Movie : శర్వానంద్ నటనకు ‘శ్రీకారం’ పడింది అక్కడే.. యాక్టింగ్‌‌‌‌‌కు తిలకం దిద్దింది కూడా నేనే : మెగాస్టార్

వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై నూతన దర్శకుడు కిషోర్ బి. దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన చిత్రం శ్రీకారం. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా న‌టిస్తోన్న‌

Sreekaram Movie : శర్వానంద్ నటనకు 'శ్రీకారం' పడింది అక్కడే.. యాక్టింగ్‌‌‌‌‌కు తిలకం దిద్దింది కూడా నేనే : మెగాస్టార్
Rajeev Rayala
|

Updated on: Mar 10, 2021 | 1:35 AM

Share

Sreekaram Movie : వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై నూతన దర్శకుడు కిషోర్ బి. దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన చిత్రం శ్రీకారం. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా న‌టిస్తోన్న‌ ఈ చిత్రంలోని ఇప్ప‌టికే విడుద‌లైన‌ పాటలకు, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది..హై ఎక్స్ పెక్టేషన్స్ తో మహాశివరాత్రి సందర్బంగా మార్చి11న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా ఖమ్మంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది‌. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీ‌కారం బిగ్ టికెట్‌ని ఆవిష్క‌రించారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘రామ్  చరణ్ ఫోన్ చేసి.. శర్వా సినిమా విడుదలవుతోంది.. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలని అన్నాడు. అలా ఎలా నేను ఖమ్మంలో ఉన్నాను కదా? అని అన్నాను. వాళ్లే ఖమ్మంకు వస్తారు అని చెప్పాడు. అయితే ఖమ్మంలో అయితే జనాలు వస్తారా? అని అనుమానం ఉండేది. శ్రీకారం యూనిట్‌కు మాత్రం జనాలువస్తారు.. ఆదరిస్తారు అనే నమ్మకం ఉంది. మీరు ఇంత మంది వచ్చి ఆదరిస్తూ వారి నమ్మకాన్ని నిజం చేశారు. అని అన్నారు మెగాస్టార్. అలాగే సినిమా గురించి మాట్లాడుతూ.. ఎంతో మంచి కథ, వ్యవసాయం గొప్పదనం చెప్పే కథ..ఈ సినిమాలో సందేశమే కాదు.. అన్ని రకాల కమర్షియల్ హంగులున్నాయి. నిర్మాతలకు థ్యాంక్స్. హీరో హీరోయిన్లు, చిత్రయూనిట్ అందరికీ నా అభినందనలు తెలిపారు చిరు. ఇక ఈ ఈవెంట్‌కు రావడానికి నిర్మాతలు ముఖ్య కారణం అయితే.. శర్వానంద్ కూడా ఓ కారణం.. చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే రామ్ చరణ్‌తో పెరిగాడు.. నాకు శర్వానంద్ బిడ్డలాంటివాడు.. మరో రామ్ చరణ్. అయితే నటన పట్ల మక్కువ ఉందో లేదో కూడా నాకు తెలీదు.. రామ్ చరణ్‌ను అడిగితే.. నాకు తెలీదు డాడీ అనేవాడు. ఓ సారి థమ్సప్ యాడ్ గురించి యంగ్ బాయ్ నటించాల్సి వచ్చింది. ఎవరైతే బాగుంటుందా? అని అనుకునే సమయంలో.. శర్వానంద్ ఇంట్లో ఉన్నాడు.. నటిస్తావా? శర్వా అని అడిగితే.. అంకుల్ మీరు చెబితే చేస్తాను అన్నాడు.. ఆ మాట చాలు అని తీసుకెళ్లాను. అలా మేం ఇద్దరం వెళ్లి యాడ్‌లో నటించాం.. అదే మొదటి సారి కెమెరా ముందు కనిపించడం. అయితే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఓ సాంగ్ సీన్‌లో కుర్రాడు కావాలి. ఎంతో అమాయకంగా కనిపించాలి. శర్వా అయితే బాగా చేస్తాడు అని అనుకున్నాను. నటిస్తావా? అని అంటే.. మీ సపోర్ట్ ఉంటే చేస్తాను అన్నాడు. అలా గెస్ట్ క్యారెక్టర్ చేశాడు. అప్పుడే నాకు అర్థమైంది.. పెద్ద హీరో అవుతాడని.. ఆ సీన్ తన నటనకు ఓ మచ్చుతునక అని చెప్పవచ్చు.  నాడే శర్వా నటనకు శ్రీకారం పడింది అక్కడే.. నటనకు తిలకం దిద్దింది కూడా నేనే అన్నారు చిరంజీవి. ఎంతో చక్కటి మెసెజ్.. కమర్షియల్ పంథాలో దర్శకుడు కిషోర్ అద్భుతంగా చెప్పారు. నేటి యువతరానికి వ్యవసాయ విలువ తెలిసేలా చూపించారు. త‌ప్ప‌కుండా ఈ సినిమా అద్భుత విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను“ అని మెగాస్టార్ చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan : రాయలసీమ జానపద రచయిత, గాయకుడు శ్రీ పెంచల్ దాస్ ను సత్కరించిన పవర్ స్టార్, త్రివిక్రమ్

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!