AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan : రాయలసీమ జానపద రచయిత, గాయకుడు శ్రీ పెంచల్ దాస్ ను సత్కరించిన పవర్ స్టార్, త్రివిక్రమ్

రాయలసీమ జానపద రచయిత, గాయకుడు శ్రీ పెంచల్ దాస్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సత్కారం చేసారు. నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో దారిచూడు దుమ్మచూడు అంటూ సాగే పాటను పెంచాలిదాస్ రచించి ఆలపించారు.

Pawan Kalyan :  రాయలసీమ జానపద రచయిత, గాయకుడు శ్రీ పెంచల్ దాస్ ను సత్కరించిన పవర్ స్టార్, త్రివిక్రమ్
Rajeev Rayala
|

Updated on: Mar 10, 2021 | 1:23 AM

Share

Pawan Kalyan : రాయలసీమ జానపద రచయిత, గాయకుడు శ్రీ పెంచల్ దాస్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సత్కారం చేసారు. నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో దారిచూడు దుమ్మచూడు అంటూ సాగే పాటను పెంచాలిదాస్ రచించి ఆలపించారు. ఈ పాట మంచి ఆదరణ పొందింది.అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సామెతలోను పెంచల్ దాస్ అద్భుత మైన పాటను రచించి ఆలపించారు. తాజాగా శర్వ నంద్ నటించిన ‘శ్రీకారం’ సినిమాలో ”భలేగుంది బాల” అనే పాటను రచించారు. త‌‌న ర‌చ‌నా శైలి, గాత్రంతో (రాయ‌ల‌సీమ మాండ‌లికం) ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్న‌పెంచ‌ల్‌దాస్‌ను ఇవాళ సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ హైద‌రాబాద్‌లో స‌త్క‌రించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ” పెంచల్ దాస్ గారు రాయలసీమ ప్రాంత జానపదాలను, అక్కడి మాండలికాన్నీ నేటి తరానికి చేరువ చేస్తున్న విధానం అభినందనీయం అని అన్నారు. గీత రచయిత, గాయకుడు శ్రీ పెంచల్ దాస్  మంగళవారం హైదరాబాద్ లో శ్రీ పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలుగు జానపదాలు, సీమ మాండలికంపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఈ చర్చలో ప్రముఖ దర్శకులు శ్రీ త్రివిక్రమ్ పాల్గొన్నారు. అనంతరం శ్రీ పెంచల్ దాస్ ను పవన్ కళ్యాణ్ సత్కరించారు. హారిక, హాసిని క్రియేష‌న్స్ ట్విట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని అభిమానులతో  పంచుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Uppena Movie : ‘ఉప్పెన’ సినిమా పైన కన్నేసిన బాలీవుడ్ యంగ్ హీరో.. హీరోయిన్ ఎవరో తెలుసా..

Virata Parvam : ఆకట్టుకుంటున్న విరాటపర్వం ‘కోలు కోలమ్మా కోలో.. కోలో’ గీతం.. మేకింగ్ వీడియోను విడుదల చేసిన చిత్రయూనిట్..