AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ravipudi : `గాలి సంప‌త్` కథ ఆడియన్స్‌ని తప్పకుండా థ్రిల్ చేస్తుంది – అనిల్ రావిపూడి.

`ప‌టాస్`, `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`, `స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి వ‌రుసగా ఐదు బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించి ప్ర‌స్తుతం ఎఫ్ 3 చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి.

Anil Ravipudi :  `గాలి సంప‌త్` కథ ఆడియన్స్‌ని  తప్పకుండా థ్రిల్ చేస్తుంది - అనిల్ రావిపూడి.
anil-ravipudi
Rajeev Rayala
|

Updated on: Mar 10, 2021 | 2:04 AM

Share

Anil Ravipudi : `ప‌టాస్`, `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`,`స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి వ‌రుసగా ఐదు బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించి ప్ర‌స్తుతం ఎఫ్ 3 చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. అనీల్  స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రిస్తూ స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ చేసిన తాజా ‌ చిత్రం `గాలి సంప‌త్`. శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనిల్ కో-డైరెక్టర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ మార్చి11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా  అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

” నా ఫ్రెండ్‌ ఎస్‌.కృష్ణ.. నా అన్నిసినిమాలకు రైటర్‌గా పని చేశాడు. నిర్మాతగా లాంచ్‌ అవ్వాలని తను గాలిసంపత్‌ కథ రాసుకున్నాడు. గాలి సంపత్‌ అని విని…గాలికి తిరిగే ఓ వ్య‌క్తి క‌థ ఏమో అనుకున్నాను. కాని నోట్లో నుంచి మాట రాకుండా కేవలం గాలిమాత్రమే వచ్చేలా గాలి సంపత్‌ క్యారెక్టర్‌ ఉంటుంది అనగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అదీకాకుండా నేను ఇంగ్లీష్ ఫిలింస్ కొన్ని చూశాను. క్యాస్ట్ అవే, లైఫ్ఆఫ్ పై. 127 అ‌వ‌ర్స్ ఇలాంటి జోన‌ర్‌లో తెలుగులో ఆ సెట్ ఆఫ్ ఫిలింస్ రాలేదు. అలాగే ఒక గొయ్యిలో పడిన వ్యక్తి ఎలా పైకి వస్తాడు? అన్న కాన్సెప్ట్ న‌న్ను ఎగ్జైట్ చేసింది. దాంతో ఒక‌ సమర్పకుడిగా నేను గాలిసంపత్‌ టీమ్‌తో ట్రావెల్‌ అయ్యాను. ఒక టీమ్‌ వర్క్‌లా గాలి సంపత్‌ను పూర్తి చేశాం.  మార్చి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది . అని అన్నారు. అలాగే ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ , శ్రీ విష్ణు తండ్రీకొడుకులు. తండ్రిది ఒక లక్ష్యం. కొడుకుది మరొక లక్ష్యం. రెండు వేరు వేరు దారులు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య చోటుచేసుకునే ఈగో క్లాషెష్‌నే గాలిసంపత్‌ కథ. రాజేంద్రప్రసాద్  ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. తండ్రి వల్ల ఇబ్బందులు పడే కొడుకు పాత్రలో శ్రీవిష్ణు యాక్ట్‌ చేశారు. శ్రీ విష్ణుకు మంచి లవ్‌ట్రాక్ కూడా ఉంటుంది. తండ్రీకొడుకుల మధ్య దూరం పెరగడానికి ఈ లవ్ కూడా ఓ కారణం. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్టు ఈ సినిమాలో వర్షం కూడ ఓ విలన్‌లా కనిపిస్తుంది. అదీ ఎలా అనేది సినిమాలో చూడండి.అంటూ అనీల్ హింట్ ఇచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Alanti Sitralu Teaser : వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థతో తెరకెక్కిన ‘అలాంటి సిత్రాలు’.. ఆసక్తికరంగా టీజర్

Sreekaram Movie : శర్వానంద్ నటనకు ‘శ్రీకారం’ పడింది అక్కడే.. యాక్టింగ్‌‌‌‌‌కు తిలకం దిద్దింది కూడా నేనే : మెగాస్టార్

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!