Alanti Sitralu Teaser : వైవిధ్యభరితమైన కథతో తెరకెక్కిన ‘అలాంటి సిత్రాలు’.. ఆసక్తికరంగా టీజర్
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దగ్గర రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన సుప్రీత్ సి. కృష్ణ దర్శకత్వంలో చిత్రం 'అలాంటి సిత్రాలు'. రాహుల్ రెడ్డి నిర్మాతగా, ప్రముఖ జర్నలిస్ట్ , శాటిలైట్ & డిజిటల్ కన్సల్టెంట్ కె . రాఘవేంద్రరెడ్డి సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది.

Alanti Sitralu : డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దగ్గర రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన సుప్రీత్ సి. కృష్ణ దర్శకత్వంలో చిత్రం ‘అలాంటి సిత్రాలు’. రాహుల్ రెడ్డి నిర్మాతగా, ప్రముఖ జర్నలిస్ట్ , శాటిలైట్ & డిజిటల్ కన్సల్టెంట్ కె . రాఘవేంద్రరెడ్డి సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ఐ &ఐ ఆర్ట్స్, కాస్మిక్ రే ప్రొడక్షన్స్ సంయుక్తం నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉందనీ, ఒక వైవిధ్యమైన కథతో, ఉత్కంఠభరిత కథనంతో సినిమా రూపొందిందనే నమ్మకాన్ని టీజర్ కలిగిస్తోందనీ ఆయన అన్నారు. ‘అలాంటి సిత్రాలు’ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
నలుగురు భిన్న తరహా వ్యక్తులు అనుకోకుండా ఒకరి దారిలో మరొకరు తారసపడినప్పుడు వారి జీవిత గమనంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అలాంటి సిత్రాలు’. టీజర్‌లో, “ఒకటి గుర్తు పెట్టుకో. నాశనమవ్వాలంటే అన్నీ సహకరిస్తాయ్. కానీ బాగు పడాలంటేనే వంద అడ్డంకులొస్తాయ్.” అంటూ ఒక ప్రధాన పాత్రధారి ప్రవీణ్ యండమూరి చెప్పిన డైలాగ్లు ఆకట్టుకున్నాయి. అజయ్ కతుర్వార్, శ్వేతా పరాశర్, యష్ పురి ప్రధాన పాత్రలు పోషించారు.
వీరిలో శ్వేతా పరాశర్ ఒక వేశ్య పాత్రను పోషిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.ఈ సినిమా కథకు శ్వేత పోషించిన పాత్ర కీలకమనీ తెలుస్తోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, బ్యూటిఫుల్ కలర్ టోన్‌తో టీజర్ రిచ్ లుక్‌తో కనిపిస్తోంది. మంచి పర్ఫార్మెన్స్‌లను కూడా ఈ సినిమాలో మనం చూడబోతున్నాంమని టీజర్ చూసి చెప్పవచ్చు. ఓవరాల్‌గా టీజర్‌ను చూశాక సినిమాను చూడాలనే ఆసక్తి కలుగుతుంది. సమర్పకుడు కె. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ వైవిధ్యభరితమైన కథ, ఆసక్తి కలిగించే కథనంతో ఈ చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుందనీ, త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామనీ చెప్పారు.




