ముకుంద షార్ట్ టెంపర్ అని అంటే.. ఏమైనా సన్మానం చేస్తున్నామా అని అంటుంది కృష్ణ. నువ్వు మా మురారీ ఉన్నారు కదా మా అందరి ముందు చాలా ఫ్రెండ్లీగా జాలీగా ఉంటారు కదా అలా ఉండకండి. అసలే ఇగోయిస్టు అయిన ముకుంద రెచ్చిపోయి ఏదోకటి చేసే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండు అని మధు సలహా ఇస్తాడు. ఏసీపీ సార్ అన్ని విషయాల్లోనూ నాతో క్లోజ్ ఉంటారు. ప్రేమిస్తున్న మాట మాత్రం చెప్పరేమిటో అనుకుంటుంటే ముకుంద అక్కడికి వస్తుంది. ఇంతలో ఏడుస్తూ ఒక మూల కూర్చోవాల్సిన నువ్వు ఇలా రావడం ఏమిటో అని కృష్ణ అంటుంటే.. నాన్సెన్స్ మాట్లాడకు కృష్ణ.. అలా ఏడుస్తూ కూర్చోవాల్సిన ఖర్మ నాకు ఏమీ పట్టలేదు అని అంటుంది. అంతేకాదు కృష్ణ తో ముకుంద నువ్వు నాకు కోడలిగా భాద్యతలు అప్పగించిన విషయం గుర్తు చేస్తుంది. వెళ్లినవాడిని వెళ్లకుండా ఇక్కడ కూర్చుని తిష్టవేశావు ఇప్పుడు చెప్పు ఇక్కడ పరాయిదానివి ఎవరు.. మూలన కూర్చుని ఏడ్వాలిసిన దానివి ఎవరు.. అని అడిగితె.. నువ్వే.. అని కృష్ణ చెబుతూ.. అప్పుడు నీ నిజ స్వరూపం తెలియదు.. అందరి ఆడపిల్ల లాంటివి దానివి పాపం.. నిజంగానే ఆదర్శ్ కోసం ఎదురుచూస్తున్నావు అనుకున్నా .. కానీ తర్వాత తెలిసింది .. నువ్వు అందరి లాంటి ఆడదానికి కాదని అంటుంటే .. ముకుంద కోపంతో కృష్ణ అని అరుస్తుంది. అరవకు.. అరిస్తే పోయేది నీ పరువే..
పతి ప్రాణాల కోసం యముడితో పోరాడిన సతీ సావిత్రి గురించి తెలుసుకానీ.. పరాయి వాళ్ల భర్తని కోసం ఆరాటపడుతున్న.. ఆశపడుతున్న నిన్ను ఏ పవిత్ర అనాలో అర్ధం కావడం లేదు అని షాకిస్తుంది కృష్ణ. చూడు మురారీ మనసులో శరణార్థివి.. దిక్కు మొక్కు లేనివాడనివి ఒక దారి మాత్రమే చూపించాడు. ఆ దారిలో వెళ్ళక నా దారిలో అడ్డువస్తావేంటి అని ముకుంద అంటే వస్తాను.. అడ్డొస్తాను.. అడ్డం తొలగించుకుంటాను అని కృష్ణ హెచ్చరిస్తుంది. నీ మాయలో పడితే ఏసీపీ సార్ మాత్రమే ఈ ఇంటి గౌరవం మొత్తం నాశనం.. సర్వనాశనం అయిపోతుంది. చూస్తూ నేను అలా ఎలా చేస్తాననుకున్నావు అని అంటుంది కృష్ణ. వెంటనే ముకుంద నీ కాపురం మూడు నాళ్ల ముచ్చట.. అనవసరంగా ఆశలు పెట్టుకోకు అని అంటే.. వెంటనే కృష్ణ నీకు ఉన్న మానసిక రోగం పోవాలంటే హ్యాపీగా ఆదర్శ్ కోసం ఎదురుచూడు అని అంటే.. అది ఎన్నటికీ జరగదు అని ముకుంద అంటుంది.. జరిగే తీరుతుంది అని కృష్ణ చెబుతుంది. జరిపించేది నేనే.. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్ వేరబ్బా అంటుంది కృష్ణ.
మురారీ కృష్ణ మీద తనకు ఉన్న ప్రేమని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. నేను ప్రేమని కృష్ణకు చెప్పాలని ఎదురుచూస్తుందా.. నాకు చెప్పాలని ఉంది. కానీ నువ్వు క్యాంప్ నుంచి మీ ఊరు వెళ్లాలని చూశావు చూడు అక్కడే ఆగిపోయాను కృష్ణ. నిజంగా నన్ను ప్రేమిస్తుంటే వెళ్లేదానివి కావు అని ఆలోచిస్తుంటాడు మురారీ.. నీ ప్రేమని నాకు కాకపోయినా మా అమ్మకి అయినా చెప్పేవేవాడివి కదా అనుకుంటుంటే..
కృష్ణ పువ్వులు పెట్టుకుని రూమ్ కి వస్తుంది. ఇంతలో మురారీ డాక్టర్లు కూడా పువ్వులు పెట్టుకుంటారా.. అని మురారీ అడుగుతాడు. పువ్వులు అలా పెట్టుకున్నావు ఏమిటి అని మురారీ అడిగితె .. మీరే పెట్టండి అని అంటుంది కృష్ణ. మొన్న ఏమో తలతుడిచారు. ఇప్పుడేమో పువ్వులు పెట్టారు. చూస్తున్నా ఏదోకరోజు బయటపడకపోరు.. అప్పడూ చూడండి.. ముకుందని ఆదర్శ్ ను కలిపి హనీమూన్ కి పంపిద్దాం అని అంటుంది. మురారీ కంగారు చూసి కంగారు పడేటంత ప్లాష్ బ్యాక్ ఉందా మీకు అని అంటుంటే.. ఏమీలేదు అని అంటాడు మురారీ..
అలేఖ్య రేపు ఉదయాన్నే ముకుందని కలవాలి.. అంటుంటే.. నేను వెస్ట్ ఫెలోల గురించి అసలు ఆలోచించను అని మధుకు చెబుతుంది అలేఖ్య.
కృష్ణ అన్నమాటలను ముకుంద గుర్తు చేసుకుంటుంది. ఇంతలో అలేఖ్య వచ్చి.. ముకుంద మాట్లాడుతుంటే.. నీకు ఎప్పుడైనా కళ్ల కలక వచ్చిందా అదే పరిస్థితి నాది.. కృష్ణ నా కంట్లో నలకలా తయారైంది. ఎవరితోనూ చెప్పుకోలేను.. నాకు నువ్వు తప్ప ఎవరూ హామీ చెయ్యలేవు.. అని అలేఖ్య కు ముకుంద.. ప్లాన్ చేస్తుంది. ఆదర్శ్ రాడని నమ్మకం కలిగేలా చేయాలి. ఆ నమ్మకం వమ్ము చేయడం ప్రస్తుతం నా ప్రధమ కర్తవ్యం అని అంటుంది.
మురారీకి కాఫీ ఇస్తూ తాగారా పిల్ల సన్నాసి అని అంటుంటే.. భవానీ కృష్ణ ఏది అని అడుగుతున్నా అని అంటుంటే.. కృష్ణ వస్తుంది. మీ అందరితో ఒక విషయం చెబుదామని అంటుంటే.. రేవతి చెప్పింది మురారీ ఆలోచిస్తుంటే.. మధు ఏమో కృష్ణకు దూరంగా ఉండమని సలహా చెబుతాడు. వినాయక చవితికి ఏర్పాట్లు చేయమని చెబుతుంది. మురారీ కృష్ణ దగ్గరకు ప్రేమగా వస్తే.. కృష్ణ దూరం జరుగుతుంది. ఇంతలో భవానికి అక్కోయో అంటూ ఒకరు కాల్ చేస్తారు. మీ కోడలు కృష్ణ ఉంది కదా.. తనకు బాబాయ్ ని అంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నతో గొడవ పడి వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు అని అంటుంది కృష్ణ.
చిన్నాన్న అంటూ కృష్ణ వస్తుంది. మా అన్నకు కొడుకు లేడు అన్న లోటు ఉండేది.. ఇపుడు అది కూడ తీరుతుంది అని అంటాడు. అంతా మంచిగా కొడుతోంది.. కానీ ఈ ఒక్క బిడ్డ తప్ప.. ఈ బిడ్డ పెనిమిటి ఏదీ బయటకు పోయిండా అని అడుగుతాడు ప్రభాకర్.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..