Krishna Mukunda Murari October 21st, 2023: మురారీ కోసం వెదుకుతున్న కృష్ణ.. డాక్టర్ పరిమళకు కు ముకుంద అన్న మీద అనుమానం..

|

Oct 21, 2023 | 7:33 AM

ఇప్పటి దాకా నేను జీవితంలో చేసిన మంచి పని అంటే ఇదేనేమో.. అని ముకుందకు కాల్ చేస్తాడు. ఎలా ఉన్నావు.. ఎందుకు టెన్షన్ పడుతున్నావు.. ఇప్పుడే షిప్ట్ చేస్తున్నా.. సక్సెస్ అయ్యాక ఫోన్ చేస్తా.. అని అంటుంటే.. ఇంట్లో మురారీ ఫోటోకి దండ వేశారు.. చాలా బాధగా ఉందిరా అని ముకుంద చెబుతుంది. లైట్ తీసుకో అని అన్న ముకుందకు దైర్యం చెబుతాడు. 

Krishna Mukunda Murari October 21st, 2023: మురారీ కోసం వెదుకుతున్న కృష్ణ.. డాక్టర్ పరిమళకు కు ముకుంద అన్న మీద అనుమానం..
Krishna Mukunda Murari
Image Credit source: hot star
Follow us on

మధుకి ఫోన్ చేసిన ప్రభాకర్ ఏమైంది అని అంటే.. మామయ్య అది అంటూ చాలా ఘోరం జరిగిపోయింది మామయ్య.. మురారీ ఇక లేడు మామయ్య.. ఎందుకు ఇలా జరిగిందని అందరూ కృష్ణ మీద  మండిపడుతున్నారు.. అని మధు చెబుతాడు. చివరి చూపుని కూడా దక్కనివ్వలేదు.. అని ప్రభాకర్ బాధపడతాడు. ఇంటిలోపలికి వెళ్తా అని అంటే.. వద్దు నేను మీతో మాట్లాడానని తెలిస్తే.. నన్ను ఇంటి నుంచి గెంటేస్తారని మధు చెబుతాడు.. కృష్ణ బతికి ఉండనే విషయాన్ని ప్రభాకర్ చెప్పకుండా అక్కడ నుంచి తిరిగి వచ్చేస్తాడు.

కృష్ణకు ఎలా మురారీ మరణం గురించి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ హాస్పటల్ కు వస్తాడు. ఏది ఏమైనా ఈ విషయం చెప్పకూడని నిర్ణయించుకుంటాడు. తన భార్యకు కూడా చెప్పకూడదని నిర్ణయం తీసుకుంటాడు. మన బిడ్డ మంచిగా ఉంది.. అల్లుడికి ఏమీ కాదు అని అంటుంది శకుంతల. అల్లుడిని వాళ్ళదగ్గరే ఉంచారా.. బిడ్డను సీదా తీస్కుని వెళ్లి పంచాయితీ పెడదాం అని అంటుంటే.. అల్లుడు మరణించాడని చెబుతాడు ప్రభాకర్. మన బిడ్డ ఐదోతనాన్ని ఆ సామి తీసుకుని వెళ్లిపోయాడని చెబుతాడు. కృష్ణకు ఏమీ చెప్పవద్దు కొన్ని రోజులు ఆగుదాం అని అంటుంది.

కృష్ణ ఏసీపీ సార్ ఎక్కడ ఉన్నారు.. ఏమి చేస్తున్నారో ఏ హాస్పటల్ లో ఉన్నారో.. నేను ఏసీపీ సార్ కలిసి మా ఊరు వెళ్ళిపోతాం.. ట్రాన్సఫర్ పెట్టుకోమని చెబుతా అని ఆలోచిస్తుంటే.. ప్రభాకర్ వస్తాడు.. ఏసీపీ సార్ ఎక్కడ ఉన్నారు.. ఎలా ఉన్నారు .. అని అడుగుతుంది. ఏసీపీ సార్ ఇంటికి వెళ్ళారా అని అడుగుతుంది కృష్ణ .. నిన్ను అవమానించారా అక్కడ మిమ్మల్ని అమానించారా ఏసీపీ సార్ కు ఏమీ కాదు చిన్నాన్న .. ఏమైనా అయితే నేను ఇలా ఉంటానా చెప్పు అని అంటుంది. మాకు శ్రీనగర్ కాలనీలో హాస్పటల్ ఉంది నేను అక్కడికి వెళ్తాను అని కృష్ణ అడుగుతుంది. వెళ్ళమని డాక్టర్ చెప్పు చెబుతుంది. మా హాస్పటల్ కి వెళ్దాం.. నాకోసం ఏసీపీ సార్ అక్కడికి వస్తారు.. నేను అక్కడ లేకపోతె ఎలా చెప్పు పదా వెళ్దాం అని అంటుంది కృష్ణ.

ఇవి కూడా చదవండి

మురారీని ఆ ఆస్పటల్ కి తీసుకుని వెళ్లినా పేమెంట్ మాత్రం ఇక్కడే ఇవ్వాలి అని డాక్టర్ ముకుంద అన్నతో చెబుతాడు. ఇప్పటి దాకా నేను జీవితంలో చేసిన మంచి పని అంటే ఇదేనేమో.. అని ముకుందకు కాల్ చేస్తాడు. ఎలా ఉన్నావు.. ఎందుకు టెన్షన్ పడుతున్నావు.. ఇప్పుడే షిప్ట్ చేస్తున్నా.. సక్సెస్ అయ్యాక ఫోన్ చేస్తా.. అని అంటుంటే.. ఇంట్లో మురారీ ఫోటోకి దండ వేశారు.. చాలా బాధగా ఉందిరా అని ముకుంద చెబుతుంది. లైట్ తీసుకో అని అన్న ముకుందకు దైర్యం చెబుతాడు.

కృష్ణ వాళ్ల హాస్పటల్ కు వస్తుంది. తాను ఏసీపీ సార్ కలిసి ఉన్న సమయాన్ని గుర్తు చేసుకుంటుంది. అప్పుడు శకుంతల ఏడుస్తుంది. ఏసీపీ సార్ వస్తారని కృష్ణ చెబుతుంది. ఇంతలో వాళ్ళముందు నుంచి మురారీని తీసుకుని వెళ్తుంటే.. ఇక్కడే మురారీ ఉన్నాడని తన మనసు చెబుతుందని అంటుంది కృష్ణ. నా మనసు నాకు చెబుతుంది.. ప్రామిస్ చిన్నాన్న అంటుంది కృష్ణ. చిన్నాన్న నమ్మడం లేదు కూడా.. నాకు ఏసీపీ సార్ ఇక్కడే ఉన్నాడని చాలా బలంగా అనిపిస్తుంది కృష్ణ అంటే.. వెదుకుతాం అని శకుంతల చెప్పి లోపలోకి తీసుకుని వెళ్తుంది.

డాక్టర్ పరిమళ అంటే అని ముకుంద అన్న అడిగితె నేనే.. చెప్పండి అని అంటుంది.. సన్ సెట్ హాస్పటల్ వాళ్ళు.. తినకు ట్రీట్మెంట్ మాత్రం ఇక్కడ చేయమన్నారు.. పేమెంట్ అక్కడ ఇమ్మన్నారు అని అని చెబుతాడు ముకుంద అన్న. ఆఫోకోర్స్.. ట్రీట్మెంట్ చేయడానికి కొన్ని ప్రర్మాలిటీస్ కావాలి అని అంటూ మీ పేరు అని అడుగుతుంది డాక్టర్ పరిమళ.. నా పేరు చెబితే ఫ్యూచర్ లో ఎప్పుడైనా ముకుందకు ప్రొబ్లెమ్స్ రావచ్చు అని ఆలోచించి శేఖర్ అని చెబుతాడు. మరి పేషేంట్ నేమ్ అని అడిగితె మురారీ అని చెబుతాడు. డాక్టర్ పరిమళ .. మురారీనా అంటూ షాక్ తింటుంది. అదే సమయంలో కృష్ణ చిన్నమ్మ మీరు ఇటువైపు వెదకండి నేను అటువెదుకుతా అంటూ శకుంతలకు చెబుతుంది. ఏసీపీ సార్ వస్తే నేను వచ్చానని చెప్పండి.

నేను చెప్పింది మురారీ కాదు.. మురళి అంటూ పేరు మారుస్తాడు ముకుంద అన్న. ఏమిటి ఎదో తేడాగా కనిపిస్తున్నాడు. అని అనుకుంటూనే.. ఇతనికి కావాల్సిన వారు ఏరి అని ఆడుతుంది పరిమళ.. లేరు అందరూ యుఎస్ లో ఉన్నారు.. అని శేఖర్ చెబుతాడు. ఇతను మీకు రిలేషణా.. ఫ్రెండా అని అడుగుతుడ్ని పరిమళ. రిలేషన్.. అని అందుకే గార్డిన్ గా నేనే ఉన్నా.. అని చెబితే.. నో ప్రాబ్లెమ్… ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం.. ఒన్ వీక్ లో డిశార్జ్ ఉంటుంది అని చెప్పి మురారీని ట్రీట్మెంట్ కోసం తీసుకుని వెళ్తుంది పరిమళ.

కృష్ణ మురారీ కోసం ఆస్పటల్ లో వేదుకుతుంది. ఏసీపీ సార్ కనిపించారా అని అంటే లేదు ఒక కాంపౌండర్ చెబుతాడు.  ఇక్కడే ఉన్నట్లు నాకు అనిపిస్తుంది మరి నాకు ఎందుకు కనిపించడం లేదు అని కృష్ణ ఆలోచిస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో

తన బాబాయ్ ని తీసుకుని మురారీ ట్రీట్మెంట్ తీసుకున్న ఆసుపత్రికి వెళ్తుంది. అక్కడ ఎవరో వచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి ఇక్కడ నుంచి వేరే అస్పటల్ కి తీసుకుని వెళ్లినట్లు అక్కడ డాక్టర్ చెబుతాడు. మరోవైపు ముకుంద.. మురారీ కృష్ణ ఒక్కటయ్యారా.. అంటే తన మనసులో నాకు స్తానం లేదా.. ఏమీ పర్వాలేదు నేను మార్చుకుంటా అని ముకుంద ఆలోచిస్తుంది..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..