జైలు నుంచి రిలీజైన ముకుంద అన్నకు తన చెల్లెలు ప్రేమ గురించి తెలిసింది. ఎలాగైనా తన చెల్లెలు ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలనుకున్న ముకుంద అన్న.. కృష్ణ మురారీ వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ చేయించాడు. మురారీని హాస్పటల్ లో జాయిన్ చేసి.. ముకుందకు ఫోన్ చేసి రమ్మనమని చెప్పాడు. వచ్చిన ముకుందతో ఇంట్లో వాళ్లకు చెప్పకు.. మురారీతో పెళ్లి చేసుకో అని చెబుతాడు. అయితే ముకుంద అన్న చెప్పిన సలహాకు భయపడుతుంటే.. ఈ మాత్రం దానికే ఇలా భయపడుతుంది అంటే.. అసలు యాక్సిడెంట్ చేయించింది నేనే అని చెబితే ఏమైపోతుంది అని అనుకుంటాడు.
అదే సమయంలో అటుగా వెళ్ళుతున్న కొత్తపల్లి ప్రభాకర్ కు యాక్సిడెంట్ అయి కొట్టుమిట్టులాడుతున్న కృష్ణను చూసి హాస్పటల్ కు తీసుకుని వెళ్లి జాయిన్ చేస్తాడు. ఎందుకు ఇలా అయింది. ఏమైనా సూసైడ్ చేసుకుందా అని ఆలోచిస్తూ ఉంటె శకుంతల అక్కడకికి వచ్చింది. అప్పుడు అత్తారింటికి ఫోన్ చేయమని అడిగితె.. వద్దు అని అక్కడ జరిగిన విషయం చెబుతాడు.
తాను చెప్పినట్లు మురారీ ఫేస్ మార్చకుంటే డాక్టర్ ను అతని భార్య పిల్లని చంపేస్తానని బెదిరిస్తాడు. ఇక్కడ కుదరదు అని అంటే.. నీకు ఎక్కడ కుదిరితే అక్కడే చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతాడు.
కృష్ణకు సృహ రాగానే మన ఇంటికి తీసుకుని వెళ్దాం అని అన్న శకుంతలతో అలా కుదరదు.. నాకు రేవతి చెప్పింది.. అల్లుడికి బిడ్డ అంటే చాలా ఇష్టం అని ఆ విషయం చెప్పాలి నా బిడ్డకు అని అంటాడు ప్రభాకర్.. ఇంతలో కృష్ణ దగ్గరకు వెళ్లి.. నా బిడ్డకు ఎప్పుడు సృహ వస్తుంది. ఇంకా సృహ రాలేదు ఏమిటి అని అడుగుతుంది శకుంతల డాక్టర్ ని. ఇంతలో కృష్ణకు సృహ వస్తుంది.
ఏసీపీ సార్ ఎక్కడ .. ఇక్కడే ఉన్నారా.. అని అడుగుతూనే … మురారీకి యాక్సిడెంట్ అయింది.. డాక్టర్ గారు సర్టిఫై చేసి సర్టిఫికెస్ ఇచ్చారు అని శవాన్ని ఇంటికి తీసుకుని వస్తారు పోలీసులు..
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..