Krishna Mukunda Murari Today Episode: కృష్ణ నా చిన్నకోడలని ఏడువారాల నగలు ఇచ్చిన భవానీ.. అగ్రిమెంట్ పెళ్లి గురించి చెప్పమని అలేఖ్యకు ముకుంద సలహా..

|

Aug 08, 2023 | 3:09 PM

భవానీ పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది.. నందు నీ ప్రేమని కృష్ణకు నేను చెబుతా అంటుంది.. మురారీ వద్దు అంటూ ప్రతి చనువు ప్రేమ కాదు అర్ధం చేసుకో అంటాడు. కృష్ణను పెళ్లికూతురిగా రెడీ చేసి ముకుంద తీసుకుని వస్తుంది. తింగరి పిల్ల ఏమిటి పెద్దత్తయ్యా అంటే.. ఇంతకూ ముందు జరిగిన మీ ఇద్దరి పెళ్లి మేము ఎవరం చూడలేక పోయాం.. అందుకే ఇప్పుడు ఈ పెళ్లి ఏర్పటు అంటే ముకుంద తో సహా అందరూ షాక్ అవుతారు.

Krishna Mukunda Murari Today Episode: కృష్ణ నా చిన్నకోడలని ఏడువారాల నగలు ఇచ్చిన భవానీ.. అగ్రిమెంట్ పెళ్లి గురించి చెప్పమని అలేఖ్యకు ముకుంద సలహా..
Krishna Mukunda Murari
Follow us on

కృష్ణ చేతులకు గోరింటాకు పెట్టుకోవడం.. దురవేస్తుంది అంటూ మురారీ తో గోకించుకోవడం మధ్య రొమాంటిక్ సీన్ మొదలైంది. ‘ఏసీపీ సార్.. నేను మీరు కట్టిన తాళిని తీయను సార్.. అనుకుంటే.. నీతో గడిపిన క్షణాలను జ్ఞాపకంగా దాచుకుంటా అని మురారీ అనుకుంటాడు.. రేవతి కాంట్రాక్ట్ పెళ్లి గురించి భవానీ దేవికి చెప్పెయ్యలని భావించి .. అక్క అంటూ వస్తుంటే.. మరోవైపు భవానీ దేవి కూడా రేవతి అంటూ పిలిచి తనకు కృష్ణ అంటే ఉన్న ఇష్టాన్ని చెబుతుంది.

కృష్ణను కోడలుగా ఒప్పుకున్న భవానీ

మన కృష్ణ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నాకు మురారీ చేసిన పని నచ్చకే నేను కృష్ణను ద్వేషించానేమో.. కానీ తింగరి పిల్ల అంటే ఏమిటో నాకు అర్ధం అయింది.. మనిషిగా పుట్టి మనిషిగా పోవాలంటే స్వార్ధం ఉండకూడదు.. ఎదుటివారికి సాయ పడే తత్వం ఉండాలి.. అందుకే ఈ రోజు నా కూతురు నట్టింట్లో నవ్వుతు తిరుగుతుంది.. కృష్ణ చేసిన ట్రీట్మెంట్ తో ఎంతమందో ఆరోగ్యంగా తిరుగుతున్నారు.. ఇన్ని మంచి గుణాలున్న తనని నా కోడలుగా స్వీకరిస్తున్నాను.. నా తర్వాత ఇంటి బాధ్యతలను నడిపిస్తుందని నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం వచ్చింది కనుకనే.. నేను ఏడువారాల నగలు ఇద్దామనుకుంటున్నా.. కృష్ణకు ఈ విషయం చెప్పకు సర్ప్రైజ్ ఇస్తా అని చెబుతుంది.. రేవతి భగవంతుడా అక్క చేస్తున్నదంతా చూసైనా కృష్ణలో మార్పు వస్తే బాగుండు అని రేవతి అనుకుంటుంది.. కాపీ తీసుకొస్తా అంటూ వెళ్తుంది.

ఇవి కూడా చదవండి

పెళ్ళికి ముస్తాబయిన ఇల్లు 

గోరింటాకు బాగా పండితే మంచి మొగుడు వస్తాడని బామ్మ చెప్పింది.. నాకు మంచి మొగుడే వచ్చాడు.. కానీ ఇంకా పది రోజులు మాత్రమే ఉండేది.. తర్వాత గుడ్ మార్నింగ్ ఏసీపీ సార్ అని చెబుతుంది.. మురారీ కూడా ఇంకా కొన్ని రోజులు పొతే ఈ తింగరి ముఖం చూసేది ఉండదు అని అనుకుంటుంటే .. కుటుంబం సభ్యలు వచ్చి మీ పెళ్ళికి ఇంకా రెడీ అవ్వలేదా.. అంటూ మురారీని పెళ్లికొడుకుగా రెడీ చేయడానికి రూమ్ నుంచి బయటకు తీసుకుని వెళ్తారు.

నందుకు మురారీ అంటే ఇష్టం లేదని చెప్పిన ముకుంద 

ముకుంద నందు వద్దకు వచ్చి నీకు ఒక విషయం చెప్పాలంటూ .. మురారీకి కృష్ణ అంటే ప్రాణం.. కానీ కృష్ణకు ఈ పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు అని అంటుంది.. ఎప్పుడెప్పుడు ఇంట్లోనుంచి వెళ్లిపోదామా అనుకుంటుంది.. పాపం నాకు మురారీని చుస్తే జాలి వేస్తుంది అంటుంది.. అప్పుడు సునంద నాకు నిన్ను చూస్తే కూడా జాలిగా ఉంది.. ముకుందా అంటే.. ఎందుకు అని అడుగుతుంది.. ఆదర్శ్ లేకపోవడంతో నువ్వు కూడా ఒంటరి అయ్యావు కదా అంటుంది సునంద. ఇంకొన్ని రోజుల్లో కృష్ణ వెళ్ళిపోతుంది.. తెలుసా.. తెలుసు ముకుందా కానీ ఏమీ చెయ్యలేం.. అంటే ఇంతలో నందుని మురారీని రెడీ చేయ్యాలంటూ తీసుకుని వెళ్తాడు నందు భర్త.. ముకుందని కృష్ణను రెడీ చేయమని చెబుతుంది నందు.

పెళ్ళికొడుకు పెళ్లి కూతురుగా కృష్ణ, మురారీలు 

భవానీ పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది.. నందు నీ ప్రేమని కృష్ణకు నేను చెబుతా అంటుంది.. మురారీ వద్దు అంటూ ప్రతి చనువు ప్రేమ కాదు అర్ధం చేసుకో అంటాడు. కృష్ణను పెళ్లికూతురిగా రెడీ చేసి ముకుంద తీసుకుని వస్తుంది. తింగరి పిల్ల ఏమిటి పెద్దత్తయ్యా అంటే.. ఇంతకూ ముందు జరిగిన మీ ఇద్దరి పెళ్లి మేము ఎవరం చూడలేక పోయాం.. అందుకే ఇప్పుడు ఈ పెళ్లి ఏర్పటు అంటే ముకుంద తో సహా అందరూ షాక్ అవుతారు. అంతేకాదు ఇదంతా పెదత్తయ్య ప్లాన్ అన్న మాట.. అందుకే నిన్న సిద్దాంతిగారు వచ్చినప్పుడు మమ్మల్ని లోపలకి పంపిందా.. అనుకుంటూనే మీరు ఎన్ని చెప్పిన కృష్ణ మురారీకి అంగీకరించాలి కదా.. నేను మురారీ నిన్ను ప్రేమించడం లేదు అని చెప్పిన మాటలు బలంగా నమ్మింది అనుకుంటుంది ముకుంద..

మీరు ఎన్ని చేసినా కృష్ణ ఇంట్లో ఉండదు అనుకుంటుంటే.. మరోవైపు భవానీ ఈ పెళ్లితో నువ్వు సంపూర్ణంగా ఇంటి కోడలవి అవుతావు. నేను నిన్ను నా చిన్న కోడలుగా అంగీకరిస్తున్నా అని కృష్ణతో చెబుతుంది భవానీ దేవి.

ఏడువారాల నగలు కృష్ణకు

నీకు మన వంశపారంపర్యంగా చెందాల్సిన ఏడువారాల నగలు ఇప్పటివరకు ఇవ్వలేదు కదా.. ఇప్పుడిస్తా అంటుంది భవానీ.. స్వయంగా నా చేతులతో నగలు అలంకరించి నా కోడలుగా పట్టాభిషేకం చేబోతున్నా అంటే ముకుందా షాక్ తింటుంది.

రేవతి అక్క ప్రేమ చూసి అయినా కృష్ణ మనసురాలని కోరుకుంటే.. ఇన్ని రోజులు ఏసీపీ సార్ మనసులో నేను ఉన్నా అనుకుని భ్రమపడి.. ఆశలు పెంచుకుని మీ అందరిలో ఒకదానిలా కలిసి పోయా అనుకుంటుంది.. మా అగ్రిమెంట్ గురించి తెలియక అందరిలాగే మేము భార్యాభర్తలం అనుకుంటున్నారు.. ఐసీపీ సార్ అగ్రమెంట్ గురించి చెప్పేస్తా అన్నారు.. ఇంకెప్పుడు చెబుతారు అని ఆలోచిస్తుంటే..

భవానీ కృష్ణను మేడ మీదకు తీసుకెళ్తుంది..

నన్ను క్షమించు కృష్ణ ఇప్పుడు మన అగ్రిమెంట్ గురించి చెప్పి అందరి ఆనందాన్ని పాడు చెయ్యలేనుకుంటే.. సునంద మురారీతో .. కృష్ణ నీకు ఎదో చెప్పాలనుకుంటుంది వెళ్లు అంటే.. ఇదంతా ఇష్టం లేకుండా చేస్తుంది కృష్ణ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు..

ఏడువారాల నగలు అలంకరించిన భవానీ..

నీ వయసులో ఉన్నప్పుడు నేను నీకులా అల్లరి చెయ్యలేదు.. ఎప్పుడు భాద్యతగా ఉండేదానిని.. నాకు పెళ్లి అయ్యాక.. ఇంటి కోడలుగా అడుగు పెట్టిన తర్వాత బాధ్యతగా ఉండేదానిని. ఇంటి కట్టినప్పుడు మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం.. అప్పుడు మా అత్తయ్య అందరిలోనూ నన్ను ప్రత్యేకంగా పిలిచి తన తర్వాత ఈ ఇంటిని ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టేది నేనే అంటూ పొగిడి ఈ నగలు అలంకరించింది.. నేను కూడా ముగ్గురు కోడళ్లలో ఎవరు నా మనసు గెలుచుకుంటారో అని ఇప్పటి వరకూ ఈ నగలు ఇవ్వలేదు.. ఈ ఇంటి ఈ వంశ గౌరవాన్ని నిలబెట్టగలరో వారికివ్వాలని దాచా.. ఇప్పుడు నీకు ఇస్తున్నా అని చెప్పింది భవానీ

లేఖ్యకు సలహా

ఎంతైనా కృష్ణ మహా జాతకురాలు.. పెద్దయ్య మనసు గెలిచి చిన్న కోడలిగా పట్టాభిషేకం చేయించుకోవాలంటే మాటలు కాదంటూ ముకుందా రగిలిపోతూ అంటుంది.. కానీ పెద్దత్తయ్యకు తెలియని విషయం ఏమిటంటే.. కృష్ణ ఇంక కొన్ని రోజులకు వెళ్ళిపోతుందని..కృష్ణ ఉన్నన్ని రోజులు ఎంత ప్రేమ చూపిస్తే.. కృష్ణ వెళ్లిన తర్వాత అగ్రమెంట్ విషయం తెలిసి.. తనకు చెప్పలేదని తెలుసుకున్నాక.. అత్తయ్య కృష్ణను అంతగా అసహ్యించుకుంటుంది అంటూ ఆలోచిస్తుంది. ఈ విషయంలో నేను కల్పించుకోను అనుకుంది ముకుంద.

నాకు కావాల్సింది నా ప్రేమ మాత్రమే.. కృష్ణ మురారీని ప్రేమిస్తుందన్న ఒక్క విషయం ఇంట్లో ఎవరికీ తెలియక పోతే చాలు..నాప్రేమకు ఎలాంటి తిరుగు ఉండదు. మురారీ ప్రేమ నాకు దక్కితే చాలు ఈ నగలు, పట్టాభిషేకం ఏమీ అక్కర్లేదు అనుకుంటూనే.. ఇంతలో తోడికోడలు అలేఖ్య వచ్చి.. ముకుందా కృష్ణకు పెద్దయ్య ఏడువారాల నగలు ఇస్తుందట.. చిన్న కోడలుగా పట్టాభిషేకం చేస్తుందట.. అని అంటే.. ముకుంద నాకు తెలుసు అంటుంది.

ఇంట్లో ముగ్గురు కోడళ్ళం సమానమే కదా కృష్ణకు ఒక్కదానికే ఏడువారాల నగలు ఎలా ఇస్తుంది పక్షపాతం కదా అంటూ కోపాన్ని వ్యక్తం చేస్తుంది. చూడు అలేఖ్య నాకు నగల మీద ఇంటి అధికారం మీద ఎటువంటి ఇంట్రస్ట్ లేదు. నాకు కావాల్సింది నా ప్రేమ ఒకటే.. నాప్రేమకు అడ్డంవస్తే.. ఎవరినైనా ఎదిరిస్తా అంటుంది ముకుంద..

అలేఖ్య నాకుంది అంటే.. ఐతే వెళ్లి అడుగు అంటుంది ముకుంద. కృష్ణ ఒక్కతే మీ కోడలు కాదు కదా నేను కూడా మీ కోడలు కదా అని అడుగు అంటుంది.. అప్పుడు అలెఖ్య ఈ విషయంలో హెల్ప్ చెయ్యవా అంటే.. చేస్తా.. కృష్ణ, మురీరాల డి అగ్రిమెంట్ పెళ్లి అని చెప్పమని సలహా ఇస్తుంది. అంతేకాదు అగ్రిమెంట్ పెళ్లి గురించి సుమలత అత్తయ్యకు చెప్పు.. మిగతాది ఆమె చూసుకుంటుంది అంటే.. నేను చెప్పలేను ముకుంద అనుకుంటుంది అలేఖ్య.

భవానీ..  కృష్ణ నీ ప్రేమతో ఇంటి సభ్యుల మనసు దోచుకున్నావు. అందరు నీ మాటను వింటారు. అంటే.. నేను మీ ఇంటి కోడలు కాను పెద్దత్తయ్య అనుకుంటుంది. నేను డాక్టర్ అవ్వడం కోసం ఇదంతా నేను ఏసీపీ సార్ ఆడిన నాటకం.. ఇదంతా మీకు చెబుతా అంటే ఏసీపీ సార్ మీకు చెప్పవద్దు.. ఆయనే మీకు చెబుతా అన్నారు అనుకుంటూ కన్నీరు పెట్టుకుంటుంది కృష్ణ, ఇది కూడా మోసమే అనిపిస్తుంది పెద్దయ్య దయచేసి క్షమించండి అనుకుంటుంది.

కృష్ణకు ఏడువారాల నగలను వేసి లక్ష్మీదేవిలా ఆలనరికిస్తుంది

రేపటి ఎపిసోడ్ లో..

కృష్ణ మేడలో మూడు ముళ్ళు వేయనున్న మురారీ..

 

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..