Brahmamudi Serial, August 8th Episode: తగ్గని కావ్య.. ఇరుక్కపోయిన రాజ్.. షాక్ లో దుగ్గిరాల ఫ్యామిలీ
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్యని ఇరికించి మంచి పని చేశావు బంగారం అంటూ స్వప్నని పొగుడుతాడు రాహుల్. దీంతో స్వప్న దొరికిందే ఛాన్స్ కదా అని సంతోష పడుతుంది. ఏం కావాలని రాహుల్ అడగ్గా.. ప్రేమ కావాలంటూ అని అడుగుతుంది స్వప్న. దీంతో ఇద్దరూ ఒక్కటవుతారు. తెల్లారి లేచేసరికి.. ఆ విషయం తెలిసి చిరాకు పడతాడు రాహుల్. కానీ స్వప్న మాత్రం ఆనందంగా ఫీల్ అవుతుంది. ఇక కావ్య పొద్దున్నే పుట్టింటికి వెళ్లడానికి రెడీ అవుతుంది. ఈలోపు రాజ్ కనిపించి.. ఏంటి మేడంగారు ఎక్కడికో వెళ్తున్నారు? అని ప్రశ్నిస్తాడు. కంగారు పడకండి..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్యని ఇరికించి మంచి పని చేశావు బంగారం అంటూ స్వప్నని పొగుడుతాడు రాహుల్. దీంతో స్వప్న దొరికిందే ఛాన్స్ కదా అని సంతోష పడుతుంది. ఏం కావాలని రాహుల్ అడగ్గా.. ప్రేమ కావాలంటూ అని అడుగుతుంది స్వప్న. దీంతో ఇద్దరూ ఒక్కటవుతారు. తెల్లారి లేచేసరికి.. ఆ విషయం తెలిసి చిరాకు పడతాడు రాహుల్. కానీ స్వప్న మాత్రం ఆనందంగా ఫీల్ అవుతుంది. ఇక కావ్య పొద్దున్నే పుట్టింటికి వెళ్లడానికి రెడీ అవుతుంది. ఈలోపు రాజ్ కనిపించి.. ఏంటి మేడంగారు ఎక్కడికో వెళ్తున్నారు? అని ప్రశ్నిస్తాడు. కంగారు పడకండి.. అత్తింటి డబ్బును పుట్టింటికి తీసుకెళ్లడం లేదు. ఎందుకైనా మంచిది మీరు బ్యాగ్ చెక్ చేసుకోండి అంటూ కావ్య చూపిస్తుంది. ఇక్కడ నిన్ను ఎవరూ దొంగ అనలేదు అంటాడు రాజ్. అన్న బాగుండేది.. సంతోషపడేదాన్ని. కానీ నా కష్టాన్ని నేనే దోచుకున్నాను అన్నారు. అదే కొంచెం ఇబ్బందిగా ఉందని కావ్య అంటుంది. మళ్లీ నాతో గొడవ పడటానికి వచ్చావా? అని రాజ్ అడుగ్గా.. లేదు మా నాన్న దగ్గరికి వెళ్తున్నానని చెప్పడానికి వచ్చాను అని చెబుతుంది కావ్య. మళ్లీనా అని అడుగుతాడు రాజ్. అక్కడే ఫోన్ లో మాట్లాడుతూ ఉన్న రాహుల్.. కావ్య, రాజ్ లు మాట్లాడుకునేది వింటూంటాడు.
మళ్లీ ఎందుకు వెళ్తున్నావ్.. నిన్న అంత గొడవ జరిగింది సరిపోలేదా? అని రాజ్ అనగా.. ఏ వెళ్లకూడదా? అని కావ్య అంటుంది. మీ నాన్నకి అవసరమైన మనీ ఇచ్చేశావు కదా.. మళ్లీ ఎందుకు వెళ్తున్నావ్ అని రాజ్ అంటాడు. అవసరం తీరింది.. కానీ సమస్య ఇంకా అలానే ఉంది.. అందుకే ఆ సమస్య తీర్చడానికి ఓ నిర్ణయం తీసుకున్నాను అంటుంది కావ్య. ఏంటది అని అడుగుతాడు రాజ్. నేను వెళ్లి మళ్లీ మా నాన్న షాప్ లో పని చేయాలి అని అనుకుంటున్నాను అంటుంది కావ్య. దీంతో షాక్ తింటాడు రాజ్. ముందులా కష్టపడి మా నాన్న కష్టం తీర్చాలని అనుకుంటున్నాను.. ఏ చేయకూడదా.. అని అడుగుతుంది కావ్య. ఈ ఇంటి కోడలు అయిన తర్వాత నువ్వు వెళ్లి ఆ షాపులో పని చేస్తే బాగుంటుందా అని రాజ్ అడిగితే.. నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారని ఇబ్బంది పడుతున్నారా అని కావ్య అడుగుతుంది. నేను మన కంపెనీలో జాబ్ ఆఫర్ చేసినా.. రిజెక్ట్ చేసి మరీ వెళ్లడమెందుకు? అని ప్రశ్నిస్తాడు రాజ్.
ఎందుకనేది రాత్రే చెప్పాను.. ఇక నేను ఆ కంపెనీలో నేను పని చేయలేను.. డబ్బులు కూడా తీసుకోలేను.. ముఖ్యంగా మా వాళ్ల కోసం అవసరమయ్యే రూపాయి కూడా నేను ఈ ఇంటి నుంచి తీసుకోను.. తండ్రి కష్టాన్ని పంచుకోవడం నా బాధ్యత అని అంటుంది కావ్య. నువ్వు వెళ్లడం నాకు ఇష్టం లేదు అంటాడు రాజ్. వెళ్లడం నాకు కూడా ఇష్టం లేదండి.. కానీ వెళ్లడం తప్పడం లేదని కావ్య అంటుంది. ఇక ఇదంతా విన్న రాహుల్.. ఇదే మంచి చాన్స్.. ఇంత పెద్ద ఇంటి కోడలు అయి ఉండి.. మళ్లీ మట్టి పని చేస్తుందా? ఇది మనకు బాగా ఉపయోగపడే విషయమే అని అనుకుంటాడు.
ఈ సీన్ కట్ చేస్తే.. పెద్ద కాంట్రాక్ట్ మిస్ అయిందని కృష్ణ మూర్తి ఫ్యామిలీ చాలా బాధపడుతుంది. కరెక్ట్ గా అదే సమయానికి కాంట్రాక్టర్ వచ్చి.. ఈ కాంట్రాక్ట్ మీకే ఇస్తున్నామండి.. కావ్య రాత్రి ఫోన్ చేసి వినాయకుడి విగ్రహాలు చేస్తానని చెప్పింది.. ఇదిగో అడ్వాన్స్ డబ్బులు తీసుకోండి అని కాంట్రాక్టర్ అంటాడు. ఇది విన్న ఇంటి సభ్యులందారూ షాక్ అవుతారు. అప్పుడే కావ్య వస్తుంది.. ఏంటి నాన్న అలా చూస్తున్నారు తీసుకోండని అంటుంది. నేను మా నాన్నతో మాట్లాడి కాంట్రాక్ట్ ని పూర్తి చేస్తానని కాంట్రాక్టర్ కి చెప్తుంది కావ్య. దీంతో అక్కడినుంచి కాంట్రాక్టర్ వెళ్లిపోతాడు. కానీ కృష్ణమూర్తి సంకోచిస్తాడు.. మీ ఇంటి పరువు ఏం అవుతుంది అని అంటాడు. కనకం కూడా ఏంటమ్మా ఇది అని అడుగుతంది. దీంతో కావ్య మొండికేస్తుంది.. మీరు ఈ కాంట్రాక్ట్ చేయకపోతే.. మీకు కూతురే లేదనుకోండి.. ఇక మీకు నాకూ సంబంధం లేదని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కనకం, అప్పు అందరూ కంగారు పడతారు. కృష్ణమూర్తి పిలవమని చెప్తారు. దీంతో కృష్ణ మూర్తి ఆగు.. మీ ఇంటికి ఎలాంటి పరువు నష్టం లేకుండా ఈ పని చేయ్.. అలాంటిదేమైనా వస్తే.. తక్షణమే నువ్వు ఈ పని వదిలేసి వెళ్లిపోవాలి అంటాడు. దీనికి కావ్య కూడా సరే అంటుంది.
ఈలోపు దుగ్గిరాల వారి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి టిఫిన్ ముందు కూర్చుని తింటారు. అదేంటి నువ్వు వడ్డిస్తున్నావ్.. మహారాణి గారు ఇంకా నిద్ర లేవలేదా? అని ధాన్య లక్ష్మిని అడుగుతుంది రుద్రాణి. అక అప్పుడే వచ్చిన రాజ్.. అబ్బా ఆ కళావతి పుట్టింటికి వెళ్లిందని అంటే.. మళ్లీ అమ్మ సీరియస్ అవుతుందేమో.. ఇక రుద్రాణి కామెంట్స్ కి సెటైర్లు వేస్తూ.. ఏ కావ్య చేస్తే వడ్డిస్తే గానీ.. తిననంత అలవాటు పడిపోయావా నా కోడలికి అంటుంది. ఇక ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరుగుతుంది. దీంతో ఇందిరాదేవి ఎంటర్ అయి.. మీరిద్దరూ ఒక్క నిమిషం కూడా కలిసి ఉండలేరా?ఎప్పుడూ మాటల యుద్ధం చేసుకుంటారా? అని అంటుంది. ఇక పనిమనిషిని కావ్య ఎక్కడ? గదిలో ఉందా? అని ఇందిరా దేవి అడుగుతుంది. తెలీదు అమ్మగారూ.. ఉదయమే వచ్చి వంట చేసి.. అమ్మగారికి పని ఉందని.. నన్ను వడ్డించమని హడావిడిగా వెళ్లిపోయారు.
ఈలోపు ప్రకాశం మాట్లాడుతూ.. ఇందాక కావ్య వెళ్లేటప్పుడు అని అనగా.. ఎక్కడికి వెళ్లిందో చెప్పిందా అని అడుగుతాడు సుభాష్. ఈలోపు రాజ్ భయపడుతూ బాబాయ్ మర్చిపోయావా.. బయటికి వెళ్తున్నాను మావయ్యా అని కావ్య చెప్పిందా.. ఆ.. నువ్వు ఎక్కడికి అని అడిగావ్.. అవును అంటాడు ప్రకాశం.. పుట్టింటికి వెళ్తున్నాను మావయ్యా అని చెప్పింది కదా.. అని మ్యానేజ్ చేయడానికి ట్రై చేస్తాడు రాజ్. పుట్టింటికే.. పుట్టింటికే వెళ్లింది అని మొత్తానికి చెప్తాడు రాజ్. నిన్నంత గొడవ జరిగిన తర్వాత కూడా ఎందుకు వెళ్లింది? చెప్పి వెళ్లాలి కదా? అని అపర్ణ సీరియస్ అవుతుంది. సుభాష్ ఎంటర్ అవుతూ.. రాజ్ కి చెప్పింది కదా.. ఎందుకు చిన్న విషయానికి కూడా సీరియస్ అవుతావ్ అంటాడు. రాజ్ మనసులో మాట్లాడుకుంటూ.. ఈ కళావతి చేసిన పనులు నాకు రోజుకో పరీక్షలా తయారవుతున్నాయి. మ్యానేజ్ చేయలేక చస్తున్నా అనుకుంటాడు. ఇక కృష్ణమూర్తి ఫ్యామిలీ అంతా ఆనందంగా కలిసి బొమ్మలు తయారు చేయడానికి మట్టి తొక్కుతారు. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.