Bigg Boss 8 Telugu: గంగవ్వ ఎలిమినేట్.. ఐదు వారాలకు ఎంత సంపాదించిందంటే..
బిగ్బాస్ సీజన్ 8 పదో వారం ఎలిమినేషన్ లో అనేక ట్విస్టుల మీద సాగుతుంది. ఈసారి డబుల్ ఎలిమినేషన్ తో ప్రేక్షకులకు పెద్ద సర్ ప్రైజ్ ఇవ్వనుంది. అయితే ఈ వారం నామినేషన్లలో లేకుండానే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది గంగవ్వ.. అనారోగ్య సమస్యల కారణంగా గంగవ్వ ఎలిమినేట్ అయ్యింది. ఇంతకీ ఆమె సంపాదన ఎంతో తెలుసా..
బిగ్బాస్ సీజన్ 8 పదో వారం ఎలిమినేషన్ సమయం దగ్గర పడింది. అయితే ఈసారి ఎలిమినేషన్ ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతుంది. ఇప్పటికే డబుల్ ఎలిమినేషన్ అంటూ ప్రచారం నడుస్తుంది. ఈసారి విష్ణుప్రియ, హరితేజ బయటకు రానున్నారని గత మూడు నాలుగు రాజోలుగా టాక్ నడుస్తుంది. కానీ ఎవరిని హౌస్ నుంచి ఎలిమినేట్ చేయాలని తెగ తర్జనభర్జన పడుతోంది బిగ్బాస్ టీం. ఓటింగ్ ప్రకారం ఈసారి హరితేజ చివరి స్థానంలో ఉండగా ఆమె ఎలిమినేషన్ పక్కా అని తెలిస్తోంది. ఈవారం మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఇక హరితేజతోపాటు మరో కంటెస్టెంట్ కూడా బయటకు రానుందని టాక్ నడిచింది. అయితే ఇప్పుడు ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్ట్ జరిగింది. ఈ వారం నామినేషన్లలో లేని గంగవ్వ హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అనారోగ్య సమస్యలతో ఆమెను ఇంటికి పంపిస్తున్నారు. ఫ్యామిలీ వీక్ వరకూ మాత్రమే హౌస్ లో ఉంటానని ముందే చెప్పిన గంగవ్వ.. 8వ వారంలోనే అనారోగ్య సమస్యలతో బయటకు వచ్చింది.
ఇప్పటికే హౌస్ లో గంగవ్వను డాక్టర్లు కూడా పరీక్షించారట. దాంతో 9వారంలో ఆమె బయటకు రానుందని అనుకున్నారు. కానీ ఆరోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో ఆమెను బయటకు పంపించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు గంగవ్య రెమ్యునరేషన్ గురించి నెట్టింట ప్రచారం నడుస్తుంది. అక్టోబర్ 6న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన గంగవ్య.. టాస్కులలో చురుకుగా ఉండేది. ఆ తర్వాత చేతి నొప్పి, నిరంతర అసౌకర్యంతో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. దీంతో నాగార్జునతో మాట్లాడిన గంగవ్వ బయటకు వెళ్లిపోతానని చెప్పింది.
ఇదిలా ఉంటే.. గంగవ్వ బిగ్బాస్ హౌస్ లో ఉన్నప్పుడూ వారానికి రూ.3.5 లక్షలు పారితోషికం తీసుకుందంట. అంటే రోజుకు రూ.50 వేలు. అంటే ఆమె హౌస్ లో దాదాపు ఐదు వారాలకు రూ.17.5 లక్షలు తీసుకుందని తెలుస్తోంది. గంగవ్వ వెళ్లిపోవడంపై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. గతంలో సీజన్ 4లోనూ అడుగుపెట్టింది గంగవ్వ. అప్పట్లోనూ అనారోగ్య కారణాలతోనే మధ్యలోనే వెళ్లిపోయింది.
ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్ను చూశారా..?
Tollywood: ఆ ఒక్క డైలాగ్తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?
Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..
Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.