Karthika Deepam: నీ పెళ్లి జరగదంటూ వార్నింగ్ మీద వార్నింగ్ అందుకుంటున్న మోనిత.. కన్నింగ్ పనిని కనిపెట్టే పనిలో దీప

|

Jul 09, 2021 | 8:33 AM

Karthika Deepam: తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని రోజుకో ట్విస్ట్ తో ఆసక్తి కరంగా సాగుతున్న కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1087 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు సీరియల్ లోని హైలెట్స్ ఏంటో చూద్దాం..

Karthika Deepam: నీ పెళ్లి జరగదంటూ వార్నింగ్ మీద వార్నింగ్ అందుకుంటున్న మోనిత.. కన్నింగ్ పనిని కనిపెట్టే పనిలో దీప
Karhika Deepam
Follow us on

Karthika Deepam: తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని రోజుకో ట్విస్ట్ తో ఆసక్తి కరంగా సాగుతున్న కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1087 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు సీరియల్ లోని హైలెట్స్ ఏంటో చూద్దాం.. ఈ మార్పు నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు.. ఎందుకంటే.. నిన్నటి వరకూ నేను తప్పుచేసినవాడిలా తల దించుకున్నా.. ఈ మార్పు నీకు అసహ్యంగా ఉండొచ్చు.. అంత తప్పు చేసి.. ఏమీ జరగని వాడిలా ఇదేంటి అని నువ్వు ఆలోచించవచ్చు.. నిజంగా నేను ఏ తప్పు చేయకుండానే అపరాధ భావంతో నిన్నటి వరకూ తలదించుకుని ఉన్నా.. ఇప్పుడు నేను రీలైజ్ అయ్యాను. నావల్ల ఎదో జరిగిందంటే.. నా మనసాక్షి ఒప్పుకోవడం లేదు.. నా అంతరాత్మ అంగీకరించడం లేదు.. అందుకే ఎవరో చెప్పినట్లు తలదించుకోవాల్సిన అవసరం గానీ వాళ్ళు చెప్పినట్లు చేయాల్సిన పని లేదు .. అందుకే ఇప్పటి నుంచి నా మనసు చెప్పింది నేను చేస్తాను.. నా మనసు నిండా నా భార్య బిడ్డలు మాత్రమే ఉన్నారు. వాళ్ళ సుఖం సంతోషం మాత్రమే ముఖ్యం.. ఈ ఆనందం సొంతం చేసుకోవడానికి దేనినైనా ఎదిరించగలను.. కానీ ఒకటి నీలోనుంచి ఆ అనుమానాన్ని అపనమ్మకాన్ని తుడిచేయాలి. ఈ నెల 25 తేదీ లోపు ఈ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. కొంచెం ఓపిక పట్టు దీప. అంటూ.. తన మనసులోని మాటలను చెబుతాడు దీపకు. ఇదంతా నటన కాదు నిజం.. నీ మీద ఒట్టు.. నీవాడినే.. ఇంపార్టెంట్ అయిన పని ఉంది వెళ్లివస్తాను అంటూ.. అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

ఆదిత్య మోనిత మాటలను గుర్తు చేసుకుంటూ.. మోనితను కార్తీక్ ను అసహ్యించుకుంటాడు. మా అన్నయ్య అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మమ్మి ఎప్పుడు వస్తుంది. అంటే రెండు వారాలు పడుతుంది.. అంటే… సమస్యను గాలికి వదిలి వెళ్ళిపోయింది. వెళ్లేముందు.. అన్నయ్యను తప్పు లేదు అనిపిస్తుంది. వాడి వైపు నుంచి కూడా ఆలోచించు అని అంది.. ఇందులో ఆలోచించడానికి ఏముంది శ్రావ్య.. మన ఫ్యామిలీకి తలవంపులు తెచ్చే విషయం.. ఏమని ఆలోచించాలి. అంటే.. శ్రావ్య ..ఆదిత్య నీతో అత్తయ్య ఒక విషయం చెప్పవద్దు అంది.. ఈ నెల 25న పెళ్లి చేసుకోవాడానికి రిజిస్టర్ ఆఫీస్ లో స్లాట్ బుక్ చేసుకుంది అని చెబుతుంది. నువ్వు చెప్పేది నిజమా .. అంటే.. అవును నిజమే.. ఇప్పుడు కూడా చెప్పక పొతే బాగుందని.. చెబుతున్నా అంటే.. చాలా లెట్ చేసేవు శ్రావ్య.. వదినకి ఇదొక కొత్త సమస్యా.. వదినకు ఈ విషయం తెలుసా అంటే.. శ్రావ్య తెలుసు అని తలఊపుతుంది. వదిన ఎలాంటి నిర్ణయం తీసుకుందో అనుకుంటాడు..

దీప ఫ్యామిలీ ఫోటో ని చూస్తూ సంతోష పడుతుంది. అందులో మోనిత గీసిన 10గీత కనిపిస్తాయి. అప్పుడు పిల్లలు కార్తీక్ మాటలను గుర్తు చేసుకుని ఆ గీతలను చెరిపేస్తుంది. కార్తీక్ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుంది అన్న మాటలను గుర్తుచేసుకుంటుంది.

భాగ్యం దగ్గరకు మోనిత వస్తుంది.. నువ్వా ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నా.. అంటే.. నేను వస్తాను అని నీకు ముందే తెలుసా.. అంటే.. పేడ అనేది పిడకలు వేయడానికి .. కళ్ళాపు జల్లడానికి పనికి వస్తుంది అంటే.. ఆపు నీ పిడకల గోల ఆసుపత్రికి వచ్చి పిచ్చి వాగుడు అంతా వాగేవంట అంటే. భాగ్యం.. పిచ్చిదానా అది పిచ్చి వాగుడు కాదు.. మిరపకాయలో కారమే ఉంటుంది. బెల్లం కాదు.. అలాగే నీ విషయం లో అదే నిజం అంటే.. ఏమిటి నీ ఉద్దేశ్యం అంటే.. నరసమ్మ ఏమి చెప్పారో అదే.. అంటే.. ఎంత దైర్యం నీకు నా గురించి ఇంకా పూర్తిగా తెలియదు.. ఈ నెల 25 న పెళ్లి చేసుకోబోతున్న అని తెలిసి ఈ వాడుగు అంతా ఏమిటి అంటే.. ఎవతె నా అల్లుడిని పెళ్లి చేసుకునేది.. నీలాంటి ఆడదాన్ని పెళ్లి చేసుకునే ఖర్మ నా అల్లుడికి పట్టనివ్వను.. రేపు ఇంకొకతి వచ్చి.. కర్వేపాకు కోసం కార్తీక్ దగ్గరకి వెళ్తే కడుపు చేశాడు అంటారు.. ఇలానే చూస్తూ ఉరుకుంటాను అనుకుంటున్నావా.. ఏమిటి అలా చూస్తున్నావు.. కారం నూరి.. కళ్ళలో కుక్కి పంపిస్తా అంటూ తన స్టైల్ లో వార్నింగ్ ఇస్తుంది. మోనిత మర్యాదగా మాట్లాడు.. నేను సాక్ష్యం లేకుండా మాట్లాడను అంటే.. నువ్వు ఒక డాక్టర్ వి దొంగ సాక్ష్యం పుట్టించవని గ్యారెంటీ ఏమిటి అని భాగ్యం ప్రశ్నిస్తే.. మోనిత షాక్ తింటుంది. నా అల్లుడి మంచితనాన్ని అడ్డు పెట్టుకుని నువ్వే దొంగ సాక్ష్యం పుట్టించావేమో.. ఇక్కడ నీ నాటకాలు చూస్తూ ఊరుకునే ప్రేక్షకులు ఎవరూ లేరు పో అంటే.. మోనిట షాక్ తో నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు కొత్త కథ అల్లితే జరిగేవన్నీ ఆగిపోతాయనుకున్నావా అంటే.. ఏమిటేజరిగేది.. పెళ్ళైన వాడి మీద మోజు పెంచుకోవడం ఏమిటి అంటూ నా అల్లుడు నీలాంటి వాడు ఐతే.. నిన్ను నడిరోడ్డు మీద నిలబెట్టి.. నీ చరిత్ర మొత్తం బయట పెట్టేవాడు,.. నాకూతురు దీప అత్తింటి గౌరవం పోతుందని నోటు విప్పడం లేదు ఇదిగో దానికి మందంటే.. నీ మొఖం ఎప్పుడో పచ్చడి అయిపోయేది అంటే.. మోనిత అసహనంతో ఛీఛీ అంటూ.. నీలాంటి దానితో మాట్లాడానికి రావడం నాది బుడ్డి తక్కువ అంటే.. భాగ్యం ఎక్కడా తగ్గకుండా నాది సేమ్ ఫీలింగ్ అంటుంది.. మీరు అంతా ఏమీ చూసుకుని దైర్యంగా ఉన్నారో నాకు తెలియదు.. నా దగ్గర సాక్ష్యం ఉంది.. అది చూసుకుని దైర్యంగా ఉన్నా అంటే.. పోవే అని చీదరించుకుంటుంది భాగ్యం. నువ్వు చేసుకుంటావో చేసుకో.. నీ కాకమ్మ కథలు నమ్మేవాళ్ళు లేరు.. అంటే… రేపు ఆధారాలు తెచ్చి అప్పుడు మాట్లాడతా అంటూ అక్కడనుంచి వెళ్ళిపోతుంది.

దీప దగ్గరకు ఆదిత్య వస్తాడు. అత్తయ్య కాల్ చేశారా అంటే.. నాకు కాదు శ్రావ్యకు కాల్ చేసింది. అంటే.. ఆవిడ వెళ్లడమే మంచి.. నాకు మీ అన్నయ్యకు మధ్య నలిగిపోయారు. అక్కడ స్వప్న దగ్గరైనా ప్రశాంతంగా ఉంటారు అంటుంది దీప. మోనిత తో పెళ్లి ఆపడానికి మనకు ఎంతో టైం లేదు అంటే.. మీ అన్నయ్య మీద నీ అభిప్రాయం ఇంటికి ఆదిత్య.. మంచి కి చెడుకు. తప్పుకు ఒప్పుకు మధ్య సరిహద్దు గీసేటంత లోక జ్ఞానం నాకు తెలియదు అంటే.. నీకంటే లోకం తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అంటే.. మోనిత దైర్యంగా ఉంది. కడుపులో సాక్ష్యం ఉంది. మీ అన్నయ్య దైర్యంగా ఉన్నారు.. పైగా తెగింపు కూడా వచ్చింది. పైగా నటించడం లేదు.. నిజమే నిజాయతీగా చెబుతున్నారు అనిపిస్తుంది. అంటే చూసావా వదినా.. నీకు అన్నయ్యకు ఎంత తేడా ఉందొ.. పదేళ్ల పాటు నిజమే చెప్పావు.. నిజాయతీగా చెప్పావు.. అన్నేళ్లు అన్నయ్య అర్ధం చేసుకోలేదు.. అన్నయ్య ఇప్పుడు తప్పు చేశాడో లేదో పక్కన పెడితే.. నువ్వు అంటే.. ఇప్పుడు అవకాశం వచ్చింది కదా అని నేను మాట్లాడితే.. అప్పుడు బంధాలకు విలువ లేదు.. అర్ధం లేదు అంటుంది దీప. ఈ సమస్య మీ అన్నదే కాదు.. నాది పిల్లలది మన కుటుంబానిది మన వంశానిది.. అంటే అన్నయ్యను నమ్ముతున్నావు కదా వదినా అంటాడు ఆదిత్య. నువ్వు నా భవిష్యత్ గురించి ఆలోచించావు.. ఇప్పుడు మీ అన్నయ్య ఒక్కరే అయిపోయారు.. ఈ పెళ్లి అనే ఊబిలో కూరుపోతున్నారు.. ఎవరూ నమ్మడం లేదని బాధపడుతున్నారు.. నమ్మకం.. అపనమ్మకం అన్న మాటకు తావిస్తే.. సమస్య పరిష్కారం కాదు.. అంటున్న దీపకు.. ఆదిత్య తాను గతంలో పిల్లలు పుడతారా లేదో టెస్టు చేయించుకోమని చెప్పిన సంగతి దీపకు చెబుతాడు ఆదిత్య. లాబ్ కి వెళ్ళాడు ఆ తర్వాత ఏమి జరిగింది తెలియదు అంటాడు.

Also Read:

 ఏపీ ప్రజలకు అలర్ట్.. వచ్చే 14 రోజులు కుండపోత వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు!