Bigg Boss Tamil 5 : మరోసారి బిగ్ బాస్ హోస్ట్‌గా కమల్ హాసన్.. అక్టోబర్ నుంచి ప్రారంభం

|

Aug 06, 2021 | 4:08 PM

Bigg Boss Tamil 5 : సౌత్ సూపర్ స్టార్ కమల్ హాసన్ మరోసారి వెండితెరపై మెరవబోతున్నారు. తమిళ రియాలిటీ షో 'బిగ్ బాస్' 5 హోస్ట్‌గా తిరిగి వస్తున్నారు.

Bigg Boss Tamil 5 : మరోసారి బిగ్ బాస్ హోస్ట్‌గా కమల్ హాసన్.. అక్టోబర్ నుంచి ప్రారంభం
Kamal Haasan
Follow us on

Bigg Boss Tamil Season 5 : సౌత్ సూపర్ స్టార్ కమల్ హాసన్ మరోసారి వెండితెరపై మెరవబోతున్నారు. తమిళ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ 5 హోస్ట్‌గా తిరిగి వస్తున్నారు. ఈయన అధ్వర్యంలో బిగ్ బాస్ 4 విజయవంతమైంది. ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు. హోస్ట్‌గా కమల్ హాసన్‌ని అభిమానులు చాలా ఇష్టపడ్డారు. బిగ్ బాస్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ బిగ్ బాస్ సీజన్ 5 తమిళ వెర్షన్‌కి కమల్ హాసన్ ని హోస్ట్‌గా డిక్లేర్ చేశారు.

నివేదికల ప్రకారం.. బిగ్‌ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లకు నియమ నిబంధనలు బోధించడానికి మరోసారి కమల్ హాసన్‌ ఫైల్‌పై సంతకం చేశారు. బిగ్‌బాస్ షో ప్రదర్శన కోసం సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అన్ని సవ్యంగా సాగితే అక్టోబర్ నుంచి షో మొదలవుతుంది. ప్రదర్శన వ్యవధి మూడు నెలలు. మరోవైపు కమల్ హాసన్ తన రాబోయే చిత్రం ‘విక్రమ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అతను ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి బిగ్ బాస్ 5 షూటింగ్‌లో పాల్గొంటానని చెబుతున్నారు.

ఇటీవల సూపర్ స్టార్ కమల్ హాసన్ తన అప్ కమింగ్ ఫిల్మ్ ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఇది అతని అభిమానులకు బాగా నచ్చింది. ఇది గొప్ప సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాలో కమల్ హాసన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సినిమా విషయంలో ప్రేక్షకుల్లో చాలా ఉత్సాహం ఉంది. మీడియా నివేదికల ప్రకారం.. మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.

కమల్ హాసన్ బహిరంగంగా కేంద్ర ప్రభుత్వ సినిమాటోగ్రఫీ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. చిత్రనిర్మాతగా, ఈ బిల్లు సృజనాత్మక వ్యక్తుల స్వేచ్ఛను హరిస్తుందని విశ్విసస్తున్నారు. దీని కోసం అతను జూలై 27 న సమావేశం నిర్వహించారు. పార్లమెంటరీ కమిటీ చైర్మన్ శశి థరూర్ కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం ఈ బిల్లు నిబంధనలను ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రతిచోటా నిరంతర వ్యతిరేకత ఉంది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్లందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

Viral Video : అడవిపందిపై దాడి చేయడానికి చెట్టుపై మాటు వేసిన చిరుత..! గుర్తించిన పంది ఏం చేసిందంటే..?

Gold Funds: భారీ లాభాల కోసం ప్లాన్ చేస్తున్నారా.. పెట్టుబడి పెట్టడానికి ముందు ఇది తెలుసుకోండి..

Dengue: ఓవైపు కరోనా కల్లోలం.. మరోవైపు డెంగ్యూ అటాక్.. తెలంగాణలో విపత్కర పరిస్థితులు