Jabardasth Vinod: సోషల్ మీడియా వేదికగా తన భార్యను పరిచయం చేసిన వినోద్.. సాలిడ్ సమాధానం చెప్పాడుగా…

జెబర్దస్థ్ షో తెలుగు ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ఎంత పాపులర్ అయ్యింది అందులోని నటులు కూడా అంతే పాపులర్ అయ్యారు.

Jabardasth Vinod:  సోషల్ మీడియా వేదికగా తన భార్యను పరిచయం చేసిన వినోద్.. సాలిడ్ సమాధానం చెప్పాడుగా...
Vinod

Updated on: Jul 05, 2021 | 3:12 PM

Jabardasth Vinod: జెబర్దస్థ్ షో తెలుగు ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ఎంత పాపులర్ అయ్యింది అందులోని నటులు కూడా అంతే పాపులర్ అయ్యారు. అయితే వీరిలో కొంత మంది మాత్రం వివాదాలతో హైలెట్ అయ్యారు.  ఇదిలా ఉంటే ఈ షోలో లేడీ గెటప్స్ తో అలరించే వారు చాల మందే ఉన్నారు. వారిలో వినోద్ ఒకరు. వినోద్ గతంలోనూ పలు వివాదాలతో వార్తల్లో నిలిచాడు. జబర్దస్త్ షోలో వినోద్ ఎక్కవగా లేడీ గెటప్స్ వేసేవాడు. వినోద్ లేడీ గెటప్ వేస్తే అమ్మాయిలు కూడా అసూయపడేలా.. మగాళ్లు కిర్రెక్కిలా ఉంటాడు. వినోద్ తో పాటు లేడీ గెటప్స్ వేసే కొంతమంది పూర్తిగా అమ్మాయిలుగా మారిపోవడంతో వినోద్ కూడా అలానే మారిపోతాడని పుకార్లు పుట్టుకొచ్చాయి.

వినోద్ పైన చాలా మంది ట్రోల్ చేశారు.. అనేక కామెంట్లు కూడా చేశారు. కానీ వినోద్ ఎప్పుడు తాను వేసిన అమ్మాయి గెటప్స్ పైన మాట్లాడలేదు. అయితే తన పైన విమర్శలు చేసే వారికి ఈ సారి సాలిడ్ సమాధానం చెప్పాడు. జబర్ధస్ వినోద్ పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించాడు. తన విజయలక్ష్మికి చెందిన ఫోటోల్ని షేర్ చేశాడు. లేడీ గెటప్స్ వేస్తున్నాడని తన మీద చాలానే పుకార్లు పుట్టించారు.. అలాంటి వారందరికి తన పెళ్లితో సమాధానం ఇచ్చాడు వినోద్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ashritha: వెంకటేష్ కూతురు ఆశ్రిత ఒక్క పోస్ట్ పెడితే ఎంత అందుకుంటుందో తెలుసా ?..

Rashmika Mandanna: రష్మికకు జంతువులంటే అమితమైన ప్రేమ.. పావురం దగ్గర్నుంచి కుక్క పిల్లల వరకు అన్నింటినీ..

Vijay Devarakonda : కొత్త లుక్‌తో అదరగొడుతున్న విజయ్ దేవరకొండ..! భారీ కండలు, పొడవాటి జుట్టుతో వైరల్ అవుతున్న ఫొటో..