
జబర్దస్త్ టీవీ షోలో పాల్గొని ఇప్పుడు తెలుగు సినిమాల్లో సత్తా చాటుతోన్న వారు చాలామందే ఉన్నారు. సుడిగాలి సుధీర్, బలగం వేణు, గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్, ధనాధన్ ధన్ రాజ్, చలాకీ చంటి, ముక్కు అవినాష్, అదిరే అభి, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, ముక్కు అవినాశ్, శాంతి కుమార్ తదితర జబర్దస్త్ ఆర్టిస్టులు ఇప్పుడు డైరెక్టర్లుగా, హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే జబర్దస్త్ టీవీ షోలో సుమారు ఏడేళ్లు ఉన్నాడు. సుమారు 300 కు పైగా ఎపిసోడ్స్ చేశాడు. లేడీ గెటప్పులతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు.. కట్ చేస్తే.. ఈ నటుడు ఇప్పుడు కూరగాయలు, ఆకు కూరలు అమ్ముకుంటున్నాడు. వీటి ద్వారా వచ్చిన డబ్బులతోనే జీవనం సాగిస్తున్నాడు. అతను మరెవరో కాదు జబర్దస్త్ లో ఖమ్మం సుజాతగా లేడీ గెటప్పులతో ఆకట్టుకున్న శేఖర్. ఇతనిది తెలంగాణలోని ఖమ్మం ప్రాంతం. చాలామంది లాగే ఎన్నో ఆశలతో జబర్దస్త్ లో అడుగు పెట్టాడు. హైపర్ ఆది సహాయంతో ఈ షోలోకి అడుగు పెట్టిన అతను వెంకీ మంకీ టీంలో చాలా ఏళ్ల పాటు ఉన్నాడు. ఖమ్మం సుజాతగా విభిన్నమైన లేడీ గెటప్పులు వేస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. అయితే క్రమంగా అవకాశాలు తగ్గిపోవడం, కుటుంబ పోషణ భారం కావడంతో ఇప్పుడు కూరగాయలు, ఆకు కూరలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
‘ నేను తొమ్మిదో తరగతి వరకు చదివాను. ఆ తర్వాత అమ్మ నాన్న చదివియ్వకపోవడంతో కూలి పనులకు వెళ్లాను. మిర్చి మార్కెట్ లో హమాలీ పనులు చేశాను. నేను మంచి డ్యాన్సర్ ను. అదృష్టం కొద్దీ జబర్దస్త్ లో అవకాశమొచ్చింది. నాకున్న ట్యాలెంట్ తో చాలా మందిని నవ్వించాను. కానీ ఆ అదృష్టం ఎక్కువ రోజులు నాతో ఉండలేకపోయింది. నా భార్యకు థైరాయిడ్, బ్లడ్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఉన్నాయి. తరచూ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తుంది. అలాగే పిల్లల స్కూల్ ఫీజులు , ఇలా చాలా ఖర్చులు ఉన్నాయి. నా భార్య, పిల్లలకు దగ్గరగా ఉండాలనే జబర్దస్త్ కు దూరమయ్యాను. అలాగే ఆర్థిక సమస్యల కారణంగా జబర్దస్త్ ను వదిలి పెట్ట్సాల్సి వచ్చింది. నా కుటుంబాన్ని నేనే పోషించాలి. వీరిని వదిలిపెట్టి ఎక్కడకు పోలేను. ఒకవేళ జబర్దస్త్ లో మళ్లీ అవకాశమొస్తే ఆలోచిస్తాను. కానీ ప్రస్తుతానికి నా కుటుంబమే నాకు ముఖ్యం’ అని ఎమోషనల్ అయ్యాడు శేఖర్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.