జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న వారిలో వినోద్ కూడా ఒకరు. వినోద్ అంటే చాలా మందికి గుర్తుకు రాకపోవచ్చు కానీ జబర్దస్త్ వినోదిని అంటే ఇట్టే గుర్తు పడతారు. ఈ టాప్ కామెడీ షోలో లేడీ గెటప్స్ తో బాగా ఫేమస్ అయిన వారిలో వినోద్ కూడా ఒకరు. చీర కట్టి బొట్టు పెడితే అచ్చం అమ్మాయిలాగే ఉంటాడు వినోద్. మొదట్లో చాలా మంది అతనిని చూసి అమ్మాయే అనుకున్నారు కూడా. అంతలా తన లేడీ గెటప్పులతో బుల్లితెర ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు వినోద్. కాగా గత కొన్నేళ్లుగా జబర్దస్త్ తో పాటు బుల్లితెరకు కూడా దూరంగా ఉంటున్నాటీ నటుడు. అయితే తన సొంత యూట్యూబ్ ఛానెల్ ‘వినోద్ తో వినోదం’ అంటూ అభిమానులతో టచ్ లో ఉంటున్నాడు. ఇదిలా ఉంటే జబర్దస్త్ వినోద్ రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. ఇప్పుడు అతని భార్య విజయ లక్ష్మీ గర్భంతో ఉంది. తాజాగా ఆమెకు గ్రాండ్ గా సీమంతం కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు వినోద్. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు జబర్దస్త్ వినోద్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అంతకు ముందు మెటర్నిటీ ఫొటోషూట్ లో కూడా పాల్గొంది వినోద్ భార్య విజయ లక్ష్మి. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు వినోద్. ఇందులో ఎంతో క్యూట్ గా కనిపించారీ లవ్లీ కపుల్.
కాగా తన మేనత్త కూతురు విజయలక్ష్మినే పెళ్లి చేసుకున్నాడు వినోద్. ఆమె స్వస్థలం కడప. లాక్ డౌన్ సమయంలో వీరి వివాహం జరిగింది. 2022లో వినోద్- విజయలక్ష్మీ దంపతులకు పాప పుట్టింది.
ఇప్పుడు వీరు రెండోసారి అమ్మానాన్నలు కాబోతున్నారు. దీంతో వినోద్ దంపతుల ఆనందానికి అవధుల్లేవు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.