Punch Prasad: జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ ఆరోగ్యం సీరియస్.. దాతల సాయం కావాలని విజ్ఞప్తి..

|

Jun 03, 2023 | 3:43 PM

గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతోపాటు.. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెగ్యూలర్ గా డయాలసిస్ చేయించుకున్నప్పిటకీ ఆయన ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్ గా ఉందని.. జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

Punch Prasad: జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ ఆరోగ్యం సీరియస్.. దాతల సాయం కావాలని విజ్ఞప్తి..
Punch Prasad
Follow us on

బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్స్ సుపరిచితమే. అందులో తనదైన పంచులతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు కమెడియన్ పంచ్ ప్రసాద్. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతోపాటు.. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెగ్యూలర్ గా డయాలసిస్ చేయించుకున్నప్పిటకీ ఆయన ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్ గా ఉందని.. జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. వీలైనంత త్వరగా అతడికి ఆపరేషన్ చేయాలని.. అందుకు చాలా ఖర్చవుతుందని.. అందుకు దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని కోరాడు.

పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ.. అతని సొంత యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో రిలీజ్ చేశాడు నూకరాజు. “ఎన్నో ఆసుపత్రులు తిరిగాం. అయినా ప్రసాద్ అన్న ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. మూడు సంవత్సరాల క్రితమే రెండు కిడ్నీలు ఫెయిలవగా.. అప్పటినుంచి ఆ బాధను అలాగే భరిస్తున్నాడు. ఈ కిడ్నీ సమస్య ఉన్నవారికి ఒకదాని వెనుక మరొక జబ్బులు వస్తూనే ఉంటాయి. అన్న విషయంలోనూ అదే జరిగింది. వీలైనంత త్వరగా అతడికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించాలని వైద్యులు చెప్పారు. లేదంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. కిడ్నీ ఆపరేషన్ కు లక్షల్లో ఖర్చవుతుంది. చేతులెత్తి వేడుకుంటున్నా.. దయచేసి మీకు తోచినంత సాయం చేయండి” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు నూకరాజు.

పంచ్ ప్రసాద్ రెండు కిడ్నీలు దాదాపు 80 శాతం వరకు పాడైపోయాయి. అయితే గత కొద్ది రోజులుగా ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఓవైపు అనారోగ్య సమస్యలు వేధిస్తున్నప్పటికీ జబర్దస్త్ కామెడీ షోలో తన పంచులతో ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.