Hyper Aadi: ‘నేను కేవలం ఆర్టిస్ట్‏ను మాత్రమే.. అది పొరపాటే.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను’.. హైపర్ ఆది.. 

| Edited By: Janardhan Veluru

Jun 15, 2021 | 5:03 PM

Hyper Aadi: జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది పై ఎల్పీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. తెలంగాణ యాస, భాష సంస్కృతిని అవమానపరిచాడని..

Hyper Aadi: నేను కేవలం ఆర్టిస్ట్‏ను మాత్రమే.. అది పొరపాటే.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను.. హైపర్ ఆది.. 
Hyper Aadi
Follow us on

Hyper Aadi: జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది పై ఎల్పీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. తెలంగాణ యాస, భాష సంస్కృతిని అవమానపరిచాడని.. బతుకమ్మ, గౌరమ్మలను కించపరుస్తూ మాట్లాడాడని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ మాట్లాడుతూ.. హైపర్ ఆది మాటలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయి. వెంటనే ఆది బేషరతుగా క్షమాపణ చెప్పాలి లేదంటే.. తెలంగాణలో తిరగనివ్వం. షూటింగ్ స్ఫాట్ కి వెళ్లి హైపర్ ఆదిని అడ్డుకుంటాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఈ వివాదంపై హైపర్ ఆది స్పందించారు. ” నేను ఎక్కడ తెలంగాణ సంస్కృతిని కించపరిచేలా మాట్లాడ లేదు.. ఆ షో లో నేను కేవలం ఆర్టిస్ట్ ను మాత్రమే..ఆ స్క్రిప్ట్ నేను రాయలేదు.. బహుశ ఎడిటింగ్ తప్పిదం వల్ల పొరపాటు జరిగి ఉండవచ్చు.. నేను తెలంగాణ ప్రజలక్షమాపణకు సిద్ధం గా ఉన్నాను ” అని చెప్పారు హైపర్ ఆది. ఇదిలా ఉంటే.. ఓ కార్యక్రమంలో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాషను కించపరిచేలా హైపర్ ఆది మాట్లాడారని.. స్క్రీఫ్ట్ రైటర్.. ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పై కూడా ఫిర్యాదు చేశారు తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు.  గతంలో కూడా ఆదిపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఆది ఓ స్కిట్ చేశారని ఆరోపిస్తూ.. పలువురు అనాథ పిల్లలు, సినీ విమర్శకుడు కత్తి మహేష్ లు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.

పీకల్లోతు వివాదంలో జబర్దస్త్ హైపర్ ఆది..Watch video

Also Read: Lemon Peels: రక్తపోటును, చర్మ సమస్యలను తగ్గించడమే కాకుండా.. గుండె ఆరోగ్యానికి మేలు చేసే నిమ్మ తొక్కలను ఎలా ఉపయోగించాలో తెలుసా..

Actor Ali: సినీ నటుడు అలీ ఆశ ఈసారైనా నెరవేరుతుందా?.. సీఎం వైఎస్ జగన్ ఆలోచన ఎలా ఉంది?.. ఇంట్రస్టింగ్ స్టోరీ మీకోసం..

Col Santosh Babu Statue: కల్నల్‌ సంతోష్‌బాబు త్యాగం మరువలేనిది.. సూర్యాపేటలో సంతోష్‌బాబు విగ్రహన్ని అవిష్కరించిన మంత్రి కేటీఆర్