
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎంతో మంది కమెడియన్లు తమ ట్యాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ టీవీ షో ఒక చక్కని వేదికగా నిలిచింది. ఈ షో ద్వారా చాలామంది ఫేమస్ అయ్యి సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుస్తున్నారు. అలాగే సొంత ఇల్లను నిర్మించుకుంట్లూ, కార్లను కొనుగోలు చేస్తూ ఫైనాన్షియల్ పరంగానూ మంచిగా సెటిల్ అవుతున్నారు. తాజాగా మరో జబర్దస్త్ కమెడియన్ తన సొంతింటి కలను సాకారం చేసుకున్నాడు. అతనే గల్లీ బాయ్ భాస్కర్. పటాస్ షోతో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన అతను తన దైన హాస్యంతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టాప్ కామెడీషోస్‌లోనూ భాగమయ్యాడు. సద్దాం, యాదమ్మ రాజు, జ్ఞానేశ్వర్ తదితరులతో కలిసి స్కిట్స్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరవయ్యాడు. అడపాదడపా కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. తాజాగా గల్లీ బాయ్ భాస్కర్ కూడా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. పూజాది కార్యక్రమాలతో మొదలెట్టి గ్రాండ్ గా గృహ ప్రవేశం చేశాడు. ఈ శుభ కార్యానికి జబర్దస్త్ కమెడియన్లు, భాస్కర్ స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు.
తన నూతన గృహప్రవేశానికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు భాస్కర్. వీటికి ‘ నా డ్రీమ్ హౌస్ కట్టుకున్నాను. నాకు సహకరించిన వాళ్లందరికీ ధన్యవాదాలు’ అని ఎమోషనల్ అయ్యాడు. ఈ వీడియోలో గృహ ప్రవేశం సందర్భంగా తన ఫ్యామిలీ పూజలు చేస్తున్న ఫొటోలు, అలాగే తన కొత్త ఇంటిని చూపించాడు.
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మూడు అంతస్థుల ఇల్లు కట్టుకుని మురిసిపోతున్న భాస్కర్ కు పలువురు టీవీ సెలబ్రిటీలు, కమెడియన్లు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.