
Serials TRP Rating: భిన్నమైన కుటుంబ కథ, కథనం ఉంటే ఆ సీరియల్స్ కు బుల్లితెర ప్రేక్షకులు పట్టంగడతారు. ఏళ్లకు ఏళ్ళు ఆ సీరియల్స్ ను ఆ సీరియల్స్ లో నటించిన నటీనటులను ఆదరిస్తారు. కొంతమంది బుల్లితెర నటీనటులు వెండి తెరపై హీరో, హీరోలతో సమానంగా అభిమానులు కూడా సంపాదించుకున్నారు. కార్తీక దీపంలో వంటలక్క, డాక్టర్ బాబు క్యారెక్టర్ లో నటించిన ప్రేమీ విశ్వనాథ్ ను, నిరుపమ్ లను ఎంతగా ఆదరిస్తున్నారో అందరికీ తెలిసిందే.. ఇప్పుడు అదే బాటలో బుల్లితెరపై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు, ఇంటింటి గృహలక్ష్మి, జానకికలగనలేదు వంటి సీరియల్స్ కూడా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకున్నాయి. ఈ సీరియల్స్ లో నటిస్తున్న నటీనటులను ఆదరిస్తున్నారు.
విభిన్నమైన కథ, కథనాలతో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సినిమా కూడా బుల్లితెర ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్స్ లో దూసుకుపోతుంది. గత కొన్ని వారాలుగా మంచి టీఆర్ఫీ రేటింగ్ తో సెకండ్ ప్లేస్ లో నిలుస్తోంది గుప్పెడంత మనసు.
ఈ సీరియల్ లో రుషి, వసుధార, జగతి, మహేంద్ర కు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు రుషి ఫ్రెండ్ గౌతమ్ కూడా అందరిని ఆకట్టుకున్నాడు. విలన్ గా దేవయాని నటన కూడా అందరినీ ఆకట్టుకుంది. రిషి వసుధలను ఏదైనా కోరిక కోరుకోమని అంటే.. మహింద్రా, జగతిల పెళ్లి రోజు పార్టీని చేయమని కోరుతుంది. దీంతో రుషి ఒప్పుకుంటాడు. మరి దేవయాని నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది సీరియల్ బృందం క్రియేట్ చేసింది. ముఖ్యంగా హీరో హీరోయిన్లు తమ నటనతో అందంతో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇంటింటి గృహ లక్ష్మి కూడా టీఆర్ఫీ రేటింగ్ లో దూసుకుపోతుంది. తులసి పాత్రకు ప్రేక్షకులు పట్టం గడుతున్నారు. జానకి కలగనలేదు కొంచెం వెనకబడింది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..