తెలుగు ప్రేక్షకులకు జగతి మేడమ్ సుపరిచితమే. ప్రస్తుతం బుల్లితెరపై నంబర్ వన్ సీరియల్‌గా కొనసాగుతున్న ‘గుప్పెడంత మనసు‘ ప్రేక్షకులకు దగ్గరయ్యింది జగతి అలియాస్ జ్యోతిరాయ్. ఇందులో రిషి తల్లిగా జగతి మేడమ్ పాత్రలో ఆమె నటన అడియన్స్ హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకుంది. సంప్రదాయ కట్టుబొట్టు బొట్టుతో.. సహజ నటనతో మెప్పించింది. అయితే బుల్లితెరపై ఎంతో సంప్రదాయ లుక్ లో కనిపించే జ్యోతిరాయ్ సోషల్ మీడియా పోస్టుల గురించి చెప్పక్కర్లేదు. టీవీల్లో జనాలు చూసే జగతి మేడమ్ వేరు.. ఇన్ స్టాలో జ్యోతిరాయ్ వేరు. కొంతకాలంగా నెట్టింట చిట్టి డ్రెస్సులతో గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ రచ్చ చేసింది జ్యోతి. అయితే గ్లామర్ పిక్స్ షేర్ చేయడానికి గల క్లారిటీని ఇటీవలే ఇచ్చేసింది.
ఇప్పటికీ బుల్లితెరపై అలరిస్తోన్న జ్యోతిరాయ్.. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతుంది. ది ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ ద్వారా సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ నెట్టింట తెగ వైరలయ్యింది. ఇదిలా ఉంటే.. చాలా రోజులుగా జ్యోతిరాయ్ వ్యక్తిగత విషయాలపై అనేక రకాల వార్తలు వినిపించాయి. ఇప్పటికే పెళ్లై ఓ బాబు ఉన్న జ్యోతిరాయ్ ఓ యంగ్ డైరెక్టర్ తో ప్రేమలో ఉందనే టాక్ నడిచింది. అందుకు తగ్గట్టుగానే ఆమె సోషల్ మీడియాలో అతడితో సన్నిహితంగా తీసుకున్న సెల్ఫీలు షేర్ చేయడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.
ఇక తాజాగా ఆ వార్తలకు క్లారిటీ ఇచ్చేసింది జ్యోతి రాయ్. ఇన్నాళ్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమని తేల్చేసింది. యంగ్ డైరెక్టర్ సుకు పుర్వాజ్ తో ఎంగెజ్మెంట్ జరిగిందంటూ అఫీషియల్ గా చెప్పేసింది. సుకు పుర్వాజ్ తో కలిసి ఉన్న ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. క్యాప్షన్ లో ఉంగరం గుర్తుతోపాటు లవ్ బర్డ్స్ ఏమోజీలను పెట్టింది. దీంతో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగినట్లుగా కన్ఫార్మ్ అయ్యింది. ఇక త్వరలోనే వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.