
పై ఫొటోలో ఉన్న ముసలావిడను గుర్తు పట్టారా? రెగ్యులర్ గా టీవీ సీరియల్స్ చూసే వారయితే ఆమెను గుర్తు పట్టవచ్చు. ఎందుకంటే ఆమె బుల్లితెర సూపర్ స్టార్. ఆన్ స్క్రీన్ లో యాక్టింగ్ ఇరగ దీసే ఈ అమ్మడు ఆఫ్ స్క్రీన్ లో మాత్రం చాలా చలకీగా ఉంటుంది. ఎప్పు డూ గలగలా మాట్లాడుతూ అందర్ని నవ్విస్తుంటుంది. ముఖ్యంగా వచ్చీరాని తెలుగుతో ఈ ముద్దుగుమ్మ వేసే జోకులు చాలా ఫన్నీగా ఉంటాయి. అందుకే ఈ అందాల తారకు బుల్లితెరపై ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఇక సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ బుల్లితెర బ్యూటీ ఉన్నట్లుండి షాకింగ్ లుక్ లో కనిపించింది. వయసైపోయిన ముసలావిడిగా దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఫొటోల్లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు బ్రహ్మముడ సీరియల్ ఫేమ్ కావ్య అలియాస్ దీపిక రంగరాజు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దీపిక ఇటీవల తన ఇన్ స్టా గ్రామ్ హ్యాండిల్ లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ఆమె వృద్ధురాలిగా కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే బ్రహ్మముడి సీరియల్ కోసమే ఆమె ఇలా వృద్ధురాలి గెటప్ లో ముస్తాబైందట. తమిళనాడుకు చెందిన దీపికా రంగరాజు బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఓ తమిళ ఛానెల్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత చిత్రిరమ్ పెసుతాడి అనే తమిళ్ సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైంది. కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించిన ఈ అందాల తార బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది. ఇందులోరాజ్ (మానస్) భార్య కావ్య పాత్రలో దీపిక రంగరాజు అద్భుతంగా నటించింది. ఈ సీరియల్ తో దీపిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.