Bigg Boss 6 Telugu: అతనే బిగ్‏బాస్ 6 విన్నర్.. విజేత ఎవరో చెప్పేసిన గూగుల్..

|

Dec 14, 2022 | 3:47 PM

ఈ చివరి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అసలు విషయం చెప్పేశారు హోస్ట్ నాగార్జున. అంటే ఈరోజు ఒకరు ఇంటి నుంచి బయటకు రాబోతున్నారు. దీంతో ఐదుగురు మాత్రమే ఉండనున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ ఎవరనేది ఆదివారం తెలియనుంది.

Bigg Boss 6 Telugu: అతనే బిగ్‏బాస్ 6 విన్నర్.. విజేత ఎవరో చెప్పేసిన గూగుల్..
Bigg Boss 6 Telugu
Follow us on

ఏదైతేనేం ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది బిగ్‏బాస్ సీజన్ 6. గత సీజన్ల కంటే దారుణంగా రేటింగ్ సంపాదించుకుంటూ చివరి వరకు లాక్కొచ్చారు. దాదాపు 21 మందితో మొదలైన రియాల్టీ షోలో ప్రస్తుతం 6గురు సభ్యులు మిగిలారు. అయితే అన్నింటికంటే భిన్నంగా ఈ చివరి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అసలు విషయం చెప్పేశారు హోస్ట్ నాగార్జున. అంటే ఈరోజు ఒకరు ఇంటి నుంచి బయటకు రాబోతున్నారు. దీంతో ఐదుగురు మాత్రమే ఉండనున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ ఎవరనేది ఆదివారం తెలియనుంది. అయితే ఈ సీజన్ ముందు నుంచి రేవంత్ విన్నర్ అవుతాడనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే.. ఈసారి ఉన్న కంటెస్టెంట్లలో అత్యంత ఎక్కువ క్రేజ్ ఉన్నది అతనికే. అయితే తన ఆట తీరుతో ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుంటూ టైటిల్ రేసులోకి వచ్చిన ఇనయను గతవారం అడ్డు తొలగించేశారు బిగ్ బాస్. దీంతో ఇక రేవంత్ విన్నర్ కావడం ఖాయమని అంతా అనుకుంటున్న సమయంలో అసలు విన్నర్ ఎవరో చెప్పేసింది గూగుల్.

నిజమే.. బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్ కాదట. విజేత అనగానే గూగుల్ రేవంత్ పేరు కాకుండా మరొకరి పేరు చూపిస్తుంది. ఇంతకీ ఎవరా అని ఆలోచిస్తున్నారా ?.. అతను మరెవరో కాదు.. రోహిత్. గూగుల్ లో బిగ్ బాస్ 6 విన్నర్ ఎవరు అని సెర్చ్ చేస్తే రోహిత్ పేరు చూపిస్తుండడంతో అంతా షాకవుతున్నారు. వాస్తవానికి బిగ్ బాస్ ముందు వరకు రోహిత్ పేరు ఎక్కువ మందికి తెలియదు. ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా అతనికి అంతగా స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు. కానీ రోజు రోజుకీ తన ఆట తీరు.. తన ప్రవర్తనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు రోహిత్.

ఆట కోసం తన వ్యక్తిత్వాన్ని ఏమాత్రం మార్చుకోకుండా.. తనలాగే ఉన్నాడు రోహిత్. ఓవరాక్షన్ చేయకుండా.. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా.. ఇంట్లోని ప్రతి ఒక్కరి నిర్ణయాన్ని గౌరవిస్తూ.. తన ఆటను తానలాగే ఆడాడు. ఎవరెన్ని మాటలు అంటున్నా.. సహనం కోల్పోకుండా.. తన మంచితనాన్ని ఇతరుల అవకాశంగా తీసుకున్నా.. అవేం ఆలోచించకుండా ముందుకు సాగాడు రోహిత్. అలా ఓ విజేతకు కావాల్సిన అన్ని లక్షణాలు ఉండి.. విన్నర్ మెటిరియల్ అనిపించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

Rohith Sahni

అయితే బిగ్ బాస్ చివరి వారం రోహిత్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న సభ్యులలో రోహిత్ ప్రత్యేకం.. ఎలాంటి హంగులు.. ఆర్భాటం.. ఓవరాక్షన్.. కోపం… కన్నింగ్ లేకుండా తన ఆట తాను ఆడుతూ ఫైనల్ వరకు వచ్చాడు. ఇక తన మాట.. ఆట తీరుతో అభిమానులను సంపాందించుకున్న రోహిత్ విన్నర్ అయ్యాడంటూ గూగుల్ సైతం చూపిస్తుండడంతో అతని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఎవరవుతారనేది మాత్రం తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.