
మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా కు గ్లోబ్ ట్రాటర్ (వర్కింగ్ టైటిల్) సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ బిగ్ ఈవెంట్ జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోన్న ఈ ఈవెంట్ కోసం చిత్ర బృందంతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అతిరథ మహారథులు తరలిరానున్నారు. అలాగే అభిమానులు కూడా పెద్ద ఎత్తున రానున్నారు. ఇప్పటికే ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో రామోజీ ఫిల్మ్ సిటీకి తరలివచ్చారు. అయితే ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో ఎలాంటి అపశ్రుతులు చోటు చేసుకుండా ముందు జాగ్రత్తగా పరిమిత సంఖ్యలో మాత్రమే పాసులు ఇచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలో మహేష్ బాబు ను చూసేందుకు ఒక అభిమాని ఖండాంతరాలు దాటి వచ్చాడు. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం ఏకంగా 6817 కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్ కు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఒక పోస్ట్‌ను రాజమౌళి కుమారుడు కార్తికేయ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా వెలుగొందుతోన్న మహేష్ బాబకు విదేశాల్లోనూ భారీగా అభిమానులు ఉన్నారు. అందుకే అతని సినిమాలు ఓవర్సీస్ లో భారీ కలెక్షన్లను రాబడుతుంటాయి. ఈ నేపథ్యంలో సునీల్ ఆవుల అనే అభిమాని గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం ఓ చిన్న సాహసమే చేశాడు. మహేష్ ను చూసేందుకు ఏకంగా సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఇందుకోసం 6817 కిలోమీటర్ల దూరం 12 గంటల పాటు ప్రయాణం చేశాడు. ఈ విషయాన్ని కార్తికేయ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఒక తెలుగోడు మాత్రమే అనుభూతి చెందే బిగ్గెస్ట్ ఎమోషన్ ఇదే. ఈ అభిమానానికి ఆకాశం కూడా హద్దు కాదు’ అని కార్తికేయ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
After 12hr of flight and 6817 kms from streets of Perth to RFC Hyderabad. #JaiBabu @urstrulyMahesh #GlobeTrotter day. pic.twitter.com/eWZzlwg5gB
— Sunil Avula (@avulasunil) November 15, 2025
Every fan is a star
And this time , they all together shine for the
super star @urstrulyMahesh #GlobeTrotter #GlobeTrotterEvent #SSMB29 pic.twitter.com/LRpFfdBqXn— NizamMBFC (@Nizam_MBFC_) November 15, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.