
బిగ్ బాస్.. బిగ్ బాస్.. బిగ్ బాస్.. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఇదే పేరు వినిపిస్తోంది. బుల్లితెర ఆడియెన్స్ ఎదురు చూపులకు తెర దించుతూ ఈ ఆదివారం (సెప్టెంబర్ 07) నుంచే బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచింగ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓపెనింగ్ ఎపిసోడ్ కు ఘాటీ చిత్ర బృందం కూడా రానున్నట్లు తెలిసింది. అనుష్క కూడా ఈ షోలో సందడి చేసే అవకాశముంది. మరోవైపు హౌస్ లో అడుగు పెట్టే కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియాలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరు వస్తారన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అయితే బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్ కు ముందు మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డి ఈసీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ల లిస్టును లీక్ చేశాడు. గతంలో అతని అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. కాబట్టి ఈసారి కూడా ఆదిరెడ్డి చెప్పిన కంటెస్టెంట్లలో చాలా మంది హౌస్ లోకి అడుగు పెట్టవచ్చు.
ఆదిరెడ్డి విశ్లేషణ ప్రకారం జబర్దస్త్ రీతూ చౌదరి, కమెడియన్ ఇమ్మానియేల్, రాను బొంబాయి రాను ఫేమ్ రాము రాథోడ్, సీరియల్ నటి తనూజా గౌడ, లక్స్ పాప ఆశా షైనీ, సీరియల్ విలన్ భరణి శంకర్, నటుడు సుమన్ శెట్టి, కొరియో గ్రాఫర్ శ్రష్టి వర్మ, సంజనా గల్రానీ వంటి సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగు పెట్టనున్నారు.
ఇక కామన్ మ్యాన్ కేటగిరి నుంచి ఐదు లేదా ఆరుగురిని కంటెస్టెంట్లుగా సెలెక్ట్ చేస్తారని ఆదిరెడ్డి చెప్పుకొచ్చారు. వారిలో మాస్క్ మ్యాన్ హరీశ్, మర్యాద మనీశ్, శ్రీజ, ఆర్మీ పవన్ కల్యాణ్, ప్రియా, పవన్ హౌస్‌లోకి వచ్చే అవకాశముందని ఈ మాజీ కంటెస్టెంట్ అంచనా వేశాడు. మరి ఆదిరెడ్డి చెప్పిన వాళ్లంతా బిగ్‌బాస్ హౌస్‌లో కనిపిస్తారా? లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
కాగా ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నాయి. షో ప్రారంభమైన రెండు వారాల తర్వాత కానీ, దీపావళి రోజు కానీ ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చే అవకాశముంది.