Hyper Aadi: జబర్దస్త్ కమెడియన్‌ హైపర్ ఆది మార్కుల లిస్టులు చూశారా? పది , ఇంటర్‌లో ఎంత స్కోరు చేశాడో తెలుసా?

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో హైపర్ ఆది ఒకడు. సందర్భమేదైనా పంచుల వర్షం కురిపించే అతను ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు టీవీషోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.

Hyper Aadi: జబర్దస్త్ కమెడియన్‌ హైపర్ ఆది మార్కుల లిస్టులు చూశారా? పది , ఇంటర్‌లో ఎంత స్కోరు చేశాడో తెలుసా?
Jabardasth Comedian Hyper Aadi

Updated on: Sep 05, 2025 | 7:03 PM

హైపర్ ఆది.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సందర్భమేదైనా పంచుల వర్షం కురిపించే ఈ నటుడికి చాలా మంది అభిమానులు ఉన్నారు. చాలా మందిలాగే ఆది కూడా జబర్దస్త్ కామెడీ షోతోనే కమెడియన్ గా కెరీర్ ప్రారంభించాడు. మొదట అదిరే అభి టీంలో మెంబర్ గా చేరాడు. తన పంచులు, ప్రాసలతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. తన ట్యాలెంట్ తో అనతి కాలంలో తనే టీమ్ లీడర్ గా ఎదిగాడు. ప్రస్తుతం టీవీ షోలు చేస్తూనే సినిమాల్లోనూ మెరుస్తున్నాడు ఆది. అల్లరి నరేష్ హీరోగా నటించిన మేడ మీద అమ్మాయి సినిమాలో నటించడంతో పాటు ఆ మూవీకి డైలాగ్ రైటర్ గా కూడా వ్యవహరించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. దీంతో పాటు తొలి ప్రేమ, ఆటగదరా శివ, సవ్య సాచి, మిస్టర్ మజ్ఞు, చిత్రల హరి, వెంకీ మామ, అలా వైకుంఠపురం, క్రాక్, ధమకా, సార్, దాస్ కా ధమ్కీ, గ్యాంప్స్ ఆఫ్ గోదారి, పుష్ప2, మజాకా ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించి తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఇక పవన్ కల్యాణ్ ను అమితంగా అభిమానిస్తారు హైపర్ ఆది. పలు సందర్భాల్లో పవన్ గురించి, జనసేన గురించి హైపర్ ఆది చేసిన ప్రసంగాలు సోషల్ మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి. మరి సందర్భమేదైనా గ్యాప్ లేకుండా పంచుల వర్షం కురిపించే హైపర్ ఆది ఏం చదువుకున్నాడు? మనోడు చదువులో చురుగ్గా ఉండేవాడా? లేక బ్యాక్ బెంచర్ స్టూడెంటా? అన్నది ఇటీవల ఓ టీవీ షోలో వెలుగులోకి వచ్చింది.

ఇటీవల ప్రముఖ టీవీ షో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది మార్కుల జాబితాలను ప్రదర్శించారు. పదో తరగతిలో అతనికి మొత్తం 600 మార్కులకు గాను 534 మార్కులు వచ్చాయి. ఇక ఇంటర్ మార్కుల విషయానికి వస్తే హైపర్ ఆదికి 1000 కిగాను ఏకంగా 945 మార్కులు వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో మాథ్స్ లో ఏకంగా 75 కి 75 మార్కులు రావడం విశేషం.

ఇవి కూడా చదవండి

Hyper Aadi 10th Class Marks list

ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్ పూర్తి చేశాడు హైపర్ ఆది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఓ కంపెనీలో ఉద్యోగం కూడా చేశాడు. అయితే ఆ తర్వాత నటనపై మక్కువతో జబర్దస్త్ లోకి అడుగు పెట్టాడు. తన చదువు, మార్కుల గురించి మాట్లాడిన ఆది.. ‘నేను ఏడో తరగతిలోనూ స్కూల్ టాపర్ . ఇప్పటికి నేను చదివిన స్కూల్ కి వెళ్తే అక్కడ టాపర్స్ లిస్టులో కోటా ఆదయ్య అని నా పేరు నోటీసు బోర్డులో ఉంటుంది. నా పూర్తి పేరు అదే. ఇక పదో తరగతిలో నేను స్కూల్ సెకండ్ వచ్చాను. ఆ తర్వాత ఇంటర్, బీటెక్ లో కూడా నాకు చాలా మంచి మార్కులు వచ్చాయి’ అని చెప్పుకొచ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.