బుల్లితెర ప్రేక్షకులకు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్ధస్త్, ఢీ షోలలో తనదైన పంచులతో ఆడియన్స్ను కడుపుబ్బా నవ్విస్తాడు ఆది. ఎప్పుడూ ఎంతో సరదాగా.. సంతోషంగా ఉండే ఆది.. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. యాంకర్ రష్మీ గౌతమ్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షోకు రోజు రోజుకీ ప్రేక్షకాదరణ పెరిగిపోతుంది. ఇందులో హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, ఇమాన్యుయేల్ తదితరులు తమ స్కిట్లతో అలరిస్తున్నారు. ఆది పంచులతో, ఆటో రాంప్రసాద్ కామెడీతో అతి తక్కువ సమయంలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన ప్రోమోలో హైపర్ ఆది కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. తాజాగా విడుదలైన ప్రోమోలో.. ఒక టేబుల్ మీద కంటెస్టెంట్స్ ఫోటోస్ పెట్టారు. తమకు నచ్చని వారి ఫోటోను చింపేయడం లేదు. కాల్చివేయడం చేయ్యాలంటూ యాంకర్ రష్మి చెప్పగా.. ముందుగా వచ్చిన ఆటో రాం ప్రసాద్.. హైపర్ ఆది వలన ఒక విషయంలో పర్సనల్ గా హర్ట్ అయ్యానంటూ అతని ఫోటో తగలబెట్టారు. అనంతరం పరదేశి వచ్చి నాకు అన్ని హైపర్ అదే అని చెప్తాను. కానీ ఒక రీజన్ వల్ల ఇలా చేయాల్సి వస్తోందన్నాడు. షోకు మొదట వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చావు అని కాకుండా ఎప్పుడు వెళ్తావు అని అడిగారు. నాకు నచ్చలేదంటూ రష్మి ఆది ఫోటోను చింపేసింది. దీంతో హైపర్ ఆది కంటతడి పెట్టుకున్నాడు. ఆ తర్వాత టేబుల్ వద్దకు వెళ్లిన ఆది.. అందులో ఒకరి ఫోటో తీసి చేత పట్టుకున్నాడు. ఆది ఎవరి ఫోటో తీసుకున్నాడు అనేది తెలియాలంటే ఎపిసోడ్ మొత్తం వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.