AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Vishnu-Hyper Aadi: అరరే.. ఈ డైలాగ్స్ ఎక్కడో విన్నట్లుందే.. హైపర్ ఆది పంచులు మాములుగా లేవుగా.

హైపర్ ఆది.. పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సత్తా ఉన్నా కామెడియన్. ప్రసలతోనే కామెడిని సృష్టించేస్తాడు..

Manchu Vishnu-Hyper Aadi: అరరే.. ఈ డైలాగ్స్ ఎక్కడో విన్నట్లుందే.. హైపర్ ఆది పంచులు మాములుగా లేవుగా.
Hyper Aadi
Rajitha Chanti
|

Updated on: Oct 31, 2021 | 9:28 AM

Share

హైపర్ ఆది.. పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సత్తా ఉన్నా కమెడియన్. ప్రసలతోనే కామెడిని సృష్టించేస్తాడు.. కేవలం స్క్రిప్ట్ పరంగానే కాకుండా.. ప్రస్తుత పరిస్థితులపై… ప్రముఖుల స్పీచ్‏లను సైతం ఫన్నీగా మార్చేస్తాడు. తన స్క్రీట్‏లో ఆది వేసే పంచులు మాములుగా ఉండవు.. ప్రతి చిన్న అంశంలోనూ తనదైన పంచులతో నవ్వులు పూయిస్తాడు ఆది.. అయితే ఎంతగా కామెడీ చేసినా.. ఆది చూట్టూ మాత్రం ఎప్పుడూ వివాదాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఆదికి ఎన్నోసార్లు వార్నింగ్స్, జనాల నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. అయితే తాను ఎవరి గురించి ఉద్దేశ్యపూర్వకంగా కామెంట్స్ చేయనని చాలా సార్లు బదులిచ్చాడు ఆది.

ఇదిలా ఉంటే.. ఆది చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈటీవీలో దీపావళీ స్పెషల్ ఈవెంట్‏లో భాగంగా విడుదలైన ప్రోమోలో ఆది చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆది వేసిన పంచులు ఇటీవల మంచు విష్ణు ఎన్నికల్లో మాట్లాడిన మాటలను గుర్తుచేస్తున్నాయి. విష్ణు చేసిన వ్యాఖ్యలను ఆది తన దైన మార్చుకుని డైలాగ్స్ వదిలాడు.. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు సైతం దిగారు.. అయితే ఎన్నికల సమయంలో మంచు విష్ణు చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. అందులో లెట్ దెమ్ నో అంకుల్.. ఏమైందో వాళ్లకు తెలియాలి .. శ్రీహరి అంకుల్ బతికుండుంటే మీ గురించి బయటపడేది అంటూ మంచు విష్ణు చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా హైపర్ ఆది… దీపావళీ స్పెషల్ ఈవెంట్ లో భాగంగా.. ఇంద్రజను ఉద్దేశిస్తూ.. మంచు డైలాగ్స్ వదిలాడు.. అయితే ఆది వేసిన పంచులను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు… మంచు విష్ణు వీడియాలతో ఆది డైలాగ్స్ కలుపుతూ తెగ ట్రోల్ చేస్తున్నారు.  ఇక హైపర్ ఆది వేసిన సెటైర్లకు అక్కడున్నవారంత పగలబడి నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు