Acharya Movie : అదరగొడుతున్న ఆచార్య.. విడుదలకు ముందే రికార్డులు.. ఓవర్సిస్ లోనూ భారీ బిజినెస్..
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కోసం అభిమానలంతా ఆసక్తి ఎదురు చూస్తుంన్నారు. కొరటాల శివ దర్శత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు...
Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా కోసం అభిమానలంతా ఆసక్తి ఎదురు చూస్తుంన్నారు. కొరటాల శివ దర్శత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మెగాస్టార్ ఈ మూవీలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. చిరు సరసన చందమామ కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా సమర్ కానుకగా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఆచార్య హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీగా బిజినెస్ జరుగుతుందని టాక్. కాగా ఓవర్సిస్ లోనూ ఆచార్య దుమ్ము రేపుతుందని తెలుస్తుంది. ఇప్పటికే నైజాం రైట్స్ ను వరంగల్ శ్రీను రూ.42 కోట్లకు దక్కించుకున్నాడు. ఆంధ్రా సీడెడ్ కలిపి రూ. 60 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఓవర్సిస్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది. రూ.20 కోట్లకు పైగా కోట్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.మెత్తంగా ఆచార్య విడుదలకు ముందే రూ. 120కోట్ల మేర బిజినెస్ చేస్తున్నట్టు ఫిలిమ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆచార్య విడుదలై ఇంకెన్ని రికార్టులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి..