Brahmamudi, October 5th Episode: శివాలెత్తిన రాజ్.. రుద్రాణిని ముసుగేసి కొట్టిన స్వప్న..

|

Oct 05, 2024 | 12:14 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య మోసం చేయలేదని, అలా ఎప్పటికీ చేయదని అపర్ణ, ఇందిరా దేవిలు అంటారు. ఇప్పటికీ నమ్మరా.. మీరు నమ్మకండి. ఇంకా నెత్తిన పెట్టుకోండి. అవార్డు అందుకున్న ఆ కళావతిని తీసుకొచ్చి సన్మానం చేయండి. కుటుంబ పరువు కోసం ప్రాణాలు అర్పించే త్యాగమూర్తిలా చూశారు కదా.. ఇప్పుడు కుటుంబ పరువును ఏం చేసింది? కంపెనీకి ఉన్న పేరును ఏం చేసింది? మన కంపెనీకే నష్టం జరిగేలా చేసింది. మళ్లీ కావ్య అలాంటి మనిషి కాదని..

Brahmamudi, October 5th Episode: శివాలెత్తిన రాజ్.. రుద్రాణిని ముసుగేసి కొట్టిన స్వప్న..
Brahmamudi
Image Credit source: Disney Hot Star
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య మోసం చేయలేదని, అలా ఎప్పటికీ చేయదని అపర్ణ, ఇందిరా దేవిలు అంటారు. ఇప్పటికీ నమ్మరా.. మీరు నమ్మకండి. ఇంకా నెత్తిన పెట్టుకోండి. అవార్డు అందుకున్న ఆ కళావతిని తీసుకొచ్చి సన్మానం చేయండి. కుటుంబ పరువు కోసం ప్రాణాలు అర్పించే త్యాగమూర్తిలా చూశారు కదా.. ఇప్పుడు కుటుంబ పరువును ఏం చేసింది? కంపెనీకి ఉన్న పేరును ఏం చేసింది? మన కంపెనీకే నష్టం జరిగేలా చేసింది. మళ్లీ కావ్య అలాంటి మనిషి కాదని దీర్ఘాలు తీస్తున్నారా? అని రుద్రాణి రెచ్చిపోతుంది. నువ్వెందుకు రుద్రాణి అంత ఆవేశ పడుతున్నావు. నీకు అవకాశం దొరికిందనా.. కళ్యాణ్ కాపురం ముక్కలు చేసేదాకా నిద్ర పోలేదు. ఇప్పుడు నా కొడుకు కాపురం మీద దృష్టి పెట్టావా.. కనీసం ఏం జరిగిందో తెలుసుకోకుండా.. మాట్లాడుకోకుండా.. అందరి మనసులు విరిచేయాలని ఇలా చేస్తున్నావా? అని అపర్ణ చివాట్లు పెడుతుంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు రుద్రాణి.. నా మనవరాలు ఏంటి? మనకు ద్రోహం చేయడం ఏంటి? అని ఇందిరా దేవి అంటుంది.

కావ్య వస్తువులపై పెట్రోల్ పోసిన రాజ్..

మీరే టీవీలో చూశారు కదా అత్తయ్యా.. ఇంకా ఆ కావ్యని వెనకేసుకొస్తారేంటి? అని ధాన్య లక్ష్మి అంటే.. నువ్వు రుద్రాణి కళ్లతో చూస్తున్నావు. కానీ నేను చూసే కోణం వేరని ఇందిరా దేవి అంటుంది. నాన్మమ్మా.. నేను నా కళ్లారా చూశాను. పూర్తిగా నా మీద ఉన్న కోపాన్ని వృత్తి, వ్యాపారాల మీద చూపించింది. నా మీద పగ సాధించాలని చేసింది. కావాలనే శత్రువులతో చేతులు కలిపింది. ఇక ఇప్పుడు నేను ఎవరి అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోను. కళావతి ఈ కుటుంబానికి తీవ్ర ద్రోహం చేసిందని ఆకోశ్రంతో పైకి గదిలోకి వెళ్తాడు రాజ్. అక్కడ కావ్య వస్తువులు, చీరలు, ఫొటోలను తీసి మొత్తం ఇంటి బయట పడేస్తాడు. పక్కనే ఉన్న పెట్రోల్‌ డబ్బా తీసుకొచ్చి వస్తువుల మీద పోసేస్తాడు. ఇంటి సభ్యులు ఎంత ఆపినా ఆగడు. వెంటనే నిప్పు పెట్టాలని అగ్గిపెట్టె తీసి వెలిగించి వేయగా.. అప్పుడే వర్షం వచ్చి ఆరిపోతుంది. దీంతో ఇంటి సభ్యులు సంతోషించి.. స్త్రీకి అవమానం జరిగితే ప్రకృతే కాదు పంచ భూతాలు కూడా సహించవు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కావ్య నిర్దోషి అని ప్రకృతే చెబుతుంది. రా లోపలికి అని తీసుకెళ్తుంది అపర్ణ.

నా తల ఎత్తుకోలేక పోతున్నా..

మరోవైపు కావ్య ఇంటి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కనకం వచ్చి ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావ్? అని అడుగుతుంది. అమ్మా ఎన్నో సార్లు నేను చేయలేనికి తప్పుకు నిందలు పడ్డా.. చేయలేదని ధైర్యంగా ఉన్నాను. తప్పు జరిగింది.. అది నేను చేయలేదు. కానీ నా మెడకు చుట్టుకుంది. ఎప్పుడూ ధైర్యంగా ఉండే నేను ఇవాళ మాత్రం తల ఎత్తుకోలేక పోతున్నానని కావ్య అంటే.. ఏమైందే అని కనకం అడుగుతుంది. నా వల్ల ఆయనకు అవమానం జరిగింది. నేను వేసిన డిజైన్స్ పెట్టి పోటీలో గెలిచేలా చేసింది ఆ అనామిక. పదేళ్లుగా మా కంపెనీకే వచ్చే అవార్డు అనామిక వాళ్లకు వచ్చిందని కావ్య అంటే.. అర్థమైంది.. నీకు తెలీకుండా నువ్వు వేసిన డిజైన్స్ పోటీలో పెట్టారా అని కనకం అడుగుతుంది.

ఇవి కూడా చదవండి

నిజాన్ని నమ్మే స్థితిలో ఎవరూ లేరు..

అవును అమ్మా.. నేను గెలవడానికి కావాలనే అనామికతో చేతులు కలిపానని ఆయన అనుకుంటున్నారు. ఆఖరికి మా మావయ్య గారు కూడా అనుకున్నారు. నేను ఎందుకు శత్రువులతో చేతులు కలుపుతానమ్మా అని కావ్య ఏడుస్తుంది. మీరిద్దరూ ఒక్కటై చూడాలని నేను కోరకుంటుంటే.. నీకు తెలీకుండానే నీ వల్ల తప్పు జరిగిపోయింది. అసలే అపార్థంతో ఉన్న అల్లుడు గారు ఇంకా అపార్థం చేసుకుని ఉంటారని కనకం అంటే… ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు అర్థం చేసుకుంటారో.. అపార్థం చేసుకుంటారో.. ఎవరు ఎంతగా రెచ్చకొడతారో తెలీడం లేదు. కానీ మా అత్తగారు మాత్రం నన్ను నమ్మితే చాలని కావ్య అంటుంది. పోనీ నేను వెళ్లి చెప్పనా అని కనకం అంటే.. ఎవరు చెప్పినా ఆయన నమ్మే స్థితిలో లేరని కావ్య అంటుంది.

ఫీల్ అయిన సామంత్..

ఈ డిజైన్స్ వెనుక కావ్య ఉందని ఎందుకు చెప్పావ్? అని సామంత్.. అనామికను అడుగుతాడు. ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏంటని అనామిక అంటే.. నష్టం వచ్చింది. ఆ కావ్య డిజైన్స్ వేయనని చెప్పింది కదా అని సామంత్ అంటే.. అబ్బా ఇప్పుడు ఏదో కొంపలు మునిగినట్టు ఎందుకు టెన్షన్ పడుతున్నావ్. ఇలా రా కూర్చో ఓ పెగ్ వేయమని అంటుంది అనామిక. నేను ఇంత సీరియస్‌గా డిస్కర్స్ చేస్తుంటే నువ్వేంటి? తాగమంటావ్? నేను ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నానో అర్థం అవుతుందా? కావ్య ఉండబట్టే గెలిచానని సామంత్ అంటాడు. ఇప్పుడు నీ గొడవ ఏంటి? ఆ కావ్య తిరిగి మన కంపెనీ కోసం పని చేయాలి కదా అదంతా నేను చూసుకుంటా.. అది మళ్లీ మన కంపెనీలో వర్క్ చేసేలా నేను చేస్తానని అనామిక అంటుంది. అది కాదని సామంత్ అంటే.. అనామిక కూల్ చేస్తుంది. ముందు నేను గెలిచిన ఆనందాన్ని ఎంజాయ్ చేయని అని అనామిక అంటుంది.

చేప పిల్లలా గిలగిలా కొట్టుకుంటున్నాడు..

మరోవైపు రుద్రాణి కూడా మందు వేస్తూ.. చిల్ అవుతుంది. అప్పుడే అనామిక ఫోన్ చేసి.. ఇన్ని రోజులుగా నేను చేయలేని పనిని నువ్వు చేశావ్. కావ్యపై రాజ్‌కు పూర్తిగా ద్వేషం కలిగేలా చేశావ్. వాళ్లు ఇప్పుడు బద్ధ శత్రువులు అయ్యిపోయారని అంటుంది. ఇప్పుడు రాజ్ పరిస్థితి ఎలా ఉందని అనామిక అడిగితే.. ఒడ్డును పడ్డ చేప పిల్లలా గిలగిలా కొట్టేసుకుంటున్నాడు. సొంత భార్య చేతిలోనే ఓడిపోవడం తట్టుకోలేక పోతున్నాడని రుద్రాణి అంటే.. నాకు చాలా బాధగా ఉంది. ఆ మధురమైన సన్నివేశాలు నేను చూడలేకపోతున్నా కదా అని అనామిక అంటే.. నేను చూశాను కదా.. ఇంట్లో వాళ్ల పరిస్థితి చూస్తుంటే నా కడుపు నిండిపోయింది.

రుద్రాణిని ముసుగు వేసి కొట్టిన స్వప్న..

అప్పుడే స్వప్న అటు నుంచి వస్తుంది. ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చేంత వరకు నిద్రపోనని అంటుంది అనామిక. రాజ్, కావ్యలు ఎప్పుడూ ఇలా దూరంగా ఉండాలని కోరుకుంటున్నా అని రుద్రాణి అంటుంది. నా చెల్లెలు, రాజ్ దూరంగా ఉంటే నీకు అంత సంతోషంగా ఉందా.. అని అక్కడే ఉన్న దుప్పటి రుద్రాణిపై వేసి బాగా కొట్టి వెళ్తుంది స్వప్న. ఎవరు కొట్టారా అని రుద్రాణి టెన్షన్ పడుతుంది. అప్పుడే రాహుల్ వచ్చి ఏమైంది మామ్ ఇలా ఉన్నావ్? అని అడిగితే.. నన్ను ఎవరో ముసుగు వేసి కొట్టారని చెబుతుంది. అప్పుడే స్పప్న ఏమీ తెలీనట్టు వచ్చి అడుగుతుంది. నువ్వే కదా నన్ను కొట్టావ్ అని రుద్రాణి అంటే.. నేను కాదని స్పప్న అంటుంది. ఈ సీన్ నిజంగానే ఎంతో నవ్వు తెప్పిస్తుంది. ఇక ఇక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.