Brahmamudi, October 4th Episode: రాజ్, కావ్యలు ఇక కలవనట్టే.. అనామిక చెంప పగలకొట్టిన కావ్య..

|

Oct 04, 2024 | 1:57 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. తమ ప్రత్యర్థి కంపెనీకి కావ్య డిజైన్స్ గీయడం వల్ల అవార్డ్ వచ్చిందని తెలుసుకున్న రాజ్ ఆవేశంతో ఊగిపోతాడు. కావ్య చెబుతున్నా వినిపించుకోడు. ఎవరో చెప్తే విన్నది కదు కదా.. కళ్లారా చూసిన నేనే సాక్ష్యమని రాజ్ అంటాడు. మీరు చూసేది ఏదీ నిజం కాదు. నేను మోసపోయాను ఒకసారి నేను చెప్పేది వినమని కావ్య చెబుతున్నా రాజ్ వినిపంచుకోడు. ఏది నిజం కాదు.. నువ్వు కావాలనే నా ప్రత్యర్థికి డిజైన్స్ ఇచ్చావ్..

Brahmamudi, October 4th Episode: రాజ్, కావ్యలు ఇక కలవనట్టే.. అనామిక చెంప పగలకొట్టిన కావ్య..
Brahmamudi
Image Credit source: Disney Hot Star
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. తమ ప్రత్యర్థి కంపెనీకి కావ్య డిజైన్స్ గీయడం వల్ల అవార్డ్ వచ్చిందని తెలుసుకున్న రాజ్ ఆవేశంతో ఊగిపోతాడు. కావ్య చెబుతున్నా వినిపించుకోడు. ఎవరో చెప్తే విన్నది కదు కదా.. కళ్లారా చూసిన నేనే సాక్ష్యమని రాజ్ అంటాడు. మీరు చూసేది ఏదీ నిజం కాదు. నేను మోసపోయాను ఒకసారి నేను చెప్పేది వినమని కావ్య చెబుతున్నా రాజ్ వినిపంచుకోడు. ఏది నిజం కాదు.. నువ్వు కావాలనే నా ప్రత్యర్థికి డిజైన్స్ ఇచ్చావ్.. నీ గెలుపును నాకు చూపించడానికి నా ఓటమిని చూడటానికి నువ్వు ఫంక్షన్ కి రావడం నిజం కాదా.. ఇక్కడ ఉన్న వాళ్లకు కాదు.. లేని వాళ్లకు చెప్పు. చాలా గొప్పగా బుద్ధి చెప్పావ్. నువ్వు నాకు ద్రోహం చేయాలి అనుకున్నావంటే.. నువ్వు మా ఇంటి మహా లక్ష్మివి అని ఇంత నమ్మే నా కుటుంబ సభ్యులను మర్చిపోయావంటే.. నీలో నేను చూడని కొత్త కోణం ఉంది. నీకు నా మీద నా కుటుంబం మీద ఇంత పగ ఉందని.. ఇలా ప్రతీకారం తీర్చుకుంటావని ఊహించలేదని రాజ్ అంటాడు.

ఇంతలా దిగజారిపోతావనుకోలేదు..

కాదు.. అది నా వ్యక్తిత్వమే కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఎవరికీ ద్రోహం చేయాలని అనుకోను. ఇలాంటి నీచానికి నేను దిగజారుతానని మీరు అనుకుంటే నాకు ఏం చెప్పాలో కూడా తెలీడం లేదు. ఎందుకండీ ఎప్పుడూ ప్రతీ విషయంలో నన్ను అపార్థం చేసుకుంటున్నారు. దీని వెనుక ఎలాంటి కుట్రలు జరిగాయో నిజంగానే నాకు తెలీదని కావ్య అంటుంది. చాలు ఆపు.. కుట్ర చేసింది నువ్వు. శత్రువులతో చేతులు కలిపి.. ఇలా చేశావు. డబ్బు కోసం ఇంతలా దిగజారుతావా.. నీ భర్తకే వెన్నుపోటు పొడుస్తావా అని రుద్రాణి రెచ్చిపోతుంది. నిజాలు తెలుసుకోకుండా.. ఇష్టమొచ్చిన్టటు మాట్లాడొద్దని కావ్య అంటుంది. ఇంకా ఏం తెలుసుకోవాలి.. నువ్వు ఇంటి నుంచి వెళ్లిపోయినా.. నీ కోసం రాజ్ దిగి వచ్చి.. మళ్లీ నిన్ను కాపురానికి తెచ్చుకోవాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు నువ్వు ఏం చేశావ్? మీడియా ముందు మా పరువు తీసేశావని రుద్రాణి అంటుంది.

ఇంకెప్పుడూ ఎదురు పడొద్దు..

ఆపండి.. రుద్రాణి గారు. ఇక చాలు.. ఇన్ని ఆరోపణల్లో ఏ ఒక్కటి కూడా నిజం కాదు. అసలు ఆ అనామిక ఏం చేసిందో తెలుసా? అని కావ్య అంటుంది. ఏం చేసింది.. నిన్ను చేరదీసి.. కావాలనే నా మీదకు ఉసిగొల్పింది. నీకు తెలీక డిజైన్స్ గీసి ఇచ్చావ్. నువ్వు పోసపోయావని అం టాడు. అవును నేను మోసపోయింది నిజమే అని కావ్య చెబుతున్నా.. రాజ్ వినిపించుకోడు. అవార్డు పోయిందనో.. నష్టం జరిగిందనో నేను బాధ పడటం లేదు. కానీ నువ్వు నాకు ఒక పెద్ద దెబ్బ కొట్టావ్. జీవితంలో ఓ గుణపాఠం నేర్పావు. నీ మీద ఏ మూలనో ఉన్న ప్రేమ ఈ దెబ్బతో చచ్చిపోయింది. ఇంకెప్పుడూ ఎదురు పడొద్దని రాజ్ చెప్పి వెళ్తాడు. విన్నావుగా.. ఇక వాడు కానీ మా కుటుంబం కానీ జీవితంలో నిన్ను దగ్గరకు రానిచ్చేదే లేదని రుద్రాణి అంటుంది. సుభాష్ కూడా ఏమీ మాట్లాడుకుండా వెళ్తాడు. మావయ్య గారూ మీరు నమ్ముతున్నారా అని కావ్య అడిగితే.. వద్దమ్మా ఏమీ చెప్పొద్దు. నాకూ నమ్మాలనే ఉంది. కానీ దేనిని నమ్మాలి. అంతా నా కళ్ల ముందే జరిగింది కదా అని సుభాష్ అంటాడు. నేను ఇలా కావాలని చేశానని మీరు కూడా నమ్ముతున్నారా? వాడు కరిగి నిన్ను కాపురానికి తీసుకొస్తాడని అనుకున్నా.. కానీ ఇప్పుడు ఆ ఆశలు కూడా లేకుండా చేశావని అంటాడు సుబాష్. దీంతో ఏడుస్తూ ఉంటుంది కావ్య.

ఇవి కూడా చదవండి

నీకు అవమానాలు తప్ప ఏమీ మిగలలేదు..

బయటకు వెళ్తుండగా.. అనామిక, సామంత్‌లు ఎదురు పడతారు. కంగ్రాట్యులేషన్స్ కావ్యా.. అని అనామిక అంటే.. ఎందుకు మీ ఉచ్చులో పడినందుకా అని కావ్య అంటే.. ఇది ఉచ్చు కదా.. నీ టాలెంట్‌ని అందరికీ పరిచయం చేశామని, ఇప్పుడు నువ్వు నీ భర్త ముందు అంత ఎంత్తులో నిలబడ్డావని అనామిక అంటుంది. లేదు పాతాళంలోకి పడిపోయాను. నాకు వ్యక్తిత్వం లేని మనిషిగా నిలబెట్టావ్. నీ క్యారెక్టర్ నీకు ఏం ఇచ్చింది? ఇంట్లో, కంపెనీలో గుర్తింపుని ఇచ్చిందా? అని సామంత్ అడుగుతాడు. అందరూ అనామికలా ఉండరు మిస్టర్ సామంత్. నేను ఆ ఇంట్లో బంధాలకు విలువ ఇచ్చాను. నా భర్త పక్కనే ఉండాలి అనుకున్నా. అది కుదరలేదని పగ, ప్రతీకారాలు అంటూ ఇలా దిగజార్చుకుని.. అనామికలా పతనం అయిపోవాలని ప్రాణం పోయినా అనుకోనని కావ్య అంటుంది. ఆ ఇంట్లో ఉన్నంత వరకూ నాకు అవమానాలు తప్ప ఏమీ అవలేదు. ఇంకా నువ్వు నీతులు చెప్పడం మానలేదా? నీకు తెలీకుండా మాతో కలిశావ్.. నీ ప్రతిభకు దగ్గ గుర్తింపు పొందావని అనామిక అంటుంది. చాలు ఆపు.. నా పర్మిషన్ లేకుండా నా డిజైన్స్ వాడుకునే హక్కు ఎవరు ఇచ్చారు? మోసం చేసి గెలిచారు. నా వల్ల అనవసరంగా దుగ్గిరాల ఫ్యామిలీ పరువు పోయిందని కావ్య అంటుంది.

నేను ఉండగా ఏమీ చేయలేరు..

నాకు నిన్ను చూస్తుంటే చాలా జాలి వేస్తుంది. నీకు కనీసం పని మనిషికి ఇచ్చే విలువ కూడా ఇవ్వలేదు. అలాంటి సంస్థను నేల మట్టం చేసి నువ్వేంటో నిరూపించుకో. అందుకు సరైన దారి నేను చూపిస్తానని అనామిక అంటే.. కావ్య కోపంతో చెంప మీద ఒక్కటి ఇస్తుంది. సామంత్‌కి కూడా వార్నింగ్ ఇస్తుంది. మహా సామ్రాజ్యాన్ని కూల్చేయాలని చూస్తున్నారా.. ఆ చెట్టు వేరు కూడా వేరు చేయలేరని త్వరలోనే తెలుస్తుంది. నేను ఉండగా ఆ ఇంటి ముందు మొలిచిన గడ్డి పరక కూడా పీకలేవని కావ్య సీరియస్‌గా వార్నింగ్ ఇస్తుంది.

కావ్య వల్లనే ఈ ఇంటి పరువు పోయింది..

కట్ చేస్తే.. రాజ్ ఆవేశంగా ఇంటికి వస్తాడు. ఏంటి రాజ్ వచ్చారా.. నాకు చాలా ఆశ్యర్యంగా ఉంది. కావ్య నీకు పోటీగా చేయడం ఏంటి? కోడలు అలాంటి పని చేయదురా అని అపర్ణ అంటే.. ఇంకా కోడలు అని ఎలా అనుకుంటున్నావ్? ఆ పేరు ఎత్తడానికి కూడా వీల్లేదని రాజ్ అంటాడు. ఆవేశ పడకు రాజ్.. ఇందులో ఏదో కుట్ర కనిపిస్తుంది. కావ్య అలాంటి పనులు చేయదని పెద్దావిడ అంటుంది. నాన్మమ్మా ఇంకా నన్ను మాయలోకి తీసేయవద్దు. కావ్య గీసిన అవార్డ్స్ వల్ల ఆ కంపెనీకి అవార్డ్ రావడం నిజం. ఇందులో నేను కల్పించిన కట్టు కథ ఏమీ లేదని రాజ్ అంటాడు. ఇక అప్పుడే కావాలనే చిచ్చు రాజేస్తుంది రుద్రాణి. కావ్య మీద లేనిపోనివి చెబుతుంది. ఇక ఇక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..