ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ కలిసి కృష్ణమూర్తి, కనకంల పెళ్లి రోజును ఎంతో సంతోషంగా చేస్తారు. కేక్ కట్ చేసిన తర్వాత.. నువ్వు పెట్టు అంటే.. నువ్వు పెట్టమని దెబ్బలాడుకుంటారు. దీంతో రాజ్‌ని కేక్ పెట్టమని కృష్ణమూర్తి అంటారు. ఆ తర్వాత అందరూ కేక్ తినిపించుకుంటారు. ఇక అందరూ ఒకే చోట కూర్చొంటారు. భార్యభర్తల బంధం గురించి ఇందిరా దేవి వివరిస్తుంది. మా పెళ్లి అయి 50 ఏళ్లు అవుతుంది. అపర్ణ వాళ్ల పెళ్లి అయి 30 ఏళ్లు అయింది.. కనకం, కృష్ణమూర్తిల పెళ్లి అయి 25 సంవత్సరాలు అవుతుంది. చెట్టు నుంచి వచ్చిన మామిడి కాయ.. సముద్రం నుంచి వచ్చిన ఉప్పు.. ఈ డూ కలుస్తేనే.. అబ్బాయి ఒక ఇంట్లో పుడతాడు.. అమ్మాయి మరో ఇంట్లో పుట్టి.. కలిసి బ్రతకడం కోసం ఒక ఇంట్లో ఉంటారు. సముద్రంలో పుట్టిన మహాలక్ష్మి.. వైకుంఠాన్ని వీడితే.. విష్ణుమూర్తి ఒంటరి వాడు అయిపోతాడు. వైకుంఠం కూడా చీకటి అయిపోతుంది. ఒక మూడో వ్యక్తి మూలంగా మహాలక్ష్మి అలిగి వైకుంఠం వదిలి అలిగి వెళ్లిపోయింది.
మూడో వ్యక్తి వలన భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఎవరో చెబితేనే.. చెప్పుడు మాటలకు లొంగకూడదు. నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. భార్య అలిగి వదిలి వెళ్లిపోతే.. భర్త మెట్టు దిగి వెళ్లడంలో తప్పు లేదు. మా ఇన్నాళ్ల కాపురం గురించి మా అనుభవ సారం తెలిస్తే.. ఈ తరం భార్యాభర్తలకు కాస్తన్నా ఉపయోగ పడుతుందని ఆశతో చెప్పాను. అపర్ణ నువ్వు చెప్పమని ఇందిరా దేవి అంటుంది. క్షమించరాని తప్పులు జరిగినా నేను అత్తింటి గడప దాటలేదు. మచ్చ తెచ్చే పనులు నేను చేయలేదని అపర్ణ అంటుంది. ఆ తర్వాత కనకం చెబుతుంది. కనకం లేవబోతుండగా.. మీరు కూర్చొని మాట్లాడమని రాజ్ అంటాడు.
మాకు ముగ్గురు కూతుళ్లు.. పెళ్లి అయి వెళ్లిపోయారు. ఇప్పుడు ఇద్దరమే మిగిలాం. అంటే పిల్లలు కూడా కడదాకా తోడు ఉండరు. నాకు నేను.. ఆయనకు నేనే తోడు.. కాబట్టి భార్యాభర్తల బంధమే శాశ్వతం కదా.. మాకు ఒక బాబు ఉండేవాడు. వాడికి జబ్బు చేసింది. చికిత్స చేసేందుకు కూడా డబ్బులు లేవు. దాంతో నా బిడ్డ ప్రాణాలు వదిలాడు. అందుకు కారణం మా పేదరికం. అలాంటి పేదరికం నా కూతుళ్లకు రాకూడదని.. అందుకే ఆస్తి పరుల ఇళ్లకు కోడల్లుగా పంపించాలని ఆశ పడ్డాను. మోసం చేశాను.. అబద్దాలు చెప్పాను.. దొరికపోయాను.. అప్పుడు నా మీద మచ్చ పడింది. ఆ మచ్చ ఇప్పటికీ చెరిగిపోలేదు. ఇంత జరిగినా.. నా భర్త నన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టలేదు. ఘనంగా పెళ్లి చేయాలని.. ఇంటిని తాకట్టు పెట్టాను.. దీంతో రోడ్డు మీద పడ్డాను. అలాంటి పరిస్థితిలో కూడా నన్ను ఇంట్లోంచి వెళ్ల గొట్టాలని అనుకోలేదు. అది ఆయన గొప్పతనమా లేక నా అదృష్టమో తెలీదు. భార్యాభర్తలు చివరిదాకా కలిసి ఉండాలంటే.. ప్రేమ, నమ్మకం ఉండాలని కనకం ఎంతో బాధపడుతూ చెబుతుంది.
ఆ తర్వాత ప్రకాశం చెబుతూ.. నాకు ఎంత మతి మరుపు ఉన్నా నా భర్య నన్ను అర్థం చేసుకుంది. ఇప్పటికి 24 ఏళ్లు అయ్యింది. ఇప్పటికీ నాతోనే ఉందని అంటాడు. ఆ తర్వాత స్పప్న మాట్లాడుతూ.. మా పెళ్లి ఎలా జరిగిందో అందరికీ తెలుసు. నన్ను వదిలేయాలి అనుకున్నాడు. కానీ పెళ్లి జరిగితో అతనితోనే జరగాలి అనుకున్నా.. ఇప్పటికీ మేము ఇద్దరం గొడవ పడుతూనే ఉన్నాం. రాహుల్ నన్ను పొమ్మనలేదు.. నేను వెళ్లాలి అనుకోలేదు. చచ్చేదాకా నన్ను భరించాల్సిందేనని స్వప్న అంటుంది. ఆ తర్వాత రాహుల్ మాట్లాడుతూ.. నాకు భార్యభర్తల బంధం ఏంటో తెలీదు. ఇప్పుడు ఇందరు మాట్లాడాక ఏదో మ్యాజిక్ ఉందని తెలుస్తుంది. ఏం చేస్తాం.. చచ్చేదాకా ఈ స్వప్నను భరించాల్సిందేనని రాహుల్ అంటాడు.
ఆ తర్వాత అప్పూ మాట్లాడుతూ.. నాకేం తెలీదు.. ఎవరు ఏం అనుకుంటే నాకేంటి? అనుకున్నా. కానీ కళ్యాణ్‌తో పెళ్లి అయ్యిందో.. అప్పటి నుంచి నా పద్దతే మారిపోయింది. కళ్యాణ్ కోసం వంట నేర్చున్నా.. బయటకు వెళ్తే వచ్చేదాకా ఎదురు చూడటం నేర్చుకున్నా.. వాడి కోసం నన్ను నేను మార్చుకుంటున్నానని అప్పూ అంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ మాట్లాడుతూ.. అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేదని అనామిక నా జీవితం నుంచి వెళ్లిపోయింది. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నాయని అప్పూ నా జీవితంలోకి వచ్చింది. ఇప్పుడు మా దగ్గర డబ్బు లేదు.. అలాగే పేదరికం కూడా లేదు. మా మధ్య చాలా ప్రేమ ఉందని కళ్యాన్ అంటాడు.
ఆ తర్వాత రాజ్ మాట్లాడుతూ.. భార్యాభర్తల బంధం అంటే ఇలా ఉండాలా.. సర్దుకు పోవాలా అని తెలుసుకున్నాం. కోపం, ఆవేశం మనుషుల్ని దూరం చేస్తాయే తప్ప.. మనసుల్ని దూరం చేయలేవని రాజ్ అంటాడు. ఆ తర్వాత కావ్య మాట్లాడుతూ.. నాకు అనుభవం నేర్పిన పాఠం ఏంటంటే.. నా భర్త.. నా ఇల్లు.. నా కాపురం అనేవి ఒక భ్రమ.. ఒక మాయ.. భార్యాభర్తల మధ్య సంబంధం చివరి దాకా ఉండాలంటే ప్రేమ, నమ్మకం ఉండాలి. అది నా భర్తకు నా మీద లేదు. బలవంతంగా పెళ్లి చేసుకున్నారు.. బలవంతంగా కాపురం చేశారు.. అందుకే ఆయన జీవితంలో నేను లేను. నేనే లేనప్పుడు సంసారం.. కాపురం గురించి నేనేం చెప్పగలను? అని అంటుంది. కళావతి నీ వల్ల ఎన్ని తప్పులు జరిగినా నేను నీతోనే ఉన్నానని రాజ్ అంటే.. చూశారా.. నా మాట మీద మీకు నమ్మకమే లేదు. ఆ నమ్మకం లేని మనిషితో నేను ఎలా కాపురం చేస్తారు? అని కావ్య అంటుంది.
అప్పుడే పంతులు గారు వస్తారు. అమ్మా దాంపత్య వ్రతానికి ఏర్పాట్లు చేయలేదా.. సమయం లేదు.. వ్రతంలో ఎవరు కూర్చొంటారో రమ్మని పంతులు అడుగుతాడు. స్పప్న, కావ్య, అప్పూ మీ ముగ్గురు కూర్చొమని కనకం అంటే.. దాంపత్య వ్రతమా.. ఇక్కడ సంసారమే సరిగ్గా లేదు.. నాకు సంబంధం లేదని కావ్య వెళ్లిపోతుంది. ఆ తర్వాత కనకం దగ్గుతూ నాటకం ఆడుతుంది. రండి ఆస్పత్రికి వెళ్దామని రాజ్ అంటే.. వద్దు బాబూ.. మీరు మీ కాపురం గురించి ఆలోచించమని కనకం అంటే.. చూడండి నా మీద నాకు గౌరవం ఉంది. ఇప్పుడు ఈ వ్రతం అంటే మీ అమ్మాయి కొండ ఎక్కి కూర్చొంది. ఆ కోతిని దింపడం నా వల్ల కాదని రాజ్ అంటాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..