ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య ఎప్పటికీ ఈ ఇంటి కోడలే.. మా మనవరాలే అని సీతారామయ్య, ఇందిరా దేవిలు అంటారు. భోజనం తీసుకొచ్చి మంచి పని చేశావని పెద్దావిడ అంటుంది. సొంత వాళ్లు అయి ఉండి కూడా ఎవరి బుద్ధి వాళ్లు చూపిస్తున్నారని పెద్దాయన అంటారు. ఆ తర్వాత వాళ్లను కూర్చోమని భోజనం వడ్డిస్తుంది కావ్య. రండి.. రండి స్వప్నా రండి మీరు కూడా తిందురు అని రాజ్ పిలుస్తారు. ఇక్కడ ఏముందని పేరంటానికి వచ్చినట్టు కూర్చున్నారు. పైగా వాళ్లను ఎందుకు పిలుస్తున్నావ్ అని ఇందిరా దేవి అడుగుతుంది. ఈలోపు ధాన్యలక్ష్మి నా వంట నేను తెచ్చుకున్నానని ధాన్యలక్ష్మి తింటుంది. డోంట్ వర్రీ.. అందరూ కుళ్లుకునేలా స్పెషల్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను.. స్పైసీ బిర్యానీ అని చెప్తాడు రాజ్. దీంతో అందరూ ఆనందంగా సంతోష పడతారు. ఇక అందరూ బిర్యానీ వడ్డించుకుంటారు. ఒక త్వరగా ఒకరి తర్వాత మరొకరు నోట్లో పెట్టుకోగానే.. మంట మంట అంటారు.
అప్పుడే కావ్య భోజనం వడ్డిస్తుండగా మంచి సువాసన వస్తుంది. కావ్య వాసనకు ప్రకాశం, స్వప్న టెప్ట్ అవుతారు. కావ్య మాకు కూడా పెట్టమని అంటే.. ప్రకాశం, సుభాష్, రాహుల్, స్పప్నకు వడ్డిస్తుంది కావ్య. మరోవైపు రుద్రాణి, రాజ్ మాత్రం కారంగా ఉండే బిర్యానీ తిని.. నోటి మంటతో పరిగెడతారు. అది చూసి కావ్య, సీతారామయ్య, ఇందిరా దేవి, స్పప్నలు నవ్వుతారు. ఆ తర్వాత కిచెన్ అంతా శుభ్రం చేస్తుంది కావ్య. అక్కడకు వచ్చిన రాజ్.. ఏయ్ ఏం చేస్తున్నావ్? అని అడిగితే.. కానీ ఇంటి మనుషులు ఎవరూ లేరు. అందరూ బయటకు వెళ్లిపోతున్నారని కావ్య అంటుంది. వంట మనిషిగా ఎత్తిన అవతారం చాలని రాజ్ అంటాడు. డిజైన్స్ వేయకుండానే వేసినట్టు నాటకం ఆడి సిఈవో సీట్ కొట్టేసినట్టు అందరూ మీలాగ నాటకాలు ఆడరు. వాళ్లకు భోజనం తెచ్చే వంకతో ఇక్కడే తిష్ట వేయాలని చూస్తున్నావా.. అది కుదరదని రాజ్ అంటాడు.
మీరు ఉండగానే నా ఆటలు నేను ఆడుతున్నాను కదా ఏం చేస్తున్నావని కావ్య అంటే.. మర్యాదగా నీ ఆటలు ఆపి ఇక్కడి నుంచి వెళ్లిపోమని రాజ్ అంటాడు. వెళ్లిపోవాలి అనుకున్నాను.. కానీ ఇప్పుడు వెళ్లను. సిఈవో సీటు కోసం భార్య కష్టాన్ని దోచుకున్న మీరు.. ఏదో సాధించినట్టు మాట్లాడుతున్నారు. అలాంటి మీ కోసం ఉండటం లేదు. మీ మూర్ఖత్వం వల్ల అమ్మమ్మ, తాతయ్యలు పస్తు ఉండటం ఇష్టం లేదు కాబట్టి.. రాత్రికి భోజనం కూడా వండి వెళ్తానని కావ్య అంటుంది. నేను ఒప్పుకోనని రాజ్ అంటే.. నేను వెళ్లను.. నాకు సిగ్గు లేదు.. ఇప్పుడే కాదు.. ప్రతీ రోజు వస్తానని కావ్య అంటుంది. మా అమ్మని, తాతయ్య, నాన్నమ్మలను గ్రిప్‌లో పెట్టుకుంది. ఇది ఇలాగే వస్తూ పోతూ ఉంటే.. మా అమ్మ అక్కడే ఉండిపోతుంది. కాబట్టి దీనికి తిరుగు లేని అస్త్రం వాడాలని రాజ్ అంటాడు.
ఆ తర్వాత ఇందిరా దేవికి ఫోన్ చేస్తుంది అపర్ణ. అత్తయ్యా అందరూ తిన్నారా.. కూరలు బాగున్నాయా అని అపర్ణ అడిగితే.. తన వంట గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. చాలా రోజుల తర్వాత తృప్తిగా భోజనం చేశామని ఇందిరా దేవి అంటే.. తినండి మీరు తృప్తిగా తినండి.. హాయిగా ఉండండి.. ఏమైనాపోయినా పర్వాలేదు. ఇవతల ఏమైపోయినా పర్వాలేదని అపర్ణ అంటుంది. ఏం మాట్లాడుతున్నావని ఇందిరా దేవి అంటే.. మరి ఏం చేయను అత్తయ్యా.. మిమ్మల్ని ఏమన్నా అందాము అంటే నా వయసు సరిపోదు.. అనకపోతే నా మనసు ఊరుకోవడం లేదు. నా కొడుకుని కర్మ కాలి పెళ్లి చేసుకున్న నా కోడలి గురించి అని అపర్ణ అంటుంది. మీరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు.. కావ్య తెచ్చిన వంటలు తిన్నామని నాకే చెబుతున్నారా.. అసలు కావ్య మీద ఇసుమంత కూడా జాలి, కరుణ లేవా మీకు? ఇంట్లో ఇలాంటి పరిస్థితులు పెట్టుకుని మీకు ఎలా ఆకలి వేస్తుందని అపర్ణ అడుగుతుంది.
మరి ఏం చేయమంటావు.. ఈ రుద్రాణి చేసిన పనులకు ఆ పనిమనిషి వెళ్లిపోయింది. బయట వంటలు తినలేక పస్తులు ఉంటున్నాం. అప్పుడే కావ్య వంట చేసి తీసుకొస్తే తినకుండా ఉంటామా అని ఇందిరా దేవి చెబుతుంది. అర్థమవుతుంది.. కావ్యని మర్చిపోకండి. మీ కొడుకు అంత పెద్ద తప్పు చేసినా ఎప్పుడూ అలిగి పుట్టింటికి వెళ్లలేదు.. కానీ కోడుకు మీద అలిగి కోడలి ఇంటికి వచ్చానని అపర్ణ అంటుంది. అవునులే.. మా ప్రయత్నం మేము చేస్తున్నాం కదా అని ఇందరి దేవి అంటే.. ఏం చేస్తున్నారు.. కావ్య కాబట్టి మొగుడు పట్టించుకోకపోయినా.. మీ కోసం ఆలోచించి.. పస్తులు ఉండకూడదని వంట చేసి తీసుకొచ్చిందని అపర్ణ అంటుంది. తెచ్చింది.. మరి కానీ ఆ మూర్ఖ మహారాజు మారడం లేదు. వీడి గుండె కరగడం లేదు.. మనసు మారడం లేదని ఇందిరా దేవి అంటే.. అపర్ణ సీరియస్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఫోన్ పెట్టేస్తుంది ఇందిరా దేవి. ఆ తర్వాత అందరికీ కాఫీ తీసుకొస్తుంది కావ్య. అమ్మమ్మ గారు మీ కోసం డిన్నర్ రెడీ చేసి పెట్టాను.. ఇక నేను వెళ్తానని కావ్య అంటే.. అప్పుడే రాజ్ వచ్చి.. మాకు వండి పెట్టినందుకు టిప్‌తో పాటు కలిపి డబ్బులు ఇస్తాడు. అమ్మా కావ్యా పట్టించుకోకు.. నువ్వు వెళ్లు అని సుభాష్ అంటే.. మీరు ఆగండి మావయ్యా.. ఈయనకు సరైన సమాధానం చెప్పకపోతే తెలిసి రాదు.. డబ్బు ఉందని బాగా అహంకారం పెరిగిపోయిందని కావ్య అంటుంది. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..