Brahmamudi, December 19th Episode: కుప్పకూలిపోయిన ఇందిరా దేవి.. కళావతే దిక్కు అనుకున్న రాజ్..
బ్యాంక్ వాళ్లు ఇంటికి వచ్చి ఇల్లు సీజ్ చేస్తామనడంతో కోర్టుకు వెళ్తామని ధాన్యలక్ష్మి, రుద్రాణిలు అంటారు. వాళ్ల మాటలకు ఇందిరా దేవికి గుండె పోటు వస్తుంది. మరోవైపు ఇంటిని కాపాడుకోవాలంటే కళావతే దిక్కు అనుకుంటాడు రాజ్. ఈ మేరకు కావ్యని మెప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. బ్యాంక్ వాళ్లు ఇంటికి రావడంతో ధాన్యలక్ష్మి, రుద్రాణిలు కలిసి రాద్దాంతం చేస్తారు. ఆస్తి కోసం కోర్టుకు వెళ్తామని అనడంతో ఇందిరా దేవికి ఒక్కసారిగా గుండె పోటు వస్తుంది. దీంతో అందరూ కంగారు పడతారు. అయితే ఇదంతా రాజ్ కల కంటాడు. వెంటనే వేరే బ్యాంక్ వాళ్లకు ఫోన్ చేసి.. లోన్ కావాలని అడుగుతాడు. ఆస్తి పేపర్స్ మీ పేరు మీదనే ఉన్నాయా సర్ అని అడిగితే.. నా వైఫ్ పేరు మీద ఉన్నాయని రాజ్ చెప్తాడు. అయితే ఆవిడను ఖచ్చితంగా తీసుకు రావాలని బ్యాంక్ అతను చెప్తాడు. సరే ఎలాగైనా కావ్యని ఒప్పించాలని రాజ్ అనుకుంటాడు. అప్పుడే రాజ్ అంతరాత్మ బయటకు వస్తుంది. నువ్వేంట్రా బాబు సడెన్‌గా వచ్చి ఎంట్రీ ఇస్తున్నావ్ అని రాజ్ అంటాడు. మరి నీ అంతరాత్మగా సహాయం చేయాలి కదా అని అంతరాత్మ అంటే.. నువ్వు సహాయం చేయడానికి రావు.. నన్ను పీక్కు తినడానికి వస్తావని రాజ్ అంటాడు. రేయ్ నిజాలు మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నీకు కష్టం వచ్చిందని ఆ కళావతి కాళ్లు పట్టుకుంటే ఇప్పుడు ఒప్పుకుంటుందా.. ఒక వేళ తను ఒప్పుకున్నా నేను ఒప్పుకోనని అంతరాత్మ అంటుంది.
పట్టుబట్టిన అంతరాత్మ..
ఏ నీకేం పోయాకాలం అని రాజ్ అంటే.. నా ఇగో హర్ట్ అవుతుంది. పెళ్లాం దగ్గర తల వంచే ప్రసక్తే లేదని అంతరాత్మ అంటుంది. రేయ్ అది నేను వాడే వాడిని.. ఒరేయ్ బాబూ నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇప్పుడు తాతయ్య మాట నిలబెట్టడం ముఖ్యం. ఇప్పుడు ఈగోకి వెళ్లే సమయం కాదని రాజ్ అంటే.. నేను చూస్తున్నది నిన్నేనా.. నేను మాట్లాడుతున్నది నీతోనేనా అని అంతరాత్మ అంటుంది. అవును నేనే.. అయినా అది మా తాతయ్య ఆస్తిని నా పెళ్లాన్నే కదా అడిగేది. ఇందులో నాకేమీ తక్కువ అయినట్లు అనిపించడం లేదు. నేను వెళ్తున్నా.. నన్ను డిస్టర్బ్ చేయవద్దని రాజ్ వెళ్తాడు. రాజ్ వెళ్లాక అంతరాత్మ నవ్వుతూ.. ఎంత పెద్ద మగాడైనా పెళ్లాం సపోర్ట్ లేకపోతే ఏమీ చేయలేమని అంటుంది.
నడమంత్రపు సిరి తలకు ఎక్కినట్టు ఉంది..
ఆ తర్వాత ఆస్పత్రిలో డాక్టర్లు సీతారామయ్యను చెక్ చేస్తూ ఉంటారు. అక్కడే ఉన్న కళ్యాణ్.. డాక్టర్స్ మీరు ఇలా ట్రీట్మెంట్ చేస్తున్నారని కానీ తాతయ్యలో ఎలాంటి మార్పు లేదు. ఇలా ఎంత కాలమని కళ్యాణ్ అడుగుతాడు. ముందే చెప్పాం కదండీ కోమాలో ఉన్న పేషెంట్స్ తిరిగి ఎప్పుడు స్పృహలోకి వస్తారో అస్సలు చెప్పలేం. వారికి ట్రీట్మెంట్ అలా చేసుకుంటూ వెళ్తే.. ఎప్పుడో చలనం వస్తుంది. మీలాగే మేము కూడా ఎదురు చూస్తూ ఉండాల్సిందేని డాక్టర్ అంటారు. మరోవైపు ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ముందు రుచి చూసిన ధాన్యలక్ష్మి.. ఏంటి కూరలన్నీ ఇంత చప్పగా ఉన్నాయి? ఉప్పు లేని చప్పిడి కూడు పెడుతున్నావ్ ఏంటి? అని అడుగుతుంది. ఉప్పు వేసి ఏం లాభంలే అనుకున్నావా కావ్యా.. ఉప్పు తిన్న విశ్వాసం వీళ్లకు లేదని ఉప్పు వేయడం మానేశావా అని అపర్ణ అంటుంది. నేను సరిగ్గానే వేశానని కావ్య అంటుంది. సరిగ్గానే వేసిందంట ధాన్యలక్ష్మి.. అత్తగారు వెనకేసుకొస్తున్నారు కదా.. ఇక్కడ రుచి చూసిన వాళ్లందరూ పిచ్చోళ్లు అని రుద్రాణి అంటే.. నడమంత్రపు సిరి బాగా తలకు ఎక్కినట్టు ఉందని ధాన్యలక్ష్మి అంటే.. స్వప్న తన స్టైల్‌లో ఇచ్చి పడేస్తుంది.
చప్పిడి కూడు పెట్టి మమ్మల్ని చంపుతావా..
అంతా ఈ కావ్య మూలంగానే.. ఇప్పుడు ఏంటి? ఆస్తి చేతికి వచ్చే సరికి కళ్లు తలకు ఎక్కి ఉప్పు డబ్బా కనిపించ లేదా.. చప్పిడి కూడు పెట్టి మమ్మల్ని చంపుతావా అని రుద్రాణి అంటే.. ఒక పూట కాస్త ఉప్పు తక్కువ అయితే ఆ మాత్రం సర్దుకోలేవా అని అపర్ణ అంటే.. అయినా ఉప్పు ఎక్కువ అయితే తినలేం కానీ.. ఉప్పు తక్కువు అయితే సర్దుకోవచ్చు కదా.. అయినా నా కోడల్ని అనడానికి మీకు వంక కావాలి కదా అని సుభాష్ అంటాడు. అయ్యయ్యో ధాన్యలక్ష్మి.. ఇప్పుడు ఆవిడను ఏమీ అనకూడదు.. ఈ ఇంటి మహా రాణి కదా అని రుద్రాణి అంటుంది. ఇక అప్పుడే రాజ్ కిందకు దిగుతాడు. కళావతిని నేరుగా సహాయం చేయమని అడిగతే.. ఓవరాక్షన్ చేస్తుంది. అందుకే ముందు పొగిడి ఆ తర్వాత హెల్ప్ అడగాలని రాజ్ అనుకుంటాడు. ఏంటి కళావతి వంటలు అన్నీ గుమగుమలాడిపోతున్నాయి.. కమ్మటి వాసన వస్తున్నాయి. కళావతి వంటకు వంక పెట్టేవాళ్లు.. ముష్టి ఎత్తుకుని బతకాలని అంటాడు రాజ్. దీంతో కావ్య తెల్లబోయి చూస్తుంది.
ఆస్తి కోసం నటిస్తున్నావని రాజ్‌ని అన్న రుద్రాణి..
పొగడ్తలు ఆపి ముందు తిని చూపి టేస్ట్ చెప్పమని ధాన్యలక్ష్మి అంటుంది. ఇక అన్నం కలిపి తిన్న రాజ్.. అబ్బా ఇవాళే ఉప్పు తక్కువ అవ్వాలా అనుకుంటాడు. అయినా బయటకు చాలా రుచిగా ఉన్నాయని అంటాడు. రాజ్ అబద్ధం చెప్పడానికైనా అర్థం ఉండాలని ధాన్యలక్ష్మి అంటే.. అయ్యో అలా అనకు.. ఇక్కడ చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. నిన్నమొన్నటి దాకా పెళ్లాన్ని వదిలేసి తిరిగిన రాజ్.. ఇవాళ ఇంత దారుణంగా ఉన్న వంటని కూడా మెచ్చుకుంటున్నాడు అంటే ఏంటి అర్థం? ఇప్పుడు యావధాస్తి కావ్య పేరు మీదే ఉంది కాబట్టి అని రుద్రాణి అంటుంది. రాజ్ నీలాగే మేము కూడా నటిస్తాంలే అని ధాన్యలక్ష్మి అంటుంది. ఆపండి.. ఆస్తుల కోసం ఒకర్ని పొగిడి భజన చేసి బ్రతికే అలవాటు నాకు పట్టలేదని రాజ్ చేయి కడిగేసి వెళ్తాడు. మీరు తినండి.. కడుపు నిండా తినండి. మనుషుల్లా ప్రవర్తించండి. ఉదయం లేస్తే ఆస్తి.. ఆస్తి అని చస్తారని కావ్య తిట్టేసి వెళ్తుంది.
అప్పూ ప్రేమ..
ఆ తర్వాత కళ్యాణ్‌కి అప్పూ ఫోన్ చేస్తుంది. అప్పూ ఫోన్ చూసి కళ్యాణ్ టెన్షన్ పడుతూ ఫోన్ ఎత్తుతాడు. ఏంటి కూచి ఏం చేస్తున్నావని అడుగుతుంది. పాట రాస్తున్నాని కళ్యాణ్ అంటాడు. అవునా.. విరహ గీతం రాస్తున్నావా అని అప్పూ అంటుంది. ఇంతకీ నీ ట్రైనింగ్ ఎలా ఉందని కళ్యాణ్ అడిగితే.. ఏం చెప్పమంటావులే.. ఈ చలి కాలంలో కాళ్లు, చేతులు వణికినా వదిలి పెట్టడం లేదని అప్పూ అంటుంది. పోలీస్ ట్రైనింగ్ అంటే అలానే ఉంటుందని కళ్యాణ్ అంటే.. నా గురించి కూడా నేను ఆలోచించడం లేదు. నా గురించి నువ్వు ఎంతో మందితో మాటలు పడ్డావు. నిన్ను గర్వంగా తల ఎత్తుకునేలా చేయడానికే కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తున్నానని అప్పూ అంటుంది. ఇక ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..