ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. నేను కేవలం నీ పాదాల దగ్గర ఓ దీపం వెలిగించి.. సౌభాగ్యం కావాలని కోరితే.. మొత్తం ఐశ్వర్యాన్నే తీసుకొచ్చి పెడతావా.. ఇదేనా నీ స్వార్థం? నువ్వు గోవర్థన గిరిని చిటికెన వేలితో ఎత్తావు. అంతకన్నా ఈ బాధ్యత నాకు చాలా బరువు. నా భర్త మనసు మార్చి.. నా మనసు తేలిక చేస్తావు అని ఆశ పెడితే.. నా నెత్తిన ఇంత బరువు పెట్టి నన్ను నడవమంటావా.. ఇదెక్కడి న్యాయం కృష్ణా అంటూ కావ్య ప్రశ్నిస్తుంది. అప్పుడే ఇందిరా దేవి వచ్చి.. ఇక్కడేం చేస్తున్నావ్? నీకు ఏది ఇవ్వాలో ఆ దేవుడికి బాగా తెలుసు అని అంటుంది. కానీ నేను కోరుకున్నది ఇవ్వలేదు కదా అని కావ్య అంటే.. ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆ భగవంతుడికి బాగా తెలుసు. కౌరవులు, పౌండవులు యుద్ధం వెళ్లిన సమయంలో అర్జునుడికి నీకు సైన్యం కావాలా.. నేను కావాలా అని అడిగాడు. అప్పుడు అర్జునుడు.. నువ్వే కావాలి అశ్వద్ధామా అని అన్నాడు. అన్ని కోట్ల సైన్యం కంటే.. కృష్ణుడే కావాలని అడిగాడు. అటువంటి కృష్ణుడినే నువ్వు వేడుకుంటున్నావు. ఆ జగద్గురువే నీకు రక్షణ కల్పిస్తాడు. నీకు తోడును కూడా ఇస్తాడు. ఈ ఆస్తి, ఐశ్వర్యం నీ చేతిలోకి వచ్చిందంటే.. అది ఆ స్వామి కటాక్షం కాకపోతే ఇంకేంటి? చెప్పు.. ఇంకేం కాదనకుండా బాధ్యత తీసుకోమని ఇందిరా దేవి కావ్యని అంటుంది.
చాలా సంతోషంగా ఉంది అమ్మా.. ఆస్తి అపాత్రాధానం కాకుండా ఆ భగవంతుడే అడ్డు పడ్డాడు. సమయానికి ఈ వీలునామా మన చేతికి వచ్చేలా చేశాడు. ఆస్తి ఎవరి పేరు మీద రాసినా.. ఈ రాబంధువులు వాటాలు అడక్కుండా ఉండలేరని అర్థమైంది. అందుకే మా నాన్న దూరం ఆలోచించి.. యావధాస్తి మొత్తం నీ పేరు మీద రాశాడు. ఇంతకంటే మంచి పరిష్కారం మరొకటి లేదని సుభాష్ అంటాడు. ఇంత బాధ్యత నా మీద ఎలా? చిన్న అత్తయ్యా కోర్టుకు వెళ్తాను అంటున్నారు. రుద్రాణి గారు ఎగదోస్తున్నారు? వాళ్లను ఎదుర్కోవడం నా వల్ల అవుతుందా? అని కావ్య అంటే.. చూడమ్మా ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా చేసేది ఏమీ లేదు. నాన్న పక్బందీగా వీలునామా రాశాడు. నువ్వేం భయపడకు.. నీ వెనుక మేము ఉన్నామని సుభాష్ అంటే.. ధైర్యంగా ముందుకు అడుగు వేయి కావ్యా.. నీకు నీ అత్తామామల సపోర్టే కాదు.. మా అత్తామామల సపోర్ట్ కూడా ఉంటుందని అపర్ణ అంటుంది. ఇక కావ్య చేతికి వీలునామా, తాళాలు ఇస్తారు.
మీరు ఎంతో సులువుగా ఈ బరువును దించేసుకున్నారు. నా నెత్తి మీద ఎంత పెద్ద బాధ్యత ఉంచారో మీకు అర్థమవుతుందా? మీ అనుభవం ఎక్కడ? నా వయసు ఎక్కడ? మీరు బాగానే ఉంటారు.. నాకే కత్తి మీద సాములా ఉంటుందని కావ్య అంటుంది. ఈ సాము ఇప్పుడు కాదమ్మా.. ఎప్పటికైనా చేయాల్సిందే. ఇది మావయ్య గారి నిర్ణయమని అపర్ణ అంటుంది. ఈ ఇల్లు, ఆస్తి, కుటుంబం ముక్కలు కాకూడదనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ధైర్యంగా ఉండమని ఇందిరా దేవి చెబుతుంది. వీళ్లు ఇలాగే మాట్లాడతారు. ఆయనకు చెప్పి ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరకు వచ్చి.. ఆ పేపర్స్, తాళాలు పెడుతుంది. ఇవి ఏంటి? అని రాజ్ అడిగితే.. ఇవి కూడా తెలియకుండా అంత పెద్ద కంపెనీకి ఎలా ఎండీ అయ్యారని కావ్య అడుగుతుంది. అది తెలుసు.. కానీ నా దగ్గర ఎందుకు పెడుతున్నావని రాజ్ అడుగుతాడు. ఇందాక అత్తయ్య, మావయ్యలు వచ్చి ఇవి నాకు ఇచ్చారు. వీటిని ఎక్కడ దాయాలో నాకు తెలీక.. మీకు ఇస్తున్నా.. హమ్మయ్య ఒక పని అయిపోయింది. ఖర్చులు, బాధ్యతలు అంటూ పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అవి చూసుకోండి.. నాకు ఏం అర్థం కాలేదని కావ్య అంటుంది.
ఏంటి కామెడీ చేస్తున్నావా.. తాతయ్య అంత క్లియర్‌గా వీలు నామా రాశాక.. మళ్లీ ఇవి ఇక్కడ పెట్టి వెళ్లిపోతే ఏంటి అర్థం? అని రాజ్ అడిగితే.. ఈ ఇంటి గురించి నా కంటే మీకే ఎక్కువగా తెలుసు.. కాబట్టి మీకే అర్థం అవుతుందని కావ్య అంటే.. నాకు అవసరం లేదని రాజ్ అంటాడు. అందరూ ఇలా చెప్పి తప్పించుకుంటే ఎలా? అని కావ్య అంటుంది. లేకపోతే ఏంటి? ఈ ఇంట్లో అందరి కంటే నువ్వే తెలివైనదానివి.. సమర్థురాలివి అని తాతయ్య గారు నమ్మారు కాబట్టి.. నీకు ఆస్తి రాశారని కావ్య అంటే.. ఏమోనండి నాకేం అర్థం కావడం లేదు.. కావాలంటే తాతయ్య గారు వచ్చాక నేను చెప్పి ఒప్పిస్తానని కావ్య అంటే.. అలా ఒకరు ఇస్తే నేను తీసుకోను.. ఏదైనా నేనే సంపాదించుకోవాలని రాజ్ అంటాడు. ఏవండీ మీ ఆస్తే మీకు ఇస్తున్నాను.. ఏంటండీ కాలికి వేస్తే.. వేలికి.. వేలికి వేస్తే కాలికి వేస్తున్నారని కావ్య అంటే.. కళావతి.. నేను ఆవేశంతో మాట్లాడటం లేదు.. ఆలోచించి చెబుతున్నా.. ఈ బాధ్యతలన్నీ తీసుకోవడానికి నువ్వే కరెక్ట్.. ఆ తాళాలు నీ చేతిలో ఉంటేనే సేఫ్‌గా ఉంటాయి. తాతయ్య పెట్టిన నమ్మకం నువ్వు నిలబెడతావు అనుకుంటున్నా అని రాజ్ అంటాడు.
మరోవైపు రుద్రాణి, రాహుల్‌లు బాధ పడుతూ ఉంటారు. ఎన్ని ప్లాన్లు వేసినా అన్నీ బూడితలో పోసిన పన్నీరు అయిపోయాయి. ఆ కావ్య చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అనుకున్న ప్రతీ సారి.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి షాక్ ఇస్తుంది. దీని నుంచి మనం కోలుకోగలమా అని రాహుల్ అంటే.. అప్పుడే అనుకున్నది ఒక్కటి.. అంటూ సాంగ్ పెడుతూ స్వప్న వస్తుంది. అసలే చిరాకులో ఉన్నాను.. మళ్లీ చిరాకు తెప్పించకు.. నాకు కోపం పెరిగిందంటే అని రుద్రాణి అంటే.. ఏం చేస్తారు ఏంటి? అని స్వప్న అడిగితే.. నేను ఉరివేసుకుని చచ్చి.. అందుకు కారణం నువ్వే అని రాసి పెడతానని రుద్రాణి అంటుంది. మాకు అంత అదృష్టం లేదని స్పప్న అంటే.. ఓసేయ్ పిచ్చిదానా.. మాకు నష్టం జరిగితే నీకు కూడా జరిగినట్టే.. మొత్తం ఆస్తి అంతా నీ చెల్లెలు నొక్కేసింది. ఆ విషయం అర్థమవుతుందా అని రుద్రాణి అంటే.. అందుకే సంతోష పడుతున్నానని స్వప్న అంటుంది. ఈ ఇంటి పగ్గాలు దాని దగ్గరకు వెళ్తే.. సొంత చెల్లి దగ్గరే చేయి చాచుకోవాల్సిన పరిస్థితి వస్తుందని రుద్రాణి అంటే.. అడుగుతాను అందులో ఇబ్బంది ఏంటి? అని స్వప్న అంటుంది. అలా అడగాలంటే సిగ్గుగా అనిపించడం లేదా? అసలు నువ్వు నా కోడలివేనా అని రుద్రాణి అంటే.. అందుకనేగా చాలా సార్లు నన్ను ఇంట్లోంచి పంపించేయాలని, నా కడుపు పోగొట్టాలని చూశారు. మరి ఇప్పుడు సడెన్‌గా ఇవన్నీ గుర్తుకు వచ్చేశాయా అని స్వప్న అంటే.. దాని చేతి నుంచి ఆస్తి ఎలా లాక్కోవాలో నాకు బాగా తెలుసని రుద్రాణి అంటే.. మిమ్మల్ని ఎలా ఆపాలో నాకు కూడా బాగా తెలుసు. మీరు కావ్య కాళ్లు పట్టుకోవాలా అని స్వప్న అంటుంది.
మరోవైపు ధాన్య లక్ష్మి లాయర్‌తో మాట్లాడుతుంది. అది విన్న ప్రకాశం.. ఏంటి లాయర్‌తో మాట్లాడుతున్నావా.. కావ్య మీద కేసు వేస్తున్నావా.. లాయర్ కేసు తీసుకుంటా అన్నాడా అని అడిగితే.. వాదించి గెలుస్తానని కూడా అన్నాడని ధాన్యలక్ష్మి అంటుంది. అంటాడు .. కేసు తీసుకునే ముందు వంద కారణాలు చెబుతాడు. కానీ వాడు నీ దగ్గర లక్షలు గుంజడానికి.. అసలు నీకు ఏ అధికారం ఉందని కేసు వేస్తున్నావని ప్రకాశం అడిగితే.. నాకే లేకపోతే కళ్యాణ్‌కు ఉందని ధాన్యలక్ష్మి అంటుంది. నువ్వు అడగ్గానే వాడు వదిన మీద కేసు వేస్తాడు అనుకుంటున్నావా.. నీ పోరు భరించలేకనే వాడు బయటకు వెళ్లిపోయాడు. వాడు నీ మాట ఎలా వింటాడని ప్రకాశం అంటాడు. వేస్తాడని ధాన్యలక్ష్మి అంటే.. అలాంటి అవసరం కళ్యాణ్‌కు ఉంటే తన అస్తిత్వం కోసం బయటకు వెళ్లి పోరాడడు. ఇంట్లోనే ఉంటాడని ప్రకాశం అంటాడు.
ఆ తర్వాత ఇందిరా దేవికి ట్యాబ్లెట్స్ ఇస్తుంది కావ్య.. బావ గురించి ఏమన్నా చెప్పాడా అని అడుగుతుంది పెద్దావిడ. ఇక రుద్రాణి తన పుల్ల విరుపు మాటలు ఆడుతూ ఉంటుంది. ఇక అప్పుడే కనకం ఇంటికి వస్తుంది. కనకం గుమ్మం దగ్గరే ఆగిపోతే.. అపర్ణ చూసి రమ్మంటుంది. ఎలా ఉన్నారు? ఇలా అవుతుందని అనుకోలేదు. విషయం తెలిసిన దగ్గర నుంచి మీ గురించే ఆలోచన ఎక్కువైపోయిందని కనకం అడిగితే.. అవును పాపం నిద్ర కూడా కరువైపోయిందని రుద్రాణి కావాలనే అంటుంది. ఇదీ వీళ్ల వరుస.. నువ్వు అనవసరంగా వచ్చి నీ ప్రశాంతత కూడా పోగొట్టుకోవడం తప్ప ఏమీ లేదని ఇందిరా దేవి అంటే.. మీరు ఇలా ఉంటే చూడకుండా ఎలా ఉంటానని కనకం అంటుంది. అయినా తగ్గని రుద్రాణి.. కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఇక ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..