Brahmamudi, May 22nd Episode: అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన మాయ, రుద్రాణిలు.. ఫ్రస్ట్రేట్‌లో రాజ్!

|

May 22, 2024 | 12:50 PM

ఇవాళ బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. మాయను ఇంటికి తీసుకొస్తుంది కావ్య. అత్తయ్య నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మాయను ఇంటికి తీసుకొచ్చాను. ఇంకా ఎందుకు అలా నిలబడి ఉన్నావు. నువ్వు చేసిన ఘన కార్యం గురించి అందరికీ చెప్పు అని అంటుంది కావ్య. ఇంత పెద్ద కుటుంబంలో నా మూలంగా ఎన్నో కలతలు వచ్చాయని తెలిసింది. మీరు చేసిన పని వల్ల మీరంతా వేదనకు గురయ్యారు. ఈ సమయంలో అయినా నేను ఇంటికి రాకపోతే.. ఇంకా పెద్ద గొడవలు అవుతాయని కావ్య చెప్పింది. నా వల్ల మొదలైన ఈ పరిస్థితి..

Brahmamudi, May 22nd Episode: అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన మాయ, రుద్రాణిలు.. ఫ్రస్ట్రేట్‌లో రాజ్!
Brahmamudi
Follow us on

ఇవాళ బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. మాయను ఇంటికి తీసుకొస్తుంది కావ్య. అత్తయ్య నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మాయను ఇంటికి తీసుకొచ్చాను. ఇంకా ఎందుకు అలా నిలబడి ఉన్నావు. నువ్వు చేసిన ఘన కార్యం గురించి అందరికీ చెప్పు అని అంటుంది కావ్య. ఇంత పెద్ద కుటుంబంలో నా మూలంగా ఎన్నో కలతలు వచ్చాయని తెలిసింది. మీరు చేసిన పని వల్ల మీరంతా వేదనకు గురయ్యారు. ఈ సమయంలో అయినా నేను ఇంటికి రాకపోతే.. ఇంకా పెద్ద గొడవలు అవుతాయని కావ్య చెప్పింది. నా వల్ల మొదలైన ఈ పరిస్థితి.. నా వల్లే చక్కబడాలని వచ్చాను. ఆ బిడ్డకు తల్లిని నేనే అని మాయ చెప్తే.. మరి తండ్రి ఎవరు? అని రుద్రాణి అడుగుతుంది. రాజ్ అని చెప్తుంది. దీంతో కావ్యకు, రాజ్‌కు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇంట్లోని మిగతా సభ్యులు కూడా షాక్ అవుతారు. ఇక మాయ వీర లెవల్లో యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. రాజ్ ఇంకా నన్నూ, నా బిడ్డను ఎందుకు వేరు చేస్తావ్. బిడ్డను తీసుకోబోతుండగా.. రాజ్ ఇవ్వడు. నన్ను క్షమించు రాజ్. నీకు మాట ఇచ్చినట్టే కడుపు తీపి చంపుకుని.. నా బిడ్డకు ఈ ఇంటి వారసత్వం కల్పించమని చెప్పాను. అందుకే ఇంత కాలం దూరంగా ఉన్నాను అని మాయ చెప్తుంది. కావ్య వైపు రాజ్ కోపంగా చూస్తాడు.

కావ్యని ఇంట్లోంచి పంపించేయండి..

ఏంటి.. అందరూ అలా శిలా ప్రతిమల్లా నిలబడి పోయారేంటి? ఏం జరుగుతుందో అర్థం కావడం లేదా అని రుద్రాణి అంటుంది. ఎవరూ నన్ను నిలదీయక ముందే నేనే నిజం చెప్తాను. నేను ఎవరూ లేని అనాథను. ఒంటరిగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్నా. అనుకోకుండా నా జీవితంలోకి రాజ్ వచ్చాడు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అనుకోకుండా ఒకనాడు ఇద్దరం ఒకటి అయ్యాం. దీంతో నేను గర్భవతిని అయ్యాను. రాజ్ నన్ను మోసం చేయడన్న నమ్మాను. కానీ ఇంత పెద్ద కుటుంబంలోకి నన్ను తీసుకు రావడానికి రాజ్‌కి ధైర్యం సరిపోలేదు. రాజ్‌ని బ్రతిమలాడి.. బిడ్డను అయినా తీసుకెళ్లమని ప్రాధేయపడ్డాను. అలా నా బిడ్డను ఇంటికి తీసుకొచ్చాడు. నీకు న్యాయం చేస్తానని కావ్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందని మాయ చెప్తుంది.

కావ్యకు అన్యాయం చేస్తారా..

ఇన్నాళ్లూ కావ్య అంత గట్టిగా చెప్తే.. రాజ్ తప్పు చేయడులే అని నమ్మాను. కానీ వయసు ప్రభావం.. మనసు మీద బాగా చూపించింది. కావ్య అంచనా తలకిందులైంది. ఎంత త్యాగమూర్తివి అమ్మా.. ఇన్నాళ్లూ సవతి బిడ్డను నీ బిడ్డగా చూసుకున్నావా? ఇవాళ ఏకంగా సవతినే తీసుకొచ్చి అందరి ముందూ నిలబెట్టావ్. కానీ ఎలా తీసుకు రాగలిగావ్? బిడ్డకు తల్లిని తీసుకొచ్చావో.. రాజ్‌కి భార్యని తీసుకొచ్చావో నాకేం అర్థం కావడం లేదని రుద్రాణి అంటుంది. ఇప్పటిదాకా ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఇప్పుడు నిజం బయట పడింది కదా.. ఆ బిడ్డకు, తల్లికి న్యాయం చేస్తారా? లేక కావ్యకు అన్యాయం చేస్తారా? ఏం చేస్తారని.. ధాన్య లక్ష్మి కూడా అడుగుతుంది. అయ్యో ధాన్య లక్ష్మీ.. కావ్యనే తన తాళి బొట్టుతో తన గొయ్యిని తవ్వుకుంది. తన సౌభాగ్యాన్ని, బొట్టును దూరం చేసుకుందని ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంది. రాజ్‌కు బిడ్డ అయిన మాయ మాత్రమే ఈ ఇంటి కోడలిగా స్థానం ఉంటుందని రుద్రాణి చెప్తుంది.

ఇవి కూడా చదవండి

పళ్లు రాలగొట్టి చేతిలో పెడతాను..

హలో మర్యాద రామక్కా.. పోయి పోయి నువ్వే తీర్పు చెప్పాలి. నా మెంటల్ చెల్లికే మతి లేదనుకుంటే.. నీకసలు బ్రెయినే లేదు. అప్పుడే ఎవరి స్థానం ఏంటి అనేది.. ఉన్నారు కదా ఈ ఇంట్లో పెద్దలు.. వాళ్ల మనవడు చేసిన తప్పుకు నా చెల్లికి శిక్ష వేస్తారా? అని స్వప్న నిలదీస్తుంది. ఆ తర్వాత మళ్లీ రుద్రాణి కావాలనే అందర్నీ రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. చాలు ఆపు రుద్రాణి.. నీ అమూల్యమైన అభిప్రాయాలతో మాకు పని లేదు. ఇక నువ్వు నోరు మూసుకోకపోతే.. పళ్లు రాళ్ల కొట్టి చేతిలో పెడతానని రుద్రాణికి పెద్దావిడ వార్నింగ్ ఇస్తుంది.

బిడ్డ తల్లిగా ఇంటి కోడలికే కదా అధికారం ఉంటుంది..

నేను మొదటి నుంచీ నీ ప్రయత్నాలు ఆపమని చెబుతూనే ఉన్నాను. కానీ నువ్వు ఆగడం లేదు. నిజాన్ని అబద్ధం అనుకున్నావు.. చివరికి నీ స్థానాన్ని నువ్వే ప్రశ్నార్థకంగా మార్చుకున్నావ్? ఇంతకన్నా తప్పు ఇంకొకటి ఉంటుందా? అని ఇందిరా దేవి అంటుంది. అమ్మా తప్పు గురించి పక్కన పెట్టు.. ఒప్పు గురించి చెప్పు. ఆ బిడ్డ తల్లిగా ఇంటి కోడలికే కదా అధికారం ఉంటుందని రుద్రాణి అంటుంది. చాలు ఆపు.. కావ్య వైపు నుంచి ఏ తప్పూ లేదు. పైగా కావ్యని అందరి సమక్షంలో అగ్నిసాక్షిగా తాళి కట్టి రాజ్ పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి కావ్యకు అన్యాయం జరగడానికి వీలు లేదు. అయ్యో భగవంతుడా.. ఇదేంటి ఇలా జరుగుతుంది. ఇప్పుడు నిజం బయట పెడితే.. మావయ్య దోషి అని చెప్పాల్సి ఉంటుందని కావ్య మనసులో అనుకుంటుంది.

ఇక్కడే మాయ ఉంటుంది..

ఆ తర్వాత ఏంటండీ నాకేం అర్థం కావడం లేదండి. ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడాలో తెలీడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? వీళ్ల ముగ్గుర్ని ఏం చేయాలి? అని అపర్ణ బాధతో మాట్లాడుతుంది. అమ్మా అపర్ణా.. ఇప్పుడు అందరి మనసులు అల్ల కల్లోలంగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఎవరూ ఏ నిర్ణయం చెప్పకూడదు. కొంచెం సమయం తీసుకుంది. అప్పటివరకూ మాయ ఇక్కడే ఉంటుందని సీతారామయ్య అంటాడు.

ఆ మాయ.. ఈ మాయ కాదు.. సీరియస్ అయిన రాజ్..

ఈ సీన్ కట్ చేస్తే.. కావ్య, రాజ్‌, సుభాష్‌లు ఇంటి పైన నుంచొని ఉంటారు. ఏంటే నువ్వు చేసిన పని.. ఎక్కడికి వెళ్లావ్? ఏం చేసి తిరిగొచ్చావ్? ఉన్న సమస్యలు చాలవు అన్నట్టు ఇంకో సమస్యను మా నెత్తిన తీసుకొచ్చి పెట్టావ్. ఇంత వెర్రిదానివి ఏంటే.. ఆ మాయ ఎక్కడ.. ఈ మాయ లేడీ ఎక్కడ తగిలింది నీకు? పైగా నన్ను తండ్రిని చేయడం ఏంటే? నిప్పుని తీసుకొచ్చి.. నన్ను అంటించావ్ ఏంటి? అది అబద్ధమని ఎందుకు చెప్పలేదు? ఏమైంది? అని రాజ్ ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఒరేయ్ కాసేపు ఆగు. అంతా గందరగోళంగా ఉంది. ఏంటమ్మా కావ్యా ఇది.. అసలు మాయ ఇంటి అడ్రెస్ నేను ఇచ్చాను కదా.. అక్కడకు వెళ్లలేదా.. ఆ మాయను కలుసుకోలేదా.. ఈ మాయ ఎక్కడ తగిలింది నీకు అని సుభాష్ అంటాడు.

బెడిసి కొట్టిన కావ్య ప్లాన్.. పాపం కళావతి..

ఇదెక్కడ దొరికింది నాకు? ఏం సాధించాలని వెళ్లింది? నాకు ఏం సాధించింది? అష్ట దరిద్రాల్లో ఆఖరి దరిద్రాన్ని కూడా అంటగట్టేసింది నాకు అని రాజ్ సీరియస్ అవుతాడు. రేయ్ కావ్యకి మాట్లాడే అవకాశం ఇవ్వు. మావయ్య గారూ ఇందులో నా తప్పు ఏం లేదు. మీరు ఇచ్చిన అడ్రెస్ ప్రకారమే వెళ్లాను. అక్కడ ఈ అమ్మాయి ఉంది. తనే మాయ అని నమ్మించిందని కావ్య చెప్తుంది. కనీసం దాని ఫొటో తీసి నాకో.. డాడీకో పంపించాలని కన్ఫర్మ్ చేసుకోవాలని ఆలోచన రాలేదా అని రాజ్ అంటాడు. రాలేదు.. అక్కడ మాయ కాకపోతే ఇంకెవరు ఉంటారని నేను అనుకుంటాను. మీ లాగే నేనూ మోసపోయాను. ఈ అమ్మాయి మీకు తెలుసు కదా.. ఈమె మాయ కాదని మీరెందుకు నిలదీయలేదు? అసలు అక్కడ జరిగింది చెప్తుంది కావ్య. అక్కడ అలా చెప్పి.. ఇక్కడికి వచ్చాక ఈ పెంట పెట్టింది. అసలు నాకేం అర్థం కావడం లేదు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో రేపటి ఎపిసోడ్‌లో ఇంటికి వచ్చిన మాయ.. రుద్రాణి కలిసి ఈ నాటకం ఆడతారని తెలుస్తుంది.